గ్యాస్ ఛాంబర్‌లా మారిన విమానం: 9 గంటల పాటు ప్రయాణీకులకు నరకయాతన!
ఢిల్లీ నుంచి పుణె వెళ్లాల్సిన స్పైస్‌జెట్ విమానంలో ప్రయాణీకులకు తీవ్ర నరకయాతన ఎదురైంది. విమానంలో ఏసీ పనిచేయకపోవడంతో గాలి ఆడక, విపరీతమైన వేడితో ప్రయాణీకులు ఊపిరాడక అల్లాడిపోయారు. సాధారణంగా 2 గంటల 10 నిమిషాల్లో ముగియాల్సిన ప్రయాణం.. ఈ సాంకేతిక సమస్య, తీవ్ర ఆలస్యం కారణంగా 9 గంటల సుదీర్ఘ నరకయాతనగా మారింది. ఢిల్లీలోని ఇందిరా గాంధీ ఇంటర్నేషనల్ ఎయిర్పోర్టులో మంగళవారం రాత్రి ఈ ఘటన చోటుచేసుకుంది.
షెడ్యూల్ ప్రకారం రాత్రి 9.45 గంటలకు బయలుదేరాల్సిన స్పైస్‌జెట్ ఫ్లైట్(SG-105) రాత్రి 10.30 గంటలకు ఆలస్యంగా బోర్డింగ్ ప్రారంభించింది. ప్రయాణీకులు విమానంలోకి ఎక్కిన అనంతరం లోపల ఏసీ పని చేయలేదు. విమానం టేకాఫ్ అయ్యాక ఏసీ ప్రారంభమవుతుందని భావించినప్పటికీ.. లోపల ఉష్ణోగ్రత క్రమంగా పెరుగుతూ తీవ్రమైన ఉక్కపోత మొదలైంది. విమానంలో గాలి సరిగా లేకపోవడంతో లోపల ఉన్ 150 మంది ప్రయాణీకులు చెమటతో తడిసి ముద్దయ్యారు.

విమానంలో గాలి ఆడక పరిస్థితి విషమిస్తున్నప్పటికీ.. పైలట్లు విమానాన్ని రన్‌వే వైపు తీసుకెళ్లే ప్రయత్నం చేశారు. ప్రయాణీకులు, క్యాబిన్ సిబ్బంది వేడితో ఇబ్బంది పడుతుండగా.. ఏసీకి బదులుగా సిబ్బంది బ్లోయర్లను ఆన్ చేయడంతో విమానం వేడి మరింత పెరిగి గ్యాస్ ఛాంబర్‌లా తయారైందని ప్రయాణీకులు ఆవేదన వ్యక్తం చేశారు. విమానంలో గర్భిణీలు, చిన్నపిల్లలు, వయోవృద్ధులు ఉండటంతో అందరూ భయాందోళనకు గురయ్యారు. ఓ గర్బిణీ ఊపిరాడక స్పృహతప్పి పడిపోయే పరిస్థితి రావడంతో ప్రయాణీకులు తమ నిరసనను వ్యక్తం చేశారు.
పరిస్థితి చేయిదాటిపోవడంతో రన్‌వేపై టేకాఫ్ ను నిలిపివేయడంతో పాటు ప్రయాణీకులను విమానం నుంచి కిందకు దింపేశారు. విమానాన్ని మార్చాలని డిమాండ్ చేస్తూ ప్రయాణీకులు రన్‌వేపై దాదాపు 2 గంటల పాటు బైఠాయించి.. స్పైస్‌జెట్ యాజమాన్యానికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఈ సమయంలో ప్రయాణీకులకు ఎలాంటి తాగునీరు లేదా అల్పాహారం అందించలేదని.. వైద్య సదుపాయం కల్పించడంలో ఆలస్యం చేశారని ప్రయాణీకులు ఆరోపించారు. చివరకు సాంకేతిక బృందం వచ్చి పరీశీలించిన తర్వాత ప్రయాణీకులను తెల్లవారుజామున 5 గంటలకు పుణెకు పంపించారు. ఈ ఘటనపై స్పైస్‌జెట్ ప్రతినిధి స్పందిస్తూ.. సాంకేతిక లోపం కారణంగానే విమానం టేకాఫ్ ఆలస్యమైందని వెల్లడించారు. ప్రయాణీకులకు కలిగిన అసౌకర్యానికి స్పైస్ జెట్ యాజమాన్యం తీవ్ర విచారం వ్యక్తం చేసింది.
हे दिल्लीहून पुण्याला जाणारे स्पाइसजेटचे विमान होते. विमानामध्ये आबालवृद्धांसह लहान मुलं देखील होती. या विमानात बसल्यानंतर विमानातील तापमान अचानक प्रचंड वाढलं. तापमान एवढं वाढत गेलं की लोकांना सहन होईना. सगळे घामाने ओले झाले होते. लोकांना श्वास घ्यायला खूप जास्त त्रास व्हायला… pic.twitter.com/jVYTEMcFNv
— Leshpal_speaks (@Leshpal_speaks) August 11, 2026













Click it and Unblock the Notifications