వర్ష బీభత్సం, ఈ జిల్లాల్లో ఫ్లాష్ ఫ్లడ్స్ - సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు..!!

ఏపీలో పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కొనసాగుతున్నాయి. శ్రీకాకుళంతో పాటుగా ఉత్తరాంధ్ర జిల్లాల్లో తీవ్రత ఎక్కువగా ఉంది. శ్రీకాకుళం జిల్లా వణికి పోతుంది. భారీ వర్షాలపై ప్రభుత్వం అప్రతమతమైంది. ఇప్పటికే ఏపీ విపత్తుల నిర్వహణ శాఖ పలు కీలక సూచనలు చేసింది. కాగా.. ఇదే సమయంలో అతి భారీ వర్షాల పైన అలర్ట్స్ జారీ అయ్యాయి. దీంతో.. సీఎం చంద్రబాబు అధికార యంత్రాంగానికి కీలక సూచనలు చేసారు.

ఏపీలో వాయుగుండం ప్రభావంతో భారీ నుంచి అతి భారీ వర్షాలు పలు ప్రాంతాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. అనకాపల్లి, విజయనగరం, విశాఖపట్నం, శ్రీకాకుళం, అల్లూరి సీతారామరాజు, పార్వతీపురం మన్యం, కాకినాడ జిల్లాలకు ఫ్లడ్ అలర్ట్ జారీ అయింది. ఈ 7 జిల్లాల్లో ఆకస్మిక వరదలు వచ్చే అవకాశముందని భారత వాతావరణ శాఖ వెల్లడించింది. భారీ వర్షాలపై సీఎం చంద్రబాబు టెలీకాన్ఫరెన్స్ నిర్వహించారు. వర్షాలు తగ్గే వరకు జిల్లా కలెక్టర్లు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రాణనష్టం జరగకుండా ముందస్తు చర్యలు తీసుకోవాలని చెప్పారు. ప్రజలకు నీరు, ఆహారం, వైద్యం, విద్యుత్‌కు అంతరాయం లేకుండా చూడాలని.. సముద్రంలో వేటకు వెళ్లిన మత్స్యకారులను ఒడ్డుకు రప్పించాలని చంద్రబాబు నిర్దేశించారు.

 TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
TTD: కొత్త సదుపాయాలు ప్రారంభం, అలిపిరి కేంద్రంగా ఇక - ఛైర్మన్ బీఆర్ నాయుడు..!!
cm-chandra-babu-key-directions-for-collectors-amid-heavy-rains-review-the-situation-and-precaution

జిల్లా యంత్రాంగానికి తాజా అలర్ట్స్

గడిచిన 24 గంటల్లో 80 ప్రాంతాల్లో 100మిమీకు పైగా వర్షపాతం రికార్డు అయింది. ఆకస్మిక వరదలు పట్ల లోతట్టు ప్రాంత అప్రమత్తంగా ఉండాలని విపత్తుల నిర్వహణ శాఖ సూచన చేసింది. క్షేత్రస్థాయిలో అధికారులు హైఅలెర్ట్ గా ఉండాలని పేర్కొంది. విశాఖ రూరల్ తులసీనగర్ లో 236మిమీ, మధురవాడలో 218మిమీ, ఎండాడలో 210మిమీ వర్షపాతం నమోదు అయింది. సీతమ్మధారలో 205మిమీ, కాపులుప్పాడలో 202మిమీ, మహరాణిపేటలో 199మిమీ అత్యధిక వర్షపాతం రికార్ అయినట్లు వెల్లడించారు. విజయనగరం జిల్లా కొత్తవలసలో 188మిమీ, విశాఖ పెందుర్తిలో 179మిమీ, బుచ్చిరాజుపాలెం 171మిమీ, పెదగంట్యాడలో 165మిమీ, కొత్తపాలెంలో 163మిమీ వర్షపాతం నమోదు అయింది. కాకినాడ జిల్లా వేలంగిలో 142మిమీ, జగ్గంపేటలో 140మిమీ వర్షపాతం నమోదు అయినట్లు చెప్పారు. మరో రెండు రోజులు భారీ వర్షాలు కొనసాగే అవకాశం ఉందని.. అప్రమత్తంగా ఉండాలని అధికారులు సూచించారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+