బయట పచ్చళ్ళు కొని లొట్టలేసుకుని తింటున్నారా? ఈ వీడియో చూస్తే చచ్చినా తినరు!

బయట పచ్చళ్ళు కొనుగోలు చేసుకుని చాలామంది తింటూ ఉంటారు. అయితే బయట కొనుగోలు చేసే పచ్చళ్ళు ఆరోగ్యానికి అంత మంచిది కాదు. ఇక తాజాగా వరంగల్ లో బయటపడిన కల్తీ పచ్చళ్ళు, బూజు పట్టి, కుళ్ళిన పచ్చళ్ళు చూస్తే మీరు జన్మలో బయట పచ్చళ్ళు కొనుగోలు చేసి తినరు.

పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసుల ఆకస్మిక తనిఖీ

తాజాగా వరంగల్ నగరంలోని కాశిబుగ్గ ప్రాంతంలో అత్యంత అపరిశుభ్రమైన వాతావరణంలో అక్రమంగా పచ్చడి తయారీ చేస్తున్న కేంద్రంపై టాస్క్ ఫోర్స్ పోలీసులు మెరుపు దాడి చేశారు. ఈ సంఘటన మనం బయట నుంచి కొనుగోలు చేసే ఆహార పదార్థాలపై అందరూ ఆలోచించేలా చేస్తోంది. ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కాశీబుగ్గ సాయి వీధిలో ఉన్న ఒక ఇంటిలో ఈ అక్రమ కార్యకలాపాలు జరుగుతున్నట్లు విశ్వసనీయ సమాచారం అందిన టాస్క్ ఫోర్స్ అధికారులు ఆకస్మిక తనిఖీలు చేశారు.

Adulteration pickles Task Force Police raided an illegal unhygienic pickle making unit in Warangal

కుళ్ళిన బూజు పట్టిన వందల కిలోల పచ్చళ్ళు

తనిఖీలో పెద్ద ఎత్తున కుళ్లిపోయిన ముడి సరుకులు బయటపడ్డాయి. టమోటా పచ్చడి : 750 కేజీలు, మామిడికాయ పచ్చడి : 900 కి.జి, నిమ్మకాయల పచ్చడి : 200 కేజీలు, ఉసిరికాయలు : 100 కేజీల పచ్చడి, అల్లం-వెల్లుల్లి పేస్ట్ : 150 కేజీలు టాస్క్ ఫోర్స్ అధికారులు స్వాధీనం చేసుకున్నారు. ఈ పాడైపోయిన పచ్చళ్ళ మొత్తం విలువ: సుమారు రూ.2,25,000.

పాడైపోయిన పచ్చళ్ళ విక్రయాలు

ఈ పాడైపోయిన పచ్చళ్ళను చిన్న చిన్న ప్యాకెట్లలో ప్యాకింగ్ చేసి స్థానిక కిరాణా దుకాణాలు, చిన్న వ్యాపార సంస్థలకు సరఫరా చేస్తున్నట్లు విచారణలో వెల్లడైంది. ఈ కేసులో అరికెల శ్రీనివాస్ అనే వ్యక్తిని అరెస్టు చేశారు. ఏసీపీ టాస్క్ ఫోర్స్ ఎ. మధుసూదన్ పర్యవేక్షణలో ఇన్‌స్పెక్టర్ బండారి రాజు, ఆర్‌ఎస్‌ఐ ఓ. భాను ప్రకాష్ మరియు టాస్క్ ఫోర్స్ బృందం ఈ ఆపరేషన్‌ను విజయవంతంగా నిర్వహించారు. స్వాధీనం చేసుకున్న సరుకు మరియు నిందితుడిని తదుపరి చట్టపరమైన చర్యల కోసం ఇంతేజార్‌గంజ్ పోలీస్ స్టేషన్‌కు అప్పగించారు.

హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ!
హైదరాబాద్ మెట్రోపై కేంద్రం సూచన.. త్వరలోనే ఆ పనులు షురూ!

కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్

బయట పచ్చళ్ళు కొనేటప్పుడు చాలా మంది ధర, రుచి మాత్రమే చూస్తారు. కానీ వాటి వెనుక ఉన్న అపరిశుభ్రత, కల్తీలు, కుళ్లిన సరుకులు ఎవరికీ తెలియవు. ఇలాంటి కల్తీ ఆహారం వల్ల ఫుడ్ పాయిజన్ అయ్యి ఒక్కోసారి ప్రాణాల మీదకే రావచ్చు. అందుకే బ్రాండ్ లేని లేదా అనుమానాస్పదమైన పచ్చళ్ళు, ఆహార పదార్థాలు కొనేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. ఇలాంటి అక్రమ కార్యకలాపాలు గమనించిన వారు వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వండి అంటున్నారు టాస్క్ ఫోర్స్ పోలీసులు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+