వీడేం దొంగడీ బాబు.. చోరీకి వెళ్లి స్నానం చేసి.. కాఫీ పెట్టుకుని తాగి.. ఆపై పాట పెట్టి డాన్స్..
సాధారణంగా ఓ ఇంట్లో దొంగలు పడ్డారంటే ఉన్నదంతా క్షణాల్లో దోచుకుని అక్కడినుంచి పారిపోతుంటారు. ఆ ఇంట్లో విలువైన వస్తువులు ఏమీ లేకున్నా సరే వీలైనంత త్వరగా అక్కడి నుంచి పారిపోవాలని అనుకుంటారు. కానీ ఇటీవలి కాలంలో దొంగలు మాత్రం వింత వింతగా ప్రవర్తిస్తున్నారు. ఇటీవల హైదరాబాద్ పాతబస్తీలో ఓ దొంగ చోరీకి వెళ్లి విలువైన నగలు దోచుకుని వాటిని జేబులో పెట్టుకుని ఆ రూమ్ లోనే మంచంపై గురక పెట్టి నిద్రపోయాడు. తెల్లవారుజామున గురక శబ్దం రావడంతో యజమాని వెళ్లి రూమ్ తలుపు తీయగా అసలు విషయం బయట పడింది. ఇందుకు సంబంధించిన వీడియో సామాజిక మాధ్యమాల్లో వైరల్ గా మారింది.
ఈ ఘటన మరువకముందే మరో షాకింగ్ ఘటన ఇప్పుడు నెట్టింట వైరల్ అవుతోంది. ఓ దొంగ చోరీకోసం ఇంటికి వెళ్లి అక్కడ ఫ్రెష్ గా స్నానం చేసి.. ఆ తర్వాత కాఫీ పెట్టుకుని తాగి.. ఆ తర్వాత ఓ పాట పెట్టుకుని డాన్స్ లు వేస్తూ చోరీ చేసి అక్కడినుంచి వెళ్లిపోయాడు. ఈ ఘటన వారణాసిలో జరిగింది. తాజాగా వెలుగులోకి వచ్చింది. ఈ చోరీ ఘటనలో ఒక దొంగ ఆటోమొబైల్ షోరూమ్ కు వెళ్లాడు. ఆ తర్వాత అక్కడ నాలుగు గంటలకుపైగా గడిపాడు. ఆ తర్వాత రూ. 4.71 లక్షల విలువైన మోటార్‌సైకిల్ తో పరారయ్యాడు. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది.
Varanasi: A thief spent 4 hours inside a bike agency, made coffee, took a bath, danced to music, and even dried his clothes before fleeing with the manager’s ₹4.70 lakh KTM bike😭💀 pic.twitter.com/6C5cdMOhnM
— Ghar Ke Kalesh (@gharkekalesh) August 13, 2026
అయితే చోరీకి పాల్పడేందుకు ముందు ఆ దొంగ డాన్స్ చేశాడు. ఆ తర్వాత ఇంటి యజమాని మాదిరి తాఫీగా కాఫీ కూడా తాగాడు. ఈ షాకింగ్ ఘటనకు సంబంధించిన సీసీటీవీ దృశ్యాలు ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతున్నాయి. ఈ వీడియోలో ఓ వ్యక్తి షోరూమ్ లోకి ప్రవేశిస్తాడు. ఆ తర్వాత లుంగీ డాన్స్ పాట పెట్టి డాన్స్ చేస్తాడు. అలా దాదాపు నాలుగున్నర గంటల పాటు అక్కడే గడిపాడు. ఆ సమయంలో అతను తీరిగ్గా కాఫీ చేసుకుని తాగాడు.

ఆ తర్వాత షోరూమ్ లోనే స్నానం చేసి తన దుస్తులను ఆరబెట్టుకుని ఆ పాటకు డాన్స్ లు చేశాడు. వీడియో ఎవరు చూసిన ఇతను దొంగతనానికి వచ్చాడా..? లేక సరదాగా ఎంజాయ్ చేయడానికి వచ్చాడా..? అన్న సందేహం కలుగక మానదు. ఇక ఆ తర్వాత ఆ దొంగ స్టోర్ మేనేజర్ కు చెందిన రూ. 4. 71 లక్షల విలువైన కేటీఎం బైక్ తో పరార్ అయ్యాడు. ఈ ఘటనపై వారణాసిలోని మండువాడిహ్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదు అయింది. ప్రస్తుతం పోలీసులు నిందితుడి కోసం గాలిస్తున్నారు.












Click it and Unblock the Notifications