బహుభార్యత్వంపై మీ స్పందన ఏంటీ- కేంద్రానికి సుప్రీంకోర్టు నోటీసులు

దేశంలో ముస్లిం మహిళల హక్కులు, సామాజిక భద్రతకు సంబంధించి ఓ కీలక అంశం సుప్రీంకోర్టు ముంగిటకు వచ్చింది. ముస్లిం సామాజిక వర్గంలో చాలా కాలంగా కొనసాగుతున్న బహుభార్యాత్వ (Polygamy) పద్ధతిపై దేశవ్యాప్తంగా నిషేధం విధించాలంటూ దాఖలైనఓ పిటిషన్‌ను విచారణకు స్వీకరించింది. దీనిపై కేంద్ర ప్రభుత్వానికి నోటీసులు జారీ చేసింది. లిఖితపూరకంగా వివరణ ఇవ్వాలని సూచించింది.

భారతీయ ముస్లిం మహిళా ఆందోళన్ అనే ఓ స్వచ్ఛంద సంస్థ ఈ పిటిషన్‌ను దాఖలు చేసింది. జకియా సోమన్ దీన్ని దాఖలు చేశారు. ముస్లిం సామాజికవర్గంలో పురుషులు ఒకరి కంటే ఎక్కువ మందిని వివాహం చేసుకునే ప్రక్రియ రాజ్యాంగ విరుద్ధమని, ఇది మహిళల ఆత్మగౌరవాన్ని దెబ్బతీస్తోందని వాదించారు. ఈ ఆచారాన్ని అనాదిగా వస్తోన్న సంప్రదాయంగా చూడకూడదని, చట్టరీత్యా తీవ్ర నేరంగా పరిగణించాలని అభ్యర్థించారు.

Supreme Court Notice to Centre Over Plea for Polygamy Ban and Stronger Protection Muslim Women

ముస్లిం సమాజంలో క్షేత్రస్థాయిలో నిర్వహించిన సర్వే నివేదికలను ఆమె తన పిటీషన్ కు జత చేశారు. దేశవ్యాప్తంగా వందలాది మంది ముస్లిం మహిళలు బహుభార్యాత్వ పద్ధతుల వల్ల తీవ్ర గృహ హింస, అణచివేతకు లోనవుతున్నారనే విషయం తమ సర్వేలో తేలిందని అన్నారు. భార్య నుంచి ఎటువంటి అంగీకారం లేకుండా, ఒక్కో సందర్భంలో వారికి తెలియకుండా రెండో వివాహం చేసుకోవడం వల్ల ఆ కుటుంబం ఛిద్రమౌతోందని చెప్పారు.

ఆస్కార్ లెవెల్ వీర యాక్టింగ్- పార్లమెంట్ మకర ద్వారం వద్ద: సినీ ఫక్కీలో ఫినిషింగ్ టచ్
ఆస్కార్ లెవెల్ వీర యాక్టింగ్- పార్లమెంట్ మకర ద్వారం వద్ద: సినీ ఫక్కీలో ఫినిషింగ్ టచ్

ఈ సర్వేలో పాల్గొన్న ఎక్కువ మంది బాధిత మహిళలు తమ భర్త మరొక వివాహం చేసుకోవడంతో తమకు దక్కాల్సిన కనీస ఆర్థిక భద్రత కొరవడినట్లు వాపోయరని వివరించారు. నూతన కుటుంబం ఏర్పడగానే మొదటి భార్య, ఆమె పిల్లలకు కనీస అవసరాలు కూడా తీర్చకుండా నిర్లక్ష్యం చేస్తున్నారని తెలిపారు. ఇలాంటి పరిస్థితుల వల్ల సమాజంలో వారి జీవనం దుర్భరంగా మారుతోందని ఆవేదన వ్యక్తం చేశారు.

ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?
ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?

తమ ప్రమేయం ఏమాత్రం లేకుండా జరిగే ఈ పరిణామాల వల్ల మహిళలు మానసిక అందోళనకు, సామాజిక వివక్షకు గురికావాల్సి వస్తోందని, భార్యను నిర్లక్ష్యం చేయడమే కాకుండా, వారిని ఆర్థికంగా రోడ్డున పడేసే అనేక ఉదంతాలను తమ పిటిషన్‌లో ప్రస్తావించారు. ముస్లిం మహిళల సామాజిక అభద్రతా భావాన్ని తొలగించాలంటే బహుభార్యాత్వాన్ని దేశంలో నిషేధించక తప్పదని పేర్కొన్నారు.

ఈ కేసు విచారణ సందర్భంగా సుప్రీంకోర్టు ధర్మాసనం కీలక వ్యాఖ్యలు చేసింది. ఈ అంశంలో ఉన్న రాజ్యాంగపరమైన సంక్లిష్టతలు, మహిళా హక్కుల రక్షణ కోణాన్ని పరిశీలించింది. ఈ పిటీషన్ పై తన స్పందనను తెలియజేయాలని కేంద్రాన్ని ఆదేశించింది. ముస్లిం సామాజిక వర్గంలో లింగ సమానత్వాన్ని సాధించడానికి ఈ సమస్య తీవ్రతను నిశితంగా అంచనా వేయాల్సిన అవసరం ఉందని న్యాయమూర్తులు అభిప్రాయపడ్డారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+