IMEC: ఐరాస వేదికగా భారత్ కు ట్రంప్ గుడ్ న్యూస్-యూరప్ రూట్ తో ఇరాన్ కు చెక్..!

పశ్చిమాసియాలో ఈ ఏడాది చోటు చేసుకున్న ఘర్షణలు ప్రపంచ చమురు సరఫరాపై తీవ్ర ప్రభావం చూపుతున్న వేళ.. హార్ముజ్ జలసంధికి ప్రత్యామ్నాయ మార్గాల కోసం అన్వేషణ సాగుతోంది. ఇదే క్రమంలో తెరపైకి వచ్చిన ఇండియా-మిడిల్ ఈస్ట్-యూరప్ ఆర్దిక కారిడార్ (IMEC)కు ఇవాళ అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ మద్దతు ప్రకటించారు. పశ్చిమాసియా ఘర్షణల నేపథ్యంలో ఇరాన్ నుంచి ఇంధన మౌలిక సదుపాయాల్ని ఇతర ప్రాంతాలకు తరలించేందుకు ఉపయోగపడుతుందని భావిస్తున్న ఈ భారత్-యూరప్ కారిడార్ పై ఐరాస వేదికగా ట్రంప్ ఆమోదముద్ర వేశారు.

ఇరాన్ చేతికి బాబ్ ఎల్-మాండెబ్? ట్రంప్ తో పాటు భారత్ కూ ఇక కష్టాలే..!
ఇరాన్ చేతికి బాబ్ ఎల్-మాండెబ్? ట్రంప్ తో పాటు భారత్ కూ ఇక కష్టాలే..!

గల్ఫ్ చమురు సరఫరాదారులను, భారతీయ శుద్ధి కర్మాగారాలను, ఉపఖండంతో పాటు యూరప్ లోని వినియోగదారులను కలిపేలా ఈ ఐమెక్ కారిడార్ ను ప్లాన్ చేశారు. ఐమెక్ భారత్ లోని ముంద్రా పోర్ట్ ను సముద్ర మార్గాల ద్వారా యూఏఈలోని ఫుజైరా పోర్ట్ కు కలుపుతుంది. అక్కడి నుంచి పైప్‌లైన్ ద్వారా సోలార్ పవర్ తో నడిచే రైలు నెట్‌వర్క్ ద్వారా సౌదీ అరేబియా, జోర్డాన్, ఇజ్రాయెల్‌లకు, అక్కడి నుండి హైఫా పోర్ట్ నుండి ఓడల ద్వారా ఐరోపాకు అనుసంధానిస్తుంది. ఈ కారిడార్ హార్ముజ్ జలసంధితో పాటు సూయజ్ కాలువ-ఎర్ర సముద్రాలను బైపాస్ చేయనుంది. దీంతో పశ్చిమాసియా ఘర్షణల ప్రభావం దీనిపై ఉండదు.

Trump Endorses IMEC at UNGA Weeks After Praising Syria as Gulf-to-Mediterranean Energy Corridor
హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!
హౌతీల దెబ్బకు దిక్కుతోచని సౌదీ ..! సీక్రెట్ గా శత్రుదేశం ఇజ్రాయెల్ వద్దకు.!


అయితే ఐమెక్ వాస్తవరూపం దాల్చడానికి సౌదీ అరేబియా అబ్రహం ఒప్పందాలలో చేరడమే కీలకం. దీనికి ప్రతిగా అధ్యక్షుడు ట్రంప్ రియాద్‌కు పౌర అణు ఒప్పందాన్ని ప్రతిపాదించి, ఆ దేశానికి 24 బిలియన్ డాలర్ల విలువైన ఎఫ్ 35 యుద్ధ విమానాలను అమ్ముతామని ప్రతిపాదించారు. మరోవైపు సౌదీ అరేబియా.. టర్కీ, పాకిస్తాన్‌లతో రక్షణ ఒప్పందం చేసుకోవడంతో ఐమెక్ ప్లాన్ కు సవాళ్లు తప్పడం లేదు. టర్కీ, పాకిస్తాన్ రెండూ ఇజ్రాయెల్‌ను వ్యతిరేకిస్తున్నాయి. ట్రంప్ ప్రభుత్వం పైకి మౌనంగా ఉన్నా.. టర్కీ, పాక్, సౌదీ మక్కా రక్షణ ఒప్పందంపై ఆందోళన చెందుతోంది. ఇలాంటి పరిస్ధితుల్లో సౌదీని ఒప్పించి ఐమెక్ కు సహకరించడం ట్రంప్ చేతుల్లోనే ఉంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+