పవిత్రమైన రామాయణానికి ఇదేం ప్రమోషన్? వైరల్ అవుతున్న ఫొటోలు!

భారతీయ ఇతిహాసం ఆధారంగా తెరకెక్కిన 'రామాయణం' సినిమాపై థాయిలాండ్‌లో జరుగుతున్న పబ్లిసిటీ స్టంట్స్ ఇప్పుడు తీవ్ర వివాదానికి దారితీశాయి. సోనీ పిక్చర్స్ థాయిలాండ్ సంస్థ ఈ సినిమా మీడియా స్క్రీనింగ్ కోసం ఏర్పాటు చేసిన ప్రమోషనల్ ఈవెంట్ ఫోటోలు నెట్టింట వైరల్ కావడంతో నెటిజన్లు, భక్తుల నుంచి తీవ్ర విమర్శలు వ్యక్తమవుతున్నాయి.

Ramayana: రావణుడి సింహాసనం,ఆభరణాల ఖర్చు ఎంతయ్యిందో తెలుసా..?
Ramayana: రావణుడి సింహాసనం,ఆభరణాల ఖర్చు ఎంతయ్యిందో తెలుసా..?

అప్సరసల లుక్‌‌లో మోడల్స్ సందడి
ఈ ప్రమోషనల్ కార్యక్రమంలో భాగంగా ముగ్గురు గ్లామరస్ మోడల్స్ అరకొర బట్టలు, భారీ ఆభరణాలతో ఉనన డిజైనర్ వేర్ ధరించి సినిమా బ్యాక్‌డ్రాప్ ముందు ఫోజులిచ్చారు. హిందూ పురాణాల్లో పేర్కొన్న ఇంద్రలోకపు అప్సరసలైన రంభ, ఊర్వశి, మేనకలను తలపించేలా వీరి గెటప్‌లను డిజైన్ చేశారు. అయితే ఈ మోడల్స్ సినిమాలో నటించలేదని, కేవలం థాయిలాండ్ పబ్లిసిటీ కోసం మాత్రమే వీరిని నిర్వాహకులు నియమించుకున్నారని సమాచారం.

Ramayana Movie Promotion Controversy in Thailand Glamorous Models Event Triggers Backlash

నెటిజన్ల భిన్నాభిప్రాయాలు
ఈ ఫోటోలు బయటకు రావడంతో సోషల్ మీడియాలో భిన్నాభిప్రాయాలు వ్యక్తమవుతున్నాయి. కొందరు నెటిజన్లు సరదాగా "త్రేతా యుగం నాటి అప్సరసలు నేరుగా థాయిలాండ్‌లో ల్యాండ్ అయ్యారు" అంటూ కామెంట్లు చేయగా.. మరికొందరు మాత్రం తీవ్రంగా మండిపడుతున్నారు. అత్యంత పవిత్రమైన, పూజనీయమైన రామాయణం వంటి ఆధ్యాత్మిక ఇతిహాస చిత్రం ప్రమోషన్ల కోసం గ్లామరస్ మోడల్స్‌ను ఉపయోగించడంపై పలువురు హిందూ సంఘాల ప్రతినిధులు, భక్తులు ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. భారతీయ సంస్కృతికి, పవిత్ర గ్రంథాలకు గౌరవం ఇస్తూ బాధ్యతాయుతంగా ప్రచారం కార్యక్రమాలు నిర్వహించాలని డిమాండ్ చేస్తున్నారు.

సీతగా సాయి పల్లవి.. శూర్పణఖగా రకుల్.. ప్రేక్షకుల మనసు గెలిచింది ఎవరు?
సీతగా సాయి పల్లవి.. శూర్పణఖగా రకుల్.. ప్రేక్షకుల మనసు గెలిచింది ఎవరు?

థాయిలాండ్‌లో విడుదలై విశేష ప్రజాదరణ
కాగా రామాయణం సినిమా థాయిలాండ్‌లోని ఐమాక్స్ స్క్రీన్లతో సహా ప్రధాన థియేటర్లలో హిందీ, తమిళం, థాయ్ భాషల్లో విడుదలైంది. ప్రేక్షకుల సౌకర్యార్థం థాయ్, ఇంగ్లీష్ సబ్‌టైటిల్స్‌ను కూడా అందుబాటులో ఉంచారు. ఓ వైపు సినిమాకు ప్రపంచవ్యాప్తంగా అద్భుతమైన విజువల్స్ పరంగా మంచి ప్రశంసలు వస్తున్నప్పటికీ.. థాయిలాండ్‌లో జరిగిన ఈ ప్రమోషన్ల విధానం మాత్రం వివాదాస్పదంగా మారింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+