భర్త నైట్ షిఫ్ట్ కు.. ప్రియుడితో స్టాల్ కు భార్య.. ఇక్కడే అసలు ట్విస్ట్..?
ఇటీవలికాలంలో వివాహేతర సంబంధాలు అధికంగా చోటుచేసుకుంటున్నాయి. దేశవ్యాప్తంగా ఇలాంటి ఘటనలు అధిక సంఖ్యలో జరుగుతున్నాయి. భర్తకు తెలియకుండా భార్య.. అటు భార్యకు తెలియకుండా భర్త చాటుగా ఎఫైర్లు నడిపిస్తున్న ఘటనలు వెలుగులోకి వస్తున్నాయి. ఇలాంటి ఘటనలతో వాళ్ల జీవితాలను నాశనం చేసుకోవడమే కాకుండా వాళ్ల పిల్లల జీవితాలను కూడా నాశనం చేస్తున్నారు కొందరు పేరెంట్స్. తాత్కాలిక సరదాలకు అలవాటు పడి పిల్లలను అనాథలను చేస్తున్నారు. మొత్తానికి భారతీయ వివాహ వ్యవస్థను ఈ తరం వాళ్లు బ్రష్టు పట్టిస్తున్నారు. తాజాగా మధ్య ప్రదేశ్ లోని భోపాల్ లో జరిగిన ఇలాంటి షాకింగ్ ఘటన సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
The husband left for his night shift at the factory, while his wife headed out to eat momos with her boyfriend.
— Trump Asia (@sonuforx) August 14, 2026
coincidentally, the husband also arrived at the same spot with a friend, and the wife was caught red-handed.
Now, the husband is beating his wife, and his friend is… pic.twitter.com/nXSO6gRSCx
భోపాల్ లోని అశోక గార్డెన్ ప్రాంతంలో షాకింగ్ ఘటన జరిగింది. తన భర్త ఎప్పుడు నైట్ షిఫ్ట్ కు వెళ్తాడా..? అని భార్య ఎదురుచూసింది. అలా భర్త నైట్ షిఫ్ట్ కు వెళ్లగానే ప్రియుడికి ఫోన్ చేసి రప్పించింది. అలా ఇద్దరూ కలిసి సరదాగా రోడ్డు మీదకు వెళ్లారు. మోమోస్ తినేందుకు ఓ చోట ఆగారు. అయితే ఇక్కడే అసలు ట్విస్ట్ బయటకు వచ్చింది. అదే సమయంలో ఆఫీస్ నుంచి భర్త బయటకు వచ్చాడు. మోమోస్ తినేందుకు సేమ్ అదే ప్లేస్ కు వచ్చాడు. అక్కడ వీళ్లిద్దరినీ చూసి భర్త ఒక్కసారిగా షాక్ అయ్యాడు. అక్కడ సీన్ చూసి అతడి మైండ్ బ్లాంక్ అయింది.

ఈ క్రమంలో కోపంతో ఇదేంటి..? అని తన భార్యను ప్రశ్నించడంతో వివాదం మొదలైంది. అలా కోపోద్రిక్తుడైన భర్త.. భార్య, ప్రియుడిపై భౌతిక దాడికి పాల్పడ్డాడు. ఈ మేరకు భార్యపై దాడికి పాల్పడుతూ.. దూషిస్తున్న దృశ్యాలు స్థానికంగా ఉన్న సీసీటీవీ కెమెరాలో రికార్డు అయ్యాయి. భార్యతో పాటు ప్రియుడ్ని కూడా కొట్టినట్లు వీడియోలో రికార్డు అయింది. ఈ ఘటనతో ఆ ప్రాంతంలో జనం గుమికూడారు. దాంతో ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. ఈ మొత్తం ఘటనను కొందరు తమ ఫోన్లలో రికార్డు చేశారు. ప్రస్తుతం ఆ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. ఈ ఘటనపై సోషల్ మీడియాలో నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు.












Click it and Unblock the Notifications