ఏపీ ప్రజలకు అవసరమైన వార్త.. జనవరి నుండి రాష్ట్రవ్యాప్తంగా సంజీవని!

ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సంజీవని అమలుపైన ఏపీ సీఎం చంద్రబాబు ప్రత్యేక శ్రద్ధ పెట్టారు. రాష్ట్రంలోని కుప్పంలో సంజీవని ప్రాజెక్ట్ ను పైలెట్ ప్రాజెక్ట్ గా ప్రారంభించిన ఏపీ ప్రభుత్వం కుప్పంలో పైలెట్ ప్రాజెక్ట్ రిజల్ట్స్ బాగా రావటంతో రాష్ట్ర వ్యాప్తంగా విస్తరించే పనిలో ఉన్నారు. ముఖ్యంగా సంజీవని ప్రాజెక్ట్ ద్వారా వ్యాధుల ముందస్తు గుర్తింపు, నివారణ, చికిత్స విధానంలో రాష్ట్రంలోని అన్ని ప్రాంతాల ప్రజలకు వైద్య సేవలు అందించనున్నారు.

ఈ క్రమంలో రాష్ట్రవ్యాప్తంగా జ‌న‌వ‌రి నుంచి సంజీవ‌ని ప్రాజెక్టును అమ‌లు చేసేందుకు అవ‌స‌ర‌మైన ముంద‌స్తు చ‌ర్య‌ల్ని వేగ‌వంతం చేసిన‌ట్లు రాష్ట్ర వైద్య‌,ఆరోగ్య శాఖా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ శుభవార్త చెప్పారు. ఏఎన్ఎం, ఆశా వ‌ర్క‌ర్ల ద‌గ్గ‌ర నుంచి జిల్లా, రాష్ట్ర స్థాయి అధికారుల వ‌ర‌కు సంజీవ‌ని అమ‌లు కోసం స‌న్న‌ద్ధ‌మ‌వుతున్నార‌ని చెప్పారు. 28 జిల్లాల్లో ప్ర‌తి జిల్లాకు ఒక సీనియ‌ర్‌ వైద్యులు లేదా అధికారిని స‌మ‌న్వ‌య‌క‌ర్త‌గా నియ‌మించామ‌ని చెప్పారు.

Sanjeevani Project to Roll Out Statewide from January - Health Minister sathyakumar yadav good news

శిక్ష‌ణా కార్య‌క్ర‌మాలు కూడా నిర్ణీత వ్య‌వ‌ధిలో నిర్వ‌హించేందుకు స‌మ‌గ్ర ప్ర‌ణాళిక‌ను రూపొందించామ‌ని చెప్పారు. ఇందుకు త‌గ్గ‌ట్టుగానే 104 వాహ‌నాల్ని ఆరోగ్య ర‌థాలు కూడా సిద్ధం చేస్తున్నామ‌ని తెలిపారు. ఆరోగ్య రథాల్లో రక్తంలో చక్కెర, రక్తపోటుతో పాటు కాలేయం, మూత్రపిండాల పనితీరు, రక్తంలోని కొవ్వు పదార్థాలు, రక్తంలోని వివిధ అంశాలు, శరీరంలోని లవణాలకు సంబంధించిన పరీక్షలు నిర్వహిస్తారు. మొత్తం 41 రకాల ప్రయోగశాల పరీక్షలను ఉచితంగా అందించనున్నారు.

సంజీవని అమలు కోసం మంత్రి సత్యకుమార్ యాదవ్ జిల్లా వైద్య‌, ఆరోగ్య శాఖాధికారులు, డైరెక్ట‌రేట్ ఆఫ్ సెకండ‌రీ హెల్త్ జిల్లాల అధికారులు, బోధానాసుప‌త్రుల సూప‌రింటెండెంట్లు, వివిధ హోదాలో ఉన్న అధికారుల‌తో వైద్య‌, ఆరోగ్యశాఖ కార్య‌ద‌ర్శి జి.వీర‌పాండియ‌న్, ఆరోగ్య కుటుంబ సంక్షేమశాఖ క‌మీష‌న‌ర్ చ‌క్ర‌ధ‌ర్ బాబు లతో హైబ్రిడ్ స‌మావేశాన్ని నిర్వ‌హించారు.సంజీవ‌ని అమ‌లుకు సంబంధించి తీసుకుంటున్న చ‌ర్య‌ల‌పై కార్య‌ద‌ర్శి వీర‌పాండియ‌న్ , క‌మీష‌న‌ర్ చక్ర‌ధ‌ర్‌బాబు మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్‌కు నివేదించారు.

జగన్ ఇలాకాలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. వారికి ఇళ్ళ పట్టాలు!
జగన్ ఇలాకాలో చంద్రబాబు మాస్టర్ ప్లాన్.. వారికి ఇళ్ళ పట్టాలు!

ఇదే సమ‌యంలో 104 వాహ‌నాలను సంజీవ‌ని ద్వారా జ‌రిగే ప‌రీక్ష‌ల‌కు అనుకూలంగా సిద్ధం చేయ‌డంపై వారి మ‌ధ్య చ‌ర్చ జ‌రిగింది. ఈ సంద‌ర్భంగా మంత్రి స‌త్య‌కుమార్ యాద‌వ్ మాట్లాడుతూ ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు ప్ర‌క‌టించిన విధంగా జ‌న‌వ‌రి 1 నుంచి సంజీవ‌ని ప్రాజెక్టు అమ‌లును పూర్తి స్థాయిలో రాష్ట్ర వ్యాప్తంగా ప్రారంభించేందుకు వీలుగా ప‌క‌డ్బందిగా కార్యాచ‌ర‌ణ చేపడుతున్నట్టు స్ప‌ష్టం చేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+