సాయికృష్ణ లాకప్ డెత్ కేసు:సుప్రీం కోర్టు సీరియస్, కీలక ఆదేశాలు.. ఇక నేరుగా..!!
తెలుగు రాష్ట్రాల్లో సంచలనంగా మారిన గాదె సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో కీలక పరిణామం చోటు చేసుకుంది. కేసు దర్యాప్తు విషయంలో పోలీసుల తీరు పైన సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. కేసు విచారణ తామే చేపడతామని.. ఈ కేసు తక్షణమే బదిలీ చేస్తున్నట్లు వెల్లడించింది. వైసీపీ ఎంపీ గురుమూర్తి దాఖలు చేసిన పిటీషన్ పై విచారణ చేసిన సుప్రీంకోర్టు ఈ మేరకు కీలక ఆదేశాలు ఇస్తూ.. హైకోర్టు విచారణ పై స్టే విధించింది. ప్రతివాదులకు నోటీసులు జారీ చేసింది.
సాయికృష్ణ లాకప్ డెత్ కేసులో సుప్రీంకోర్టు సీరియస్ అయింది. కీలక ఆదేశాలు జారీ చేసింది. సెప్టెంబర్ 30వ తేదీ లోగా కేసుకు సంబంధించిన పూర్తి వివరాలను సీల్డ్ కవర్ లో సమర్పించాల ని ఆదేశించింది. హైకోర్టులో సాయికృష్ణ లాకప్ డెత్ కేసుకు సంబంధించిన అన్ని పిటీషన్లను తమకు బదిలీ చేయాలని సుప్రీం నిర్దేశించింది.

కేసు తదుపరి విచారణను అక్టోబర్ 12వ తేదీకి వాయిదా వేసింది. ఈ క్రమంలో కేసు విచారణ తీరును సుప్రీం తప్పు బట్టింది. సాయికృష్ణ కేసులో తల్లి ఫిర్యాదు చేస్తే ఎందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయలేదని.. సీసీ టీవీ ఫుటేజ్ ధ్వంసం చేస్తుంటే అధికారులు ఏం చేస్తున్నారంటూ సుప్రీంకోర్టు ఆగ్రహం వ్యక్తం చేసింది. సాయికృష్ణ డెడ్ బాడీ ఇప్పటి దాకా దొరకలేదంటే తీరు ఎలా ఉందో అర్దం అవుతుందని సుప్రీం సీరియస్ అయినట్లు తెలుస్తోంది.












Click it and Unblock the Notifications
