ఓటీటీలోకి రూ. 13 వేల కోట్లు కొల్లగొట్టిన విజువల్ వండర్.. తెలుగులోనూ స్ట్రీమింగ్..!
ప్రపంచంలోని దిగ్గజ డైరెక్టర్స్ లో జేమ్స్ కామెరూన్ ఒకరు. ఆయన దాదాపు 10 ఏళ్లకో సినిమా తీస్తారు. కానీ ఆయన సినిమా రిలీజ్ అయిందంటే ఆ మూవీ గురించి మరో 10 ఏళ్లు మాట్లాడుకుంటారు. జేమ్స్ కామెరూన్ గతేడాది తెరకెక్కించిన విజువల్ వండర్ మూవీ అవతార్: ఫైర్ అండ్ యాష్.. గతేడాది డిసెంబర్ 18 న ప్రపంచవ్యాప్తంగా విడుదలైన ఈ మూవీ ఫుల్ రన్ లో బాక్సాఫీస్ వద్ద దాదాపు 1.490 బిలియన్ డాలర్లను కలెక్ట్ చేసింది. అంటే మన భారతీయ కరెన్సీలో దాదాపు రూ. 13,000 కోట్లు అని అర్థం. ప్రపంచవ్యాప్తంగా దాదాపు అనేక దేశాల్లో ఈ మూవీ విజయవంతంగా ప్రదర్శితం అయింది. భారత్ లోనూ డిసెంబర్ 19న విడుదలై సూపర్ హిట్ అయింది.
అవతార్, అవతార్ 2 మాదిరిగానే ఈ మూవీకి కూడా భారీ కలెక్షన్లు వచ్చాయి. నిజానికి ఆ రెండు సినిమాల కంటే అవతార్ 3 కే మిక్స్ డ్ రివ్యూస్ వచ్చాయి. కానీ ఈ మూవీపై ఉన్న క్రేజ్ దృష్ట్యా థియేటర్స్ వద్ద బ్లాక్ బస్టర్ రన్ కొనసాగించింది. అయితే ఇప్పటికే అనేక దేశాల్లో ఈ మూవీ థియేట్రికల్ రన్ పూర్తయింది. ఈ మేరకు అవతార్: ఫైర్ అండ్ యాష్ (అవతార్ 3) మూవీ చాలా గ్యాప్ తర్వాత ఎట్టకేలకు ఓటీటీలోకి వచ్చేసింది. ప్రముఖ ఓటీటీ ప్లాట్ ఫామ్ అయిన జియోహాట్ స్టార్ వేదికగా ఈ విజువల్ వండర్ మూవీ జూన్ 24 బుధవారం సాయంత్రం నుంచి స్ట్రీమింగ్ అందుబాటులోకి వచ్చింది. ఈ చిత్రాన్ని ఇంగ్లీష్ తో పాటు తెలుగు, హిందీ, తమిళం, మలయాళం, కన్నడ భాషల్లో ప్రేక్షకులు వీక్షించవచ్చు.

ఇక అవతార్ మొదటి రెండు భాగాలు కూడా విశేష ఆదరణ పొందిన సంగతి తెలిసిందే. 2009లో విడుదలైన అవతార్ మూవీ ఓ అద్భుతం అని చెప్పాలి. ప్రపంచ సినీ చరిత్రలో ఓ సంచలనంగా ఈ మూవీ నిలిచింది. జేమ్స్ కామెరూన్ సృష్టించిన ఈ విజువల్ వండర్ కు యావత్ ప్రపంచం ఫిదా అయింది. ఇప్పటికీ ఈ సినిమా కలెక్షన్స్ కు టచ్ చేసే సినిమా రాకపోవడం.. జేమ్స్ కామెరూన్ దర్శకత్వ ప్రతిభకు
అద్దం పడుతోంది.












Click it and Unblock the Notifications