Viral Video: ప్రియాంకా గాంధీని పలకరించిన ప్రధాని మోదీ.. మధ్యలో ఖర్గే పంచ్!
Viral Video: నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (ఎస్పీ) ఎంపీ సుప్రియా సూలే కూతురు రిసెప్షన్ వేడుకకు సంబంధించిన ఒక వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. ఈ వీడియోలో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, కాంగ్రెస్ ఎంపీ ప్రియాంక గాంధీ వాద్రాల మధ్య సరదా సంభాషణ కనిపిస్తుంది. ఈ ఇద్దరు నాయకుల మధ్య కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే కూడా ఉన్నారు.
ఆ వీడియోలో ప్రధానమంత్రి మోదీ ప్రియాంక గాంధీని.. "ప్రియాంక, ఎలా ఉన్నావు?" అని అడగ్గా, ప్రియాంక గాంధీ, "నేను బాగున్నాను సార్. మీరు ఎలా ఉన్నారు?" అని బదులిస్తుంది. దీనికి ప్రధానమంత్రి మోదీ నవ్వుతూ, "నేను ఇప్పటికీ అలాగే ఉన్నాను" అని అంటారు.

మోదీకి ఖర్గేకు ఫన్నీ పంచ్!
ఆ తర్వాత కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున్ ఖర్గే ఆ సంభాషణలో చేరారు. ఆయన ప్రధాని మోదీతో సరదాగా, "అన్నా, మీరు కొంచెం మారారు. మీరు కొంచెం మారారు" అని అన్నారు. ఖర్గే కామెంట్‌కు ప్రధాని మోదీ నవ్వి, "ఓ, నిజమా?" అని అడిగారు. పెళ్లి విందులో జరిగిన ఈ అనధికారిక, సరదా సంఘటన సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది. వారి మధ్య రాజకీయ విభేదాలు ఉన్నప్పటికీ, ఈ ముగ్గురు నాయకుల మధ్య జరుగుతున్న ఈ సంభాషణను ప్రజలు ఆస్వాదిస్తున్నారు.
At the wedding reception of Supriya Sule’s daughter -
— News Algebra (@NewsAlgebraIND) August 12, 2026
PM MODI : "And Priyanka, how are you?"
PRIYANKA VADRA : "I am good, sir! How are you?"
PM MODI : "I am still the same" 😀
KHARGE : "Bhai Sahab, you’ve changed a little. Aap thoda sa badal gaye hai" 😂
PM MODI : "Oh,… pic.twitter.com/BARXPxRufb
జూన్ 20న జరిగిన సుప్రియా సూలే కుమార్తె వివాహం
సుప్రియా సూలే నేషనలిస్ట్ కాంగ్రెస్ పార్టీ (శరద్ పవార్)కి చెందిన ఓ ప్రముఖ నాయకురాలు, మహారాష్ట్ర రాజకీయాలలో ప్రముఖ స్థానాన్ని కలిగి ఉన్నారు. సుప్రియా సూలే కూతురు రేవతీ సూలే 2026 జూన్ 20న ముంబైలో పారిశ్రామికవేత్త సారంగ్ లఖానీని వివాహం చేసుకున్నారు. ఆగస్టు 10న ఢిల్లీలో ఘనంగా రిసెప్షన్ జరిగింది. ఈ రిసెప్షన్‌కు అధికార, ప్రతిపక్ష పార్టీలకు చెందిన ప్రముఖ నాయకులు హాజరయ్యారు. ప్రధాని మోదీకి సంబంధించిన ఈ వీడియో కూడా ఈ రిసెప్షన్‌కు సంబంధించినదే.














Click it and Unblock the Notifications