Explained:రెండో టాలీవుడ్ హబ్‌గా అమరావతి.. ఏపీ వైపు ఇండస్ట్రీ చూపు..!!

తెలుగు చలనచిత్ర పరిశ్రమ అంటే ఇప్పటి వరకు అందరికీ గుర్తుకు వచ్చేది హైదరాబాద్. దశాబ్దాలుగా టాలీవుడ్‌కు కేంద్ర బిందువుగా ఉన్న ఈ నగరం నుంచి వేలాది మంది కళాకారులు, సాంకేతిక నిపుణులు, నిర్మాతలు తమ ప్రయాణాన్ని కొనసాగిస్తున్నారు. అయితే ఇప్పుడు పరిస్థితులు క్రమంగా మారుతున్నాయి. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి టాలీవుడ్‌కు రెండో కేంద్రంగా అవతరించే అవకాశాలు కనిపిస్తున్నాయి. రాష్ట్ర విభజన తర్వాత సినిమా పరిశ్రమను ఏపీకి తీసుకురావాలనే చర్చలు అనేకసార్లు తెరపైకి వచ్చినా పెద్దగా పురోగతి కనిపించలేదు.కానీ ఇప్పుడు రాజకీయ,భౌగోళిక,మౌలిక సదుపాయాల పరంగా ఏర్పడుతున్న అనుకూల పరిస్థితులు అమరావతిని సినీ పరిశ్రమకు ఆకర్షణీయ గమ్యస్థానంగా మారుస్తున్నాయి.

ప్రకృతి అందాలతో నిండిన ఏపీ.. షూటింగ్‌లకు స్వర్గధామం

సినిమా షూటింగ్‌లకు అవసరమైన వైవిధ్యభరితమైన లొకేషన్లు ఆంధ్రప్రదేశ్‌లో పుష్కలంగా ఉన్నాయి. విశాఖపట్నం సముద్రతీరాలు, అరకు లోయ, లంబసింగి కొండలు, ఉభయ గోదావరి జిల్లాల పచ్చని ప్రకృతి, మారేడుమిల్లి అడవులు, గండికోట లోయలు, శ్రీశైలం పరిసర ప్రాంతాలు ఇప్పటికే పలువురు దర్శకులను ఆకర్షిస్తున్నాయి.ఇటీవలి కాలంలో అనేక తెలుగు, హిందీ, వెబ్ సిరీస్ ప్రాజెక్టులు ఈ ప్రాంతాల్లో చిత్రీకరణ జరుపుకున్నాయి.సహజసిద్ధమైన అందాలు,తక్కువ ఖర్చుతో లొకేషన్లు లభించడం సినీ నిర్మాతలకు అదనపు ప్రయోజనంగా మారింది.

amaravati-as-the-next-tollywood-hub-andhra-pradesh-eyes-a-second-telugu-film-industry-base

పవన్ కళ్యాణ్, బాలకృష్ణ ఫ్యాక్టర్ కలిసొస్తుందా?

ప్రస్తుతం ఆంధ్రప్రదేశ్ రాజకీయాల్లో కీలక స్థానాల్లో ఉన్న ఇద్దరు ప్రముఖ సినీ వ్యక్తులు ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్,హిందూపురం ఎమ్మెల్యే నందమూరి బాలకృష్ణ.సినీ పరిశ్రమ అవసరాలు, సమస్యలు, పెట్టుబడుల ప్రాముఖ్యతపై వీరికి ప్రత్యక్ష అవగాహన ఉండటం పరిశ్రమ అభివృద్ధికి సహకరించే అంశంగా భావిస్తున్నారు.స్టూడియోలు,ఫిల్మ్ సిటీలు,పోస్ట్ ప్రొడక్షన్ కేంద్రాలు,స్కిల్ డెవలప్‌మెంట్ సంస్థలకు ప్రత్యేక ప్రోత్సాహకాలు ఇవ్వాలనే ఆలోచనలు కూడా చర్చల్లో ఉన్నట్లు సమాచారం.గత ప్రభుత్వంలో కూడా టాలీవుడ్ ఇండస్ట్రీ పెద్దలు అప్పటి ముఖ్యమంత్రి జగన్‌ను కలిసి దీనిపై చర్చించారు. ఇక ఈ ప్రభుత్వంలో స్వయంగా డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బాలకృష్ణ వంటి వారుండటం, పైగా మంత్రి లోకేష్ కూడా ఇంట్రెస్ట్ చూపిస్తుండటంతో వేగవంతంగా అడుగులు ముందుకు పడే అవకాశాలు కనిపిస్తున్నాయి.

అమరావతిలో ఫిల్మ్ సిటీ కల నిజమవుతుందా?

హైదరాబాద్‌లో అభివృద్ధి చెందిన భారీ ఫిల్మ్ స్టూడియోలు టాలీవుడ్‌ను దేశంలోనే అగ్రస్థానానికి చేర్చాయి. ఇప్పుడు అదే తరహాలో అమరావతి పరిసర ప్రాంతాల్లో ఆధునిక ఫిల్మ్ సిటీ,డిజిటల్ స్టూడియోలు,VFX హబ్‌లు,OTT కంటెంట్ ప్రొడక్షన్ కేంద్రాలు ఏర్పాటు చేసే అవకాశం ఉందని సినీ వర్గాలు అంచనా వేస్తున్నాయి.దేశవ్యాప్తంగా OTT మార్కెట్ వేగంగా పెరుగుతున్న నేపథ్యంలో కొత్త ప్రొడక్షన్ కేంద్రాలకు డిమాండ్ పెరుగుతోంది.ఈ అవకాశాన్ని ఏపీ ప్రభుత్వం వినియోగించుకుంటే అమరావతి కొత్త సినీ గమ్యస్థానంగా మారే అవకాశం ఉంది.

ఉపాధి అవకాశాలకు భారీ ఊతం

సినిమా పరిశ్రమ కేవలం నటీనటులకు మాత్రమే పరిమితం కాదు.దీనివల్ల వేలాది మంది సాంకేతిక నిపుణులు,కెమెరా సిబ్బంది,లైటింగ్ నిపుణులు,ఎడిటర్లు,మేకప్ ఆర్టిస్టులు,ట్రావెల్,హోటల్,క్యాటరింగ్ రంగాలకు కూడా ఉపాధి లభిస్తుంది.అమరావతిలో టాలీవుడ్‌కు అనుబంధ పరిశ్రమలు ఏర్పడితే గుంటూరు,విజయవాడ,మంగళగిరి,తెనాలి, విశాఖపట్నం ప్రాంతాల్లో యువతకు కొత్త ఉద్యోగ అవకాశాలు సృష్టించే అవకాశం ఉంది.

ఆంధ్రప్రదేశ్‌లో ప్రకృతి సంపద,విస్తారమైన భూములు,మెరుగైన రహదారి అనుసంధానం,రాజకీయ సంకల్పం,సినీ రంగానికి చెందిన ప్రముఖ నాయకుల మద్దతు వంటి అంశాలు అమరావతిని టాలీవుడ్‌కు రెండో హబ్‌గా నిలబెట్టే అవకాశాలను పెంచుతున్నాయి.సరైన ప్రణాళిక,పెట్టుబడులు,ప్రత్యేక సినీ విధానం అమలైతే రాబోయే దశాబ్దంలో అమరావతి కేవలం పరిపాలనా రాజధానిగానే కాకుండా తెలుగు సినిమా పరిశ్రమకు మరో శక్తివంతమైన కేంద్రంగా అవతరించే అవకాశం ఉందని సినీ విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+