హైదరాబాద్ ను మించి ప్రపంచం చెప్పుకునేలా అమరావతి.. పాన్-ఐఐటీ కాన్ఫరెన్స్ తో చంద్రబాబు బిగ్ ప్లాన్!

హైదరాబాద్ లో ఐటీని తీసుకు వచ్చింది తానేనని పదేపదే చెప్పే ఏపీ సీఎం చంద్రబాబు ఇప్పుడు ఏపీని హైదరాబాద్ కు మించిన డీప్ టెక్ హబ్ గా తీర్చి దిద్దాలని, క్వాంటం వ్యాలీగా తీర్చి దిద్దాలని సంకల్పించారు. అందులో భాగంగా అక్టోబరు 3న విజయవాడలో పాన్‌-ఐఐటీ కాన్ఫరెన్స్ నిర్వహించనున్నట్లు చంద్రబాబు తెలిపారు.

డా. బీఆర్ అంబేద్కర్ కళావేదికలో జరిగే ఈ కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ప్రధాన అతిథిగా పాల్గొననున్నారు. ఐటీ, విద్య, ఎలక్ట్రానిక్స్ మంత్రి నారా లోకేష్ కూడా హాజరవుతారు. దేశవ్యాప్తంగా ఉన్న 23 ఐఐటీల అలుమ్నీ, డైరెక్టర్లు, పరిశ్రమ నాయకులు, పెట్టుబడిదారులు, స్టార్టప్ వ్యవస్థాపకులు ఇక్కడ సమావేశమవుతారు.

జగన్ ఇలాకాలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. వారికి ఇళ్ళ పట్టాలు!
జగన్ ఇలాకాలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. వారికి ఇళ్ళ పట్టాలు!
CM Chandrababu Push for Amaravati as deep Tech Hub quantum valley big plan behind Pan-IIT Conference

ఈ సమ్మిట్‌లో ఐదు ప్రధాన ప్యానెళ్లు ఉంటాయి. ఎనర్జీ, డీప్‌టెక్ క్వాంటం, సెమీకండక్టర్లు, ఏఐ, స్పేస్ అండ్ డిఫెన్స్, బయోవ్యాలీ, అగ్రిటెక్ వంటి అంశాలపై ప్రధానంగా చర్చలు జరుగుతాయి. ఐఐటీ డైరెక్టర్లు, పరిశ్రమ నాయకులు, వెంచర్ క్యాపిటలిస్టులతో రౌండ్‌టేబుల్స్ సమావేశాలు కూడా ఉంటాయి. పాన్-ఐఐటీ అమరావతి కౌన్సిల్, వెంచర్ ఫండ్, సెంటర్స్ ఆఫ్ ఎక్సలెన్స్, గ్లోబల్ మెంటర్ నెట్‌వర్క్ వంటి ప్రతిపాదనలు చర్చకు రానున్నాయి.

క్యూ-శివ అనే క్వాంటం కంప్యూటర్ల ప్రాజెక్ట్ గురించి కూడా ప్రకటనలు రావచ్చు. ఈ కాన్ఫరెన్స్ ద్వారా రాష్ట్రానికి పెట్టుబడులు, ఉపాధి అవకాశాలు, పరిశోధన సౌకర్యాలు రావాలని చంద్రబాబు ప్రభుత్వం భావిస్తోంది. ఐఐటీ అలుమ్నీ నెట్‌వర్క్‌ను ఉపయోగించి ఆంధ్రప్రదేశ్‌ను డీప్‌టెక్ రంగంలో ముందున్న రాష్ట్రంగా నిలబెట్టాలని సీఎం చంద్రబాబు లక్ష్యంగా పెట్టుకున్నారు. అక్టోబర్ 2న నాయకత్వ విందు, 3న ప్రధాన సమ్మిట్ జరుగుతాయి.

 ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్, అతి భారీ వర్షాలు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!
ఏపీలో ఫ్లాష్ ఫ్లడ్స్, అతి భారీ వర్షాలు - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ఇది కేవలం సమావేశం కాదు, రాష్ట్ర భవిష్యత్తు కోసం ఒక రోడ్‌మ్యాప్ తయారు చేసుకునే అవకాశం అని ఏపీ ప్రభుత్వం భావిస్తోంది. సీఎం చంద్రబాబు కూడా అంతే ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దేశంలోని వివిధ ఐఐటీల్లో చదివి ప్రపంచవ్యాప్తంగా స్థిరపడిన నిపుణులు ఈ సదస్సులో పాల్గొని మేధోమధనం చేయనున్నారని సీఎం చంద్రబాబు చెప్పారు. 2047 నాటికి వికసిత్ భారత్ లక్ష్య సాధనకు పాన్‌-ఐఐటీ పనిచేస్తోందన్నారు.

భవిష్యత్తులో ఆధునిక సాంకేతికత, ఆవిష్కరణలకు ఏపీ రాజధాని నగరం అమరావతి కేంద్రంగా మారుతుందని సీఎం అన్నారు. ప్రపంచ స్థాయి జీవన ప్రమాణాలు, పరిశోధనలకు గమ్య స్థానంగా రాజధాని నిలవాలని ఆకాంక్షించారు.సాంకేతికత, అవకాశాలను యువత అందిపుచ్చుకుని ఆకాశమే హద్దుగా ఎదగాలని పిలుపునిచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+