వినాయక నిమజ్జనంలో డీజే హోరు: క్లాస్‌రూమ్‌లోనే ప్రాణాలు కోల్పోయిన చిన్నారి!
ఉత్తరప్రదేశ్‌లోని బలరామ్‌పూర్‌లో తీవ్ర విషాదం చోటుచేసుకుంది. స్థానిక 'డివైన్ పబ్లిక్ స్కూల్' వద్ద వినాయక నిమజ్జన ఊరేగింపు సందర్భంగా మోగిన హోరెత్తించే డీజే శబ్ధాల ధాటికి స్కూలులో పాఠాలు వింటున్న రెండో తరగతి విద్యార్థిని తరగతి గదిలోనే హఠాత్తుగా కుప్పకూలి ప్రాణాలు కోల్పోయింది. సోను తివారీ(జితు) కూతురు అయిన ఆ చిన్నారని.. సోమవారం ఉదయం 11 గంటల సమయంలో పాఠశాల మొదటి అంతస్తులోని క్లాస్‌రూమ్‌లో ఉండగా ఈ విషాద ఘటన చోటుచేసుకుంది.
పాఠశాలకు చెందిన సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా ఆ సమయంలో ఏ జరిగిందో వెలుగులోకి వచ్చింది. స్కూల్ బయట వినాయక నిమజ్జన ఊరేగింపు వెళ్తుండగా.. దాన్నుంచి వచ్చిన భయంకరమైన డీజే శబ్ధాలకు కొందరు పిల్లలు కిటికీలు, తలుపుల వద్దకు వెళ్లారు. అదే సమయంలో ఆ చిన్నారి తీవ్ర అస్వస్థతకు గురైంది. తన సీటులోనే కూర్చుని ఆ పాప మూడుసార్లు స్పృహతప్పి పడిపోవడం సీసీటీవీలో రికార్డైంది. డీజే నుంచి వచ్చిన భారీ శబ్ధాలు, వైబ్రేషన్ వల్లే చిన్నారి గుండెపోటుకు గురై ప్రాణాలు కోల్పోయిందని బాధిత కుటుంబ సభ్యులు ఆరోపిస్తున్నారు.

ఈ ఘటనపై పాఠశాల ఉపాధ్యాయులు తీవ్ర దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. ఊరేగింపులో ప్లే చేసిన డీజే శబ్ధాల తీవ్రతకు పాఠశాల కిటికీ అద్ధాలు కూడా వణికిపోయాయని టీచర్లు ఇక్రా ఖాన్, పమ్మీ మిశ్రాలు వెల్లడించారు. పాప అస్వస్థతకు గురవ్వడాన్ని గమనించిన వెంటనే కిందకు తీసుకెళ్లి అత్యవసరంగా ఆస్పత్రికి తరలించినప్పటికీ.. ఆ లోపే ఆ చిన్నారని మరణించినట్లు వైద్యులు వెల్లడించారని పాఠశాల నిర్వాహకులు తెలిపారు.
ఈ విషాద ఘటనపై పోలీసులు దర్యాప్తు ప్రారంభించారు. పాఠశాలలోని సీసీటీవీ ఫుటేజీని స్వాధీనం చేసుకుని పరిశీలిస్తున్నారు. అయితే డేజే శబ్ధాల వల్లే పాప మరణించిందా లేదా వేరే ఏమైనా ఆరోగ్య సమస్యలు ఉన్నాయా అనేది వైద్య పరీక్షల నివేదిక ఆధారంగానే తేలుతుందని సీటీ సీవో అభిషేక్ సింగ్ వెల్లడించారు. మరోవైపు ఈ కేసులో నిష్పాక్షికంగా విచారణ జరిపి తగిన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని ఎస్పీ మార్తాండ్ ప్రకాష్ సింగ్ ఆదేశించారు.
Balrampur - A heart-rending incident has left the entire city of Balrampur in shock. A student of Divine Public School suddenly took ill amid the deafening sound of high-volume DJ music during a Ganesh Visarjan procession and later died while undergoing treatment. The tragic… pic.twitter.com/ClW4wUQZm0
— NextMinute News (@nextminutenews7) September 22, 2026













Click it and Unblock the Notifications
