పహల్గాం ఉగ్రదాడి తర్వాత ఏం జరిగింది?: ప్రధాని మోడీతో సీఎం ఒమర్ అబ్దుల్లా
పహల్గాం ఉగ్రదాడి తర్వాత తొలిసారి జమ్మూకాశ్మీర్ ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా శనివారం ప్రధాని నరేంద్ర మోడీని కలిశారు. ప్రధాని నివాసంలో దాదాపు 30 నిమిషాలపాటు ఈ భేటీ కొనసాగింది. పహల్గాం ఉగ్రదాడి, ఆ తర్వాత జరిగిన పరిణామాలు సహా ఆయా అంశాలపై ఇద్దరు నేతలు ఈ భేటీలో చర్చించారని అధికారిక వర్గాలు వెల్లడించాయి.
ఉగ్రవాదులపై భారత్ ప్రతీకార దాడులకు సిద్ధమవుతోందనే వార్తలు వస్తున్న ప్రధాని మోడీతో ఒమర్ అబ్ధుల్లా భేటీ కావడం ప్రాధాన్యత సంతరించుకుంది. జమ్మూకాశ్మీర్‌కు సంబంధించిన కీలక అంశాలను సీఎం ఒమర్ అబ్దుల్లా ప్రధాని మోడీ దృష్టికి తీసుకొచ్చారు. ముఖ్యంగా ఇటీవలి ఉగ్రదాడి అనంతరం పరిణామాలు, క్షేత్రస్థాయి పరిస్థితులను విరించారు.

ఉగ్రదాడికి వ్యతిరేకంగా పెద్దఎత్తున నిరసనలు జరిగాయని ప్రధానికి సీఎం చెప్పారు. గుర్రం మీద పర్యాటకులను తీసుకెళ్లే పోనీవాలా.. సయ్యద్ అదిల్ హుస్సేన్ షా ఉగ్రవాదుల నుంచి పర్యాటకులను రక్షించేందుకు యత్నించి ప్రాణత్యాగం చేసిన విషయాన్ని ఈ సందర్భంగా ప్రధాని మోడీకి సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు.
VIDEO | Jammu and Kashmir CM Omar Abdullah (@OmarAbdullah) met PM Modi (@narendramodi) at 7 Lok Kalyan Marg in Delhi earlier today.
— Press Trust of India (@PTI_News) May 3, 2025
(Full video available on PTI Videos - https://t.co/dv5TRAShcC) pic.twitter.com/seB0yY1XkY
కాగా, తమ రాష్ట్రానికి వచ్చిన అతిథులను కాపాడటంలో తానూ విఫలమయానని సీఎం ఒమర్ అబ్దుల్లా జమ్మూకాశ్మీర్ అసెంబ్లీ వేదికగా ఇటీవల ప్రకటించిన విషయం తెలిసిందే. 26 మంది ప్రాణాలు కోల్పోయిన వేళ.. రాష్ట్ర హోదా ఇవ్వండని కేంద్రాన్ని అడగడం సిగ్గుచేటే అవుతుందని వ్యాఖ్యానించారు. ఇలాంటి ఉగ్రదాడులు జరగకుండా అడ్డుకునే ప్రయత్నం చేస్తామన్నారు.
కాగా, ఏప్రిల్ 22న పహల్గాంలోని బైసరన్ లోయలో ఏప్రిల్ 22న పర్యాటకులపై ఉగ్రవాదులు కాల్పులు జరిపి 26 మంది ప్రాణాలు తీసిన విషయం విధితమే. ఉగ్రదాడులు అనంతరం భద్రతా బలగాలు ఉగ్రవాదుల వేటను తీవ్రతరం చేశాయి. సరిహద్దు ప్రాంతాలతోపాు జమ్మూకాశ్మీర్ వ్యాప్తంగా ఉగ్రవాదుల కోసం జల్లెడపడుతున్నారు.
పలువురు ఉగ్రవాదులకు సంబంధించిన నివాసాలను భద్రతా బలగాలు ధ్వంసం చేశాయి. ఉగ్రవాదులకు సహకరించిన పలువురిని అదుపులోకి తీసుకుని విచారిస్తున్నాయి. ఈ విచారణలో పలు కీలక విషయాలు వెలుగుచూశాయి. ఉగ్రవాదులు పక్కా ప్లాన్ ప్రకారమే ఈ దాడులకు పాల్పడ్డారు.
ఏప్రిల్ 15నే పహల్గాం చేరుకున్న ఉగ్రవాదులు దాడికి కుట్ర పన్నారు. బైసరన్ వ్యాలీ ప్రాంతం తమకు అనుకూలంగా ఉండటంతో ఇక్కడే పర్యాటకులపై దాడులకు పాల్పడ్డారని విచారణలో భద్రతా బలగాలు తెలుసుకున్నాయి. ఉగ్రవాదులకు స్థానికులు కొంతమంది సహరించినట్లు ఎన్ఐఏ గుర్తించింది. పలువురిని అరెస్ట్ చేసి విచారిస్తున్నారు. మరోవైపు, పహల్గాం ఉగ్రదాడికి సూత్రధారి అయిన పాకిస్థాన్‌పై కఠిన చర్యలు తీసుకుంటోంది భారత్. తాజాగా, ఆ దేశానికి ఎగుమతులు, దిగుమతులు రద్దు చేసి భారీ షాకిచ్చింది.












Click it and Unblock the Notifications