100 దేశాల ప్రతినిధులతో, హైటెక్స్ వేదికగా.. హైదరాబాద్ లో ప్రతిష్టాత్మక భారత్ సమ్మిట్!

టెక్నాలజీ, పారిశ్రామిక మరియు సాంస్కృతిక రంగాల్లో గ్లోబల్ హబ్‌గా మారుతున్న భాగ్యనగరం హైదరాబాద్ మరో ప్రతిష్టాత్మక అంతర్జాతీయ సదస్సుకు వేదికవుతోంది. కేంద్ర ప్రభుత్వం మరియు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం సంయుక్తంగా అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన మూడు రోజుల 'భారత్ సమ్మిట్' నగరంలోని ప్రఖ్యాత హైటెక్స్ కన్వెన్షన్ సెంటర్‌లో అట్టహాసంగా ప్రారంభం కానుంది. ప్రపంచ దేశాల దృష్టిని ఆకర్షిస్తున్న ఈ వేడుకకు సన్నాహాలు జోరుగా సాగుతున్నాయి.

ఈ అంతర్జాతీయ శిఖరాగ్ర సదస్సు నవంబర్ 12 నుండి 14 వరకు మూడు రోజుల పాటు సాగనుంది. ప్రపంచవ్యాప్తంగా సుమారు 100 దేశాల నుండి 450కి పైగా ప్రతినిధులు, వివిధ రంగాల నిపుణులు, పారిశ్రామిక దిగ్గజాలు, విదేశీ రాయబారులు హాజరుకానున్నారు. భారత్ సాధిస్తున్న సాంకేతిక పురోగతి, ఆర్థిక వృద్ధి మరియు సాంస్కృతిక వైవిధ్యాన్ని ప్రపంచ వేదికపై చాటిచెప్పేందుకు ఈ సమ్మిట్ ఒక గొప్ప వేదికగా నిలవనుంది. వివిధ దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలను మరింత బలపరచడంతో పాటు, పెట్టుబడులను ఆకర్షించడమే లక్ష్యంగా ఈ సదస్సును నిర్వహిస్తున్నారు.

Bharat Summit Hyderabad Hitex to Host 3-Day Bharat Summit with Delegates from 100 Countries from november 12th to 14th

ఈ సదస్సులో అధునాతన సాంకేతికతలైన ఆర్టిఫిషియల్ ఇంటెలిజెన్స్, గ్రీన్ ఎనర్జీ, డిజిటల్ టెక్నాలజీస్ మరియు భవిష్యత్ ఆవిష్కరణలపై ప్రత్యేక చర్చా గోష్టులు జరగనున్నాయి.
గ్లోబల్ ఇన్వెస్టర్లు, స్టార్టప్ ఫౌండర్లు మరియు పారిశ్రామిక వేత్తల మధ్య సరికొత్త ఒప్పందాలకు (MoUs) కు ఈ సదస్సు వేదిక కానుంది. భారతీయ సంస్కృతి, కళలు మరియు సంప్రదాయాలను ప్రతిబింబించేలా ప్రత్యేక సాంస్కృతిక కార్యక్రమాలను నిర్వహించి, విదేశీ అతిథులకు ఈ సదస్సు ద్వారా ఘన స్వాగతం పలకనున్నారు.

సీఎం రేవంత్ కొడంగల్ పర్యటన షెడ్యూల్ ఇలా.. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!
సీఎం రేవంత్ కొడంగల్ పర్యటన షెడ్యూల్ ఇలా.. రూ.9వేల కోట్ల అభివృద్ధి పనులకు శ్రీకారం!

తెలంగాణా పరిశ్రమల శాఖ ఆధ్వర్యంలో నిర్వహిస్తున్న ఈ సదస్సు ద్వారా తెలంగాణలో పెట్టుబడులకు ఉన్న అపార అవకాశాలను అంతర్జాతీయ వేదికపై ప్రదర్శించడానికి, రాష్ట్ర ప్రభుత్వ యంత్రాంగం రెడీ అవుతుంది. పెట్టుబడులను ఆకర్షించటం కోసం ఈ సదస్సును అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది. భద్రతా ఏర్పాట్లు, అతిథుల వసతి, రవాణా సౌకర్యాల కల్పన కోసం ప్రత్యేక కమిటీలను ఏర్పాటు చేసి అన్ని ఏర్పాట్లను పకడ్బందీగా పూర్తి చేస్తున్నారు. ఈ సదస్సు విజయవంతం కావడం ద్వారా హైదరాబాద్ కీర్తి ప్రతిష్టలు ప్రపంచవ్యాప్తంగా మరింత ఇనుమడించనున్నాయని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+