మూగ, చెవిటి విద్యార్థుల నిరసన.. వీడియో చూస్తే కన్నీళ్లు ఆగవు..

ఇటీవలికాలంలో జెన్ జీ యువత ఉద్యమ బాట పడుతోంది. ప్రపంచ వ్యాప్తంగాఅనేక దేశాల్లో జెన్ జీ యువత తమ హక్కులు, ప్రభుత్వ పాలన తీరుపై నిరసిస్తూ ఉద్యమాలు చేస్తున్న సంగతి తెలిసిందే. భారత్ రాజధాని దిల్లీలో ఇటీవల కాక్రోచ్ జనతా పార్టీ దాదాపు నెల రోజులకుపైగా భారీ ఎత్తున నిరసనలు, ఆందోళనలు చేపట్టిన విషయం తెలిసిందే. నీట్ ప్రశ్నాపత్రం లీకేజీకు వ్యతిరేకంగా కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేస్తూ దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద యువత పెద్ద ఎత్తున నిరసనలకు దిగిన సంగతి తెలిసిందే. ఛలో పార్లమెంట్ ముట్టడితో దిగివచ్చిన కేంద్ర ప్రభుత్వం ఎట్టకేలకు విద్యాశాఖ మంత్రి పదవి నుంచి ధర్మేంద్ర ప్రధాన్ ను తొలగించి ఆ బాధ్యతలను ప్రహ్లాద్ జోషీకు అప్పగించింది. దాంతో నెల రోజులకుపైగా భీకరంగా జరిగిన జెన్ జీ ఉద్యమం ఆగింది.

అయితే సాధారణంగా నిరసనలు, ఆందోళనలు అంటే యువత పెద్ద ఎత్తున నినాదాలు చేస్తూ ఆ ప్రాంగణం మారుమోగుతుంది. పెద్ద పెద్ద శబ్దాలు చేస్తూ ఆందోళనలు చేపడుతుంటారు. అయితే పుట్టుకతోనే మూగ, చెవిటి అయిన ఆ విద్యార్థులు కూడా తామూ ఏమి తక్కువ కాదని తమ హక్కుల కోసం పోరాటం చేపట్టారు. ఆ మూగ, చెవిటి విద్యార్థులు ప్లకార్డులతో సైలెంట్ గా ఆందోళన చేపట్టారు. చండీగఢ్ లోని సెక్టార్ 19 లోని వాటికా స్పెషల్ స్కూల్ కు చెందిన మూగ, బధిర విద్యార్థులు సమస్యల సాధనకు ఉద్వేగ ప్రసంగాలు, గొంతు చించుకుంటూ కేకలు వేయాల్సిన అవసరం లేదని మౌనంగానే నిరసనతో నిరూపించారు.

మూగ, బధిర విద్యార్థులు బయటకు వచ్చి తమ పాఠశాలలో కనీస సౌకర్యాలు, మౌలిక వసతులు లేవని నిరసన తెలిపారు. వాళ్లు మాట్లడలేరు కాబట్టి.. ఎలాంటి నినాదాలు చేయకుండా సైలెంట్ గా ప్లకార్డులు పట్టుకుని.. గట్టిగా చేయి పైకి అంటూ తమ నిరసనలను కొనసాగించారు. ఈ నిశ్శబ్ద నిరసనకు సంబంధించిన వీడియోలు ఇప్పుడు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి.

Chandigarh Deaf and mute students protest in Chandigarh demanding better facilities in schools news

ఇలా తమ డిమాండ్లను అధికారుల దృష్టికి తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. వారి డిమాండ్లు చూస్తే 8వ తరగతి నుంచి 12 వ తరగతి వరకు ప్రత్యేక నిపుణులైన ఉపాధ్యాయులను నియమించాలి. అలాగే 9 నుంచి 12 వ తరగతులకు గణితం, సైన్స్ తరగతులను ప్రవేశపెట్టాలి. ఇక ఉపాధ్యాయులకు ఇండియన్ సైన్ లాంగ్వేజ్ శిక్షణ తప్పనిసరి చేయాలి. చివరగా మధ్యాహ్న భోజన నాణ్యతను పెంచాలి అని డిమాండ్స్ తో వాళ్లు నిరసన చేపట్టారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+