ఈ తెల్లవారు జామున భారీ భూకంపం

కేంద్ర పాలిత ప్రాంతం లఢక్ లో భారీ భూకంపం సంభవించింది. ఉత్తర ప్రాంతాన్ని వణికించింది. ఈ భూకంపం వల్ల ప్రాణ, ఆస్తి నష్టం సంభవించినట్లు ఇప్పటివరకు ఎలాంటి సమాచారం అందలేదు. కొన్ని చోట్ల నివాసాలు పాక్షికంగా దెబ్బతిన్నట్లు ప్రాథమికంగా అందిన సమాచారాన్ని బట్టి తెలుస్తోంది. ప్రకంపనల ధాటికి జనం భయంకపితులు అయ్యారు. రోడ్ల మీదికి పరుగులు తీశారు. ప్రధాన భూకంపం తర్వాత కూడా తేలికపాటి ప్రకంపనలు నమోదయ్యాయి.

ఈ తెల్లవారు జామున సరిగ్గా 6:05 నిమిషాలకు భూమి ప్రకోపించింది. దీని తీవ్రత రిక్టర్ స్కేల్ పై 5.5గా రికార్డయింది. లేహ్ కు ఉత్తరం- ఆగ్నేయ దిశగా 302 కిలోమీటర్ల దూరంలో భారత సరిహద్దు ప్రాంతంలో భూమి కంపించింది. 36.881 అక్షాంశం, 74.402 రేఖాంశం వద్ద గల ప్రాంతాన్ని భూకంప కేంద్రంగా గుర్తించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సెస్మాలజీ వెల్లడించింది. అంతర్జాతీయ సరిహద్దు ప్రాంతం కావడం వల్ల భూకంప తీవ్రత పాకిస్తాన్, ఆఫ్ఘనిస్తాన్, తజికిస్తాన్ లల్లోనూ కనిపించింది. ఆయా దేశాల సరిహద్దు ప్రాంతాల్లో వీటి తీవ్రత నమోదైంది.

Earthquake Today Magnitude 5 5 On Richter Scale Strikes Leh Tremor Felt Ladakh Jammu and Kashmir

ఉపరితలం నుంచి 10 కిలోమీటర్ల లోతున టెక్టోనిక్ ప్లేట్స్ లల్లో చోటు చేసుకున్న భారీ కదలికల వల్ల ప్రకంపనలు సంభవించినట్లు సెస్మాలజీ సెంటర్ పేర్కొంది. కార్గిల్, లఢక్, జమ్మూ కాశ్మీర్ లల్లో పలు ప్రాంతాల్లో దీని తీవ్రత కనిపించింది. ఇళ్లల్లోని వస్తువుల కిందపడ్డాయి. వీటికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో వైరల్ అయ్యాయి. ఇప్పటివరకు ఎటువంటి ప్రాణ, ఆస్తినష్టం సంభవించినట్లు వార్తలు అందలేదు.

తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుక
తిరుచానూరు ఆలయంలో వరలక్ష్మీవ్రతం- మహిళలకు టీటీడీ కానుక

లేహ్‌లో తాజా ప్రకంపనలు హిమాలయ పర్వత శ్రేణుల్లోని భౌగోళిక మార్పుల తీవ్రతకు అద్దం పట్టినట్టయింది. జమ్మూ కాశ్మీర్, లఢక్ ఫాల్ట్ లైన్ జోన్ పరిధిలో ఉంటాయి. దీని పరిధిలో ఉండే సెవెన్ ప్లేట్స్ నిరంతరం క్రియాశీలకంగా కదులుతూ ఉండటం, ఒకదానికొకటి ఢీ కొట్టుకోవడం సర్వసాధారణం. ఆ సమయంలో వెలువడే తరంగాలు ఒక్కసారిగా భూ ఉపరితలాన్ని బలంగా తాకుతుంటాయి. ఫలితంగా ఈ జోన్ లో తరచూ భూమి ప్రకంపిస్తూ ఉంటుంది.

ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లు
ఏపీ, తెలంగాణ మీదుగా తమిళనాడుకు నూతన అమృత్ భారత్ ఎక్స్‌ప్రెస్‌- హాల్ట్ స్టేషన్లు

రిక్టరు స్కేల్ పై 2.0 కంటే తక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు ఈ ఫాల్ట్ లైన్ జోన్ లో సాధారణం. వీటిని పెద్దగా గుర్తించలేరు. 6.0 అంతకంటే ఎక్కువ తీవ్రతతో వచ్చే భూకంపాలు అత్యంత ప్రమాదకరమైనవి. ఇవి నగరాలకు నగరాలనే నాశనం చేసే సామర్థ్యాన్ని కలిగి ఉంటాయి. వెనెజులాలో ఇటీవలే సంభవించిన భూకంపం ఈ కోవకు చెందినదే.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+