ICC T20I ర్యాంకింగ్స్: దూసుకొచ్చిన సంజూ, ఇషాన్ - అభిషేక్ ఏ స్థానంలో..!!
ICC T20I ర్యాగింగ్స్ ను ప్రకటించింది. టీ20 ప్రపంచ కప్ లో ఛాంయన్ గా నిలిచిన టీం ఇండియా ఈ ర్యాగింగ్స్ లో టాప్ పొజీషన్ లో నిలిచింది. ఇప్పటి వరకు టీ20 టాప్ బ్యాటర్ అభిషేక్ శర్మ కొనసాగాడు. అయితే, ప్రపంచ కప్ లో జింబాబ్వే, ఫైనల్ లో కివీస్ తో మినహా చెప్పుకోదగిన స్థాయిలో అభిషేక్ రాణించలేదు. అదే విధంగా సంజూ, ఇషాన్ అదిరిపోయే బ్యాటింగ్ తో ప్రశంసలు అందుకున్నారు. కాగా.. ఇప్పుడు ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్ లో వీరికి కేటాయించిన స్థానాలు ఆసక్తి కరంగా మారాయి.
టీమిండియా టీ20 ప్రపంచ ఛాంపియన్ గా నిలిచిన వేళ ఐసీసీ తాజాగా టీ20 ర్యాంకింగ్స్ జాబితాను ప్రకటించింది. ఇందులో భారత బ్యాటర్లు అభిషేక్ శర్మ, ఇషాన్ కిషన్ సత్తా చాటారు. అభిషేక్ శర్మ తన స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. టోర్నీ ఆసాంతం అద్భుత ప్రదర్శనలు చేసిన ఇషాన్ కిషన్ రెండోస్థానానికి దూసుకొచ్చాడు. ఒక దశలో టీ20 ప్రపంచ కప్‌లో అభిషేక్ శర్మ ఆరంభంలో ఫామ్ లేమితో తీవ్ర ఇబ్బందులు పడ్డాడు. అతడి ప్రదర్శనతో టీ20 ర్యాంకింగ్స్‌లో అతడి స్థానాన్ని కోల్పోవచ్చనే చర్చ కూడా జరిగింది. ఎట్టకేలకు ఫైనల్ మ్యాచ్‌లో న్యూజిలాండ్‌పై 18 బంతుల్లోనే హాఫ్ సెంచరీ చేసి అదరగొట్టాడు. దీంతో అతడి స్థానంలో పదిలం అయింది. 875 పాయింట్లతో అభిషేక్ శర్మ అగ్రస్థానంలో కొనసాగుతున్నాడు.

తొలి స్థానం కోల్పోయిన వరుణ్ చక్రవర్తి
మరోవైపు గత రెండేళ్లు జట్టులోనే లేని ఇషాన్ కిషన్.. దేశవాళీలో సత్తా చాటి తుది జట్టులోకి రీఎంట్రీ ఇచ్చాడు. అద్భుత ప్రదర్శనలతో ఔరా అనిపించాడు. దీంతో ఐసీసీ ర్యాంకింగ్స్‌లో 871 పాయింట్లతో రెండోస్థానంలోకి దూసుకొచ్చాడు. 742 పాయింట్లతో తిలక్ వర్మ ఏడో స్థానంలో ఉండగా.. టీమిండియా టీ20 కెప్టెన్ సూర్యకుమార్ యాదవ్(722) తొమ్మిదో స్థానంలో కొనసాగుతు న్నాడు. అదే విధంగా బౌలర్ల విభాగంలో వరుణ్ చక్రవర్తి తన తొలి స్థానం కోల్పోయాడు. రెండో స్థానంలో నిలిచాడు.అఫ్గానిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానాన్ని అందుకున్నాడు. జస్‌ప్రీత్ బుమ్రా ఒక స్థానం పెరిగి.. టాప్ సిక్స్ లో నిలిచాడు. అర్ష్‌దీప్ సింగ్ 16వ స్థానానికి పడిపోగా.. అక్షర్ పటేల్ 17వ స్థానంతో సరిపెట్టుకున్నాడు. ఆల్‌రౌండర్ ర్యాకింగ్స్‌లో హార్దిక్ పాండ్యా రెండో స్థానాన్ని నిలబెట్టుకున్నాడు. సికిందర్ రాజా టాప్‌లో కొనసాగుతున్నారు. శివమ్ దూబే రెండు స్థానాలు దిగజారి 11వ స్థానానికి దిగజారాడు. భారత్ ప్రపంచ కప్ గెలిచిన వేళ ఈ ర్యాగింగ్స్ పైన ఆసక్తి కర చర్చ సాగుతోంది.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications