AP EAPCET 2026: ఎంసెట్ రాసిన సీబీఎస్ఈ విద్యార్ధులకు అలర్ట్..!

ఏపీలో ఇంజనీరింగ్, అగ్రికల్చర్, ఫార్మసీ కోర్సుల్లో ప్రవేశాల కోసం ఈ ఏడాది నిర్వహించిన ఏపీ ఈఏపీసెట్ (AP EAPCET 2026) ఫలితాల కోసం లక్షలాది మంది అభ్యర్ధులు ఎదురుచూస్తున్నారు. అయితే ఇంటర్ అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ ఫలితాలు, అలాగే సీబీఎస్ఈ 12వ తరగతి అడ్వాన్సెడ్ సప్లిమెంటరీ ఫలితాలు వెలువడకపోవడంతో ఫలితాలు ఆలస్యమవుతూ వచ్చాయి. తాజాగా ఇంటర్ ఫలితాలు వచ్చేశాయి. ఇప్పుడు సీబీఎస్ఈ ఫలితాలు కూడా వెలువడుతున్నాయి. ఈ నేపథ్యంలో సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు రాసిన ఈఏపీసెట్ అభ్యర్ధులకు ఉన్నత విద్యామండలి కీలక అలర్ట్ ఇచ్చింది.

IIT విద్యార్థులకు షాకింగ్ న్యూస్: ఇకపై ప్లేస్ మెంట్ కావాలంటే..?
IIT విద్యార్థులకు షాకింగ్ న్యూస్: ఇకపై ప్లేస్ మెంట్ కావాలంటే..?

సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షల రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ కోసం దరఖాస్తు చేసుకున్న అభ్యర్ధులు వాటి ఫలితాలు రాగానే ఎంసెట్ మార్కులకు వీటిని కలిపేందుకు వీలుగా ఓ డిక్లరేషన్ ఫాం సమర్పించాల్సి ఉంటుంది. రీవెరిఫికేషన్, రీవాల్యుయేషన్ లో మార్కులు గతంలో కంటే పెరిగిన అభ్యర్ధులు మాత్రమే ఇలా డిక్లరేషన్ ఫామ్ సమర్పించాలి. ఇందుకోసం ఫామ్ సమర్పించేందుకు వీలుగా లింక్ ను కూడా అధికారులు విడుదల చేశారు. ఈ ఫామ్ ను ఈ నెల 27 సాయంత్రం 5 గంటల్లోకా సమర్పించాల్సి ఉంటుంది.

AP EAPCET 2026 Alert CBSE Class 12 Students With Improved Re-Evaluation Marks Must Submit Declaration Form Now
AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!
AP EAPCET 2026 Results: ఎంసెట్ ఫలితాలు ఆ రోజే ? తాజా అప్డేట్..!

ఉన్నత విద్యామండలి సెట్స్ వెబ్ సైట్ లింక్ https://cets.apsche.ap.gov.in/EAPCET/Eapcet/EAPCET_CAND_DECLARATION_CBSE.aspx ను క్లిక్ చేయడం ద్వారా ఈ ఫామ్ ను సీబీఎస్ఈ లో మార్కులు పెరిగిన అభ్యర్ధులు డిక్లరేషన్ ఫామ్ ను సమర్పించాల్సి ఉంటుంది. ఇలా చేయకపోతే వారికి పెరిగిన మార్కులు ఎంసెట్ మార్కులకు కలపరు. అప్పుడు అభ్యర్ధులు నష్టపోతారు. కాబట్టి సీబీఎస్ఈ 12వ తరగతిలో తాజాగా మార్కులు పెరిగిన అభ్యర్ధులు సాధ్యమైనంత త్వరగా ఈ డిక్లరేషన్ ఫామ్ ను సమర్పించాలని అధికారులు కోరుతున్నారు. ఈ నెల 27న ఇలా డిక్లరేషన్ ఫామ్ సమర్పణ డెడ్ లైన్ ముగిసిన తర్వాత ఎంసెట్ ఫలితాలు విడుదల చేయబోతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+