ఈ సండే బ్యాంకులు ఓపెన్.. కేంద్రం సంచలన ప్రకటన

సమ్మె, వరుస సెలవుల వల్ల సామాన్య ప్రజలు, వినియోగదారులు తీవ్ర ఇబ్బందులు పడకుండా చూసేందుకు కేంద్ర ప్రభుత్వం ఒక అనూహ్యమైన నిర్ణయం తీసుకుంది. యునైటెడ్ ఫోరమ్ ఆఫ్ బ్యాంక్ యూనియన్స్ (UFBU) సెప్టెంబర్ 28 నుంచి 30 వరకు మూడు రోజుల పాటు దేశవ్యాప్త సమ్మెకు పిలుపునిచ్చిన సంగతి తెలిసిందే.

అయితే సమ్మెకు ముందే శని, ఆదివారాలు సాధారణ సెలవులు కావడంతో ఐదు రోజుల పాటు బ్యాంకింగ్ సేవలు పూర్తిగా స్థంభించిపోయే ప్రమాదం ఏర్పడింది. ఈ తీవ్ర పరిణామాన్ని గుర్తించిన కేంద్ర ఆర్థిక శాఖ, సాధారణ సెలవు దినమైన సెప్టెంబర్ 27 ఆదివారం నాడు కూడా బ్యాంకులు పనిచేస్తాయని ప్రకటించి వినియోగదారులకు బిగ్ రిలీఫ్ ఇచ్చింది.

Sunday Bank Operations Approved by RBI Complete Branch Services Available Before Proposed Strike
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల మెరుపు సమ్మె: స్తంభించిన రూ. వేల కోట్ల లావాదేవీలు
దేశవ్యాప్తంగా బ్యాంక్ ఉద్యోగుల మెరుపు సమ్మె: స్తంభించిన రూ. వేల కోట్ల లావాదేవీలు

ఆదివారం కూడా బ్యాంకులు, ఏటీఎంలు పూర్తిస్థాయిలో పని చేస్తాయి!

కేంద్ర ప్రభుత్వ సూచనల మేరకు అన్ని ప్రభుత్వ రంగ బ్యాంకులు (PSBs), ప్రాంతీయ గ్రామీణ బ్యాంకులు (RRBs) సెప్టెంబర్ 27 ఆదివారం నాడు యథాతథంగా కొనసాగుతాయని స్పష్టమైంది. సాధారణ బ్యాంక్ బ్రాంచ్‌లతో పాటు ఏటీఎం లింక్ బ్రాంచ్‌లు, కరెన్సీ చెస్ట్‌లు కూడా ఈ ఆదివారం రోజున తెరిచి ఉంచేందుకు రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా (RBI) కూడా అధికారిక అనుమతి ఇచ్చింది. దీనివల్ల మూడు రోజుల సమ్మె ప్రారంభం కాకముందే వినియోగదారులు తమకు కావలసిన అత్యవసర నగదు ఉపసంహరణలు, డిపాజిట్లు , ఇతర ఆర్థిక లావాదేవీలను సునాయాసంగా పూర్తి చేసుకోవడానికి వీలు కలగనుంది.

 సెప్టెంబర్​ లో బ్యాంకులకు భారీగా సెలవులు, సమ్మె- లిస్టు..!!
సెప్టెంబర్​ లో బ్యాంకులకు భారీగా సెలవులు, సమ్మె- లిస్టు..!!

సమ్మెను విరమించుకోవాలని ప్రభుత్వం విజ్ఞప్తి!

మరోవైపు బ్యాంకింగ్ సేవలకు ఎలాంటి అంతరాయం కలగకుండా చూసేందుకు బ్యాంక్ యాజమాన్యాలు, కేంద్ర ఆర్థిక శాఖ ప్రతినిధులు బ్యాంక్ యూనియన్లతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. ప్రజా సంక్షేమం, వినియోగదారుల సౌకర్యార్థం ప్రతిపాదిత సమ్మెను వాయిదా వేసుకోవాలని ప్రభుత్వం అధికారికంగా విజ్ఞప్తి చేసింది. అయినప్పటికీ సమ్మె జరిగే పరిస్థితులు ఉంటే, ప్రజలు ముందస్తుగా తమ బ్యాంకింగ్ పనులను ఆదివారమే పూర్తి చేసుకోవాలని ఆర్థిక శాఖ సూచించింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+