శ్రీకాకుళం వాసులకు రైల్వే గుడ్ న్యూస్- ఆ మూడు రైళ్లకు 3 కొత్త హాల్ట్ లు..!
శ్రీకాకుళం (srikakulam) వాసులకు రైల్వేశాఖ ఇవాళ ఓ గుడ్ న్యూస్ చెప్పింది. జిల్లా మీదుగా రాకపోకలు సాగిస్తున్న మూడు ప్రధాన రైళ్లకు మూడు స్టేషన్లలో కొత్తగా హాల్ట్ లు ఇస్తూ నిర్ణయం తీసుకుంది. జిల్లాకు చెందిన కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు విజ్ఞప్తి మేరకు రైల్వేశాఖ ఈ నిర్ణయం తీసుకుంది. ఎంతోకాలంగా చేసిన ప్రయత్నాల ఫలితంగా, శ్రీకాకుళం జిల్లాలో ప్రయాణించే మూడు ముఖ్యమైన రైళ్లకు ఇప్పుడు కీలక స్టేషన్లలో రైల్వే శాఖ హల్ట్ లు మంజూరు చేశారని రామ్మోహన్ తెలిపారు.
ఇందులో 58505/06 గుణుపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ రైలుకు హరిశ్చంద్రపురం వద్ద కొత్తగా హాల్ట్ ఇచ్చారు. అలాగే
1825/26 బెరహంపూర్-విశాఖపట్నం ప్యాసింజర్ రైలుకు మందస రోడ్ వద్ద కొత్తగా హాల్ట్ ఇచ్చారు. వీటితో పాటు 18117/18 రాజ్య రాణి ఎక్స్‌ప్రెస్ రైలుకు పాతపట్నం స్టేషన్ వద్ద కొత్తగా హాల్ట్ ఇచ్చారు. ఈ హల్ట్ ల ద్వారా జిల్లాలోని అంతర్గత ప్రాంతాలకు రవాణా సౌకర్యం మరియు విశాఖపట్నం వంటి ప్రధాన పట్టణాలకు విద్య, వైద్యం, ఉపాధి, వ్యాపార అవసరాల కోసం ప్రయాణం మరింత సులభమవుతుందన్నారు.

ఈ మేరకు తన అభ్యర్థనకు సానుకూలంగా స్పందించిన ప్రధాని నరేంద్ర మోదీకి, రైల్వే మంత్రి అశ్విని వైష్ణవ్ కు శ్రీకాకుళం జిల్లా ప్రజల తరఫున హృదయపూర్వక కృతజ్ఞతలు తెలియజేస్తున్నట్లు రామ్మోహన్ నాయుడు తెలిపారు. ఈ కొత్త స్టాపేజీల ద్వారా జిల్లాలోమెరుగైన రైల్వే కనెక్టివిటీ, ఉత్తరాంధ్ర ప్రాంత అభివృద్ధికి కొత్త అవకాశాలను తీసుకువస్తుందన్నారు. శ్రీకాకుళం జిల్లాలో ప్రతి ప్రాంతానికీ అభివృద్ధి చేరేలా మౌలిక వసతులను బలోపేతం చేసే దిశగా ఇది మరో ముఖ్యమైన అడుగు అని ఆయన అభివర్ణించారు.












Click it and Unblock the Notifications