CEC జ్ఞానేష్ పై వేటుకు విపక్షాల డిమాండ్..! ముప్పేట దాడితో EC క్లారిటీ..!

కేంద్ర ఎన్నికల సంఘంలో ఇద్దరు కమిషనర్లను కాదని ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ (CEC) ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని, ఇలా గత 10 నెలల్లో 14 నిర్ణయాలు తీసుకున్నారని ఇండియన్ ఎక్స్ ప్రెస్ ప్రచురించిన కథనం దేశవ్యాప్తంగా తీవ్ర కలకలం రేపుతోంది. బీజేపీకి మేలు చేసేందుకు వీలుగా జ్ఞానేష్ కుమార్ ఇలా ఏకపక్షంగా నిర్ణయాలు తీసుకొంటున్నారని మండిపడుతున్న విపక్షాలు.. ఆయనపై తక్షణం అభిశంసన తీర్మానం ప్రవేశపెట్టి, వేటు వేయాలని డిమాండ్ చేస్తున్నాయి. ఈ నేపథ్యంలో ఈసీ (ECI) స్పందించింది.

ఎన్నికల కమిషన్లో విభేదాలు (ECI)

ప్రత్యేక ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియపై ఎన్నికల సంఘంలోని ఇద్దరు కమిషనర్లు తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేసినట్లు వచ్చిన కథనాలు నేపథ్యంలో ప్రధాన ఎన్నికల కమిషనర్ జ్ఞానేష్ కుమార్ ఏకపక్ష నిరంకుశ ధోరణితో వ్యవహరిస్తున్నారని, ఆయనను వెంటనే తప్పించాలని విపక్షాలు డిమాండ్ చేశాయి. ఓటర్ల జాబితా ప్రక్షాళన సమయంలో వివిధ రాష్ట్రాల్లో పేర్ల తొలగింపుతో సహా అనేక అంశాలపై ఎన్నికల కమిషనర్లు సుఖ్బీర్ సింగ్ సంధు, వివేక్ జోషి అభ్యంతరాలు వ్యక్తం చేశారని అధికారులు తెలిపారు. దీనిపై స్పందించిన కాంగ్రెస్ ప్రధాన కార్యదర్శి కేసీ వేణుగోపాల్.. జ్ఢానేష్ కుమార్‌కు పదవిలో కొనసాగే అర్హత లేదన్న విషయంలో ఎటువంటి సందేహం లేదన్నారు. తమ యజమాని ఆదేశాల మేరకు ఒక వ్యక్తి ఇష్టానుసారం పేర్లను ఎలా తొలగించగలరు? ప్రజాస్వామ్యాన్ని ప్రమాదంలో పడేసే స్పష్టమైన చట్టవిరుద్ధమైన చర్యలు తీసుకోవడానికి తోటి రాజ్యాంగబద్ధ అధికారులను ఎలా పక్కన పెట్టగలరని ప్రశ్నించారు.

ECI Says Decisions Were Unanimous as Opposition Calls Gyanesh Kumar Planted Demands His Removal
ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?
ఎన్నికల సంఘంలో ముసలం..! కమిషనర్లకు తెలియకుండా సీఈసీ 14 నిర్ణయాలు?

సీఈసీని తప్పించాలని విపక్షం డిమాండ్

భారత ఎన్నికల సంఘాన్ని లోపలి నుంచి నిర్వీర్యం చేసేందుకు, బీజేపీ ఆయన్ను నియమించి, రక్షిస్తోందని కాంగ్రెస్ మీడియా, ప్రచార విభాగం అధిపతి పవన్ ఖేరా విమర్శించారు. ఈసీలో పరిస్థితులు అంత సవ్యంగా లేవని ముందే తెలుసని, కానీ తాజా రిపోర్టులతో పరిస్థితులు ఎంత గందరగోళంగా, పనికిమాలినవిగా, నిజం చెప్పాలంటే ఆందోళనకరంగా మారాయో బట్టబయలు చేసిందన్నారు. మరోవైపు జ్ఞానేష్ కుమార్ ని సస్పెండ్ చేయాలని, ఆయన చర్యల వెనుక ఎవరున్నారో విచారించేందుకు ఎఫ్ఐఆర్ నమోదు చేయాలని రాజ్యసభ ఎంపీ కపిల్ సిబల్ డిమాండ్ చేశారు. అలాగే చట్టబద్ధమైన ఓటరు నమోదు ఫారం 6లో మార్పులు "పూర్తిగా తప్పు, చట్టవిరుద్ధమని మాజీ ప్రధాన ఎన్నికల కమిషనర్ ఓ.పి.రావత్ తెలిపారు.

రాజ్యసభలో అభిశంసన పెట్టాల్సిందే

ఇది ఇకపై ఎన్నికల కమిషన్ కాదని, సీఈసీ కుమార్ ఆధ్వర్యంలో నడుస్తున్న ఏకపక్ష నిరంకుశత్వమని సీపీఐ(ఎం) ఎంపీ జాన్ బ్రిట్టాస్ విమర్శించారు. సీఈసీని తొలగించే ప్రక్రియను పార్లమెంటు వెంటనే ప్రారంభించాలని, ఇప్పటికే తాము నోటీసు కూడా ఇచ్చినట్లు గుర్తుచేశారు. జ్ఞానేష్ కుమార్ జైలుకు వెళ్తాడని, అతను వెళ్లాల్సిందేనని, అతని యజమానులు దేశం విడిచి పారిపోతారని శివసేన ఎంపీ సంజత్ రౌత్ తెలిపారు. సీఈసీ అభిశంసనకు గతంలో విపక్షాలు ఇచ్చిన తీర్మానాన్ని రాజ్యసభ ఇప్పటికైనా పరిణనలోకి తీసుకోవాలని టీఎంసీ రాజ్యసభ ఎంపీ డెరెక్ ఓబ్రెయిన్ కోరారు.

ECI Says Decisions Were Unanimous as Opposition Calls Gyanesh Kumar Planted Demands His Removal
విజయ్ కు ఈసీ బిగ్ న్యూస్- టీవీకే పార్టీ, గుర్తుపై కీలక నిర్ణయం..!
విజయ్ కు ఈసీ బిగ్ న్యూస్- టీవీకే పార్టీ, గుర్తుపై కీలక నిర్ణయం..!

విమర్శలపై స్పందించిన ఈసీ

ఎన్నికల కమిషన్లో అంతర్గత విభేదాలపై వచ్చిన వార్తలపై ఈసీ స్పందించింది. ఈసీ తీసుకున్న అన్ని చర్యలు కమిషన్ చట్టాలు, ఆదేశాలకు అనుగుణంగానే ఉన్నాయని తెలిపింది. ఎన్నికల సంఘం జారీ చేసే అన్ని అధికారిక ఉత్తర్వులు, నిర్ణయాలు, పరిపాలనా ఆదేశాలకు పూర్తి చట్టబద్ధత ఉంటుందన్నారు. ముసాయిదా దశలో కమిషన్ సభ్యులు లేవనెత్తే కార్యాచరణకు సంబంధించిన ప్రశ్నలు లేదా సూచనలు సాధారణ పరిపాలనా ప్రక్రియలో భాగమేనంది. ఓటర్ల హక్కులను పరిరక్షించడం, ఎన్నికల ప్రక్రియను మరింత మెరుగుపరచడమే ఈ సూచనల ఉద్దేశమని తెలిపింది. కమిషన్‌లోని ప్రతి అధికారి కూడా ఎన్నికల వ్యవస్థను మెరుగుపరిచేందుకు తన సూచనలను కమిషన్‌కు అందించే అధికారం కలిగి ఉంటారని పేర్కొంది. గత 10 నెలల కాలానికి సంబంధించిన కొన్ని అంతర్గత నోట్లు లేదా అభిప్రాయాలను మాత్రమే ప్రస్తావించడం ద్వారా మొత్తం పరిస్థితిని అర్థం చేసుకోలేమని తెలిపింది. ఇటీవలి నెలల్లో కమిషన్ అనేక నిర్ణయాలు తీసుకుందని, ఆదేశాలు జారీ చేసిందని గుర్తుచేసింది. గత ఏడాది కాలంలో కమిషన్ తీసుకున్న ఈ నిర్ణయాలన్నీ ఏకగ్రీవ నిర్ణయాల ఫలితమే అని పేర్కొంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+