ప్రాణాలు తీసుకునే ముందు ఫేస్‌బుక్ లైవ్.. ఆదివాసీ నేత కన్నీటి గాథ!

జార్ఖండ్‌కు చెందిన ప్రముఖ ఆదివాసీ హక్కుల పోరాట నేత నిషా భగత్ తీవ్ర మనస్తాపంతో ఆత్మహత్యకు పాల్పడ్డారు. ఆత్మహత్యం చేసుకునే ముందు ఆమె ఫేస్‌బుక్ లైవ్‌లోకి వచ్చి కన్నీటిపర్యంతమవుతూ ప్రభుత్వం స్థానిక యంత్రాంగం, భూమాఫియాపై తీవ్రస్థాయిలో ఆరోపణలు చేశారు. తను నిరంతరం సమాజ హక్కుల కోసం పోరాడుతున్నప్పటికీ.. తనకు ఎవరూ మద్దతుగా నిలబడలేదని ఆవేదన వ్యక్తం చేశారు.

ఒకే వేదికపై విజయ్, త్రిష, జగన్, కేటీఆర్.. రిసెప్షన్‌‌లో ఆసక్తికర పరిణామం!
ఒకే వేదికపై విజయ్, త్రిష, జగన్, కేటీఆర్.. రిసెప్షన్‌‌లో ఆసక్తికర పరిణామం!

'సమాజం కోసం ఒంటరిగా పోరాడాను'
ఫేస్‌బుక్ లైవ్‌లో నిషా భగత్ మాట్లాడుతూ.. "నన్ను అందరూ ఎంతో ధైర్యవంతురాలైన మహిళ అని అనుకునేవారు. నేను ఎల్లప్పుడూ నా ఆదివాసీ సమాజం, పేదల హక్కుల కోసం నినదించాను. హేమంత్ సోరెన్ ప్రభుత్వంలోని లోపాలను ఎండగట్టడం, అక్రమాలను బయటపెట్టడమే నేను చేసిన తప్పయితే.. దానికి ఈ రోజు నా ప్రాణాలను మూల్యంగా చెల్లించుకుంటున్నాను" అంటూ ఆవేదన వ్యక్తం చేశారు. కొందరు వ్యక్తులు తనను నిరంతరం వేధింపులకు గురిచేస్తూ తీవ్రంగా అవమానించారని, ఆ మానసిక క్షోభను భరించలేకపోతున్నానని వెల్లడించారు.

Tribal Leader Nisha Bhagat Dies by Suicide After Facebook Live Blames Government and Land Mafia

భూమాఫియా, పోలీస్ యంత్రాంగంపై సంచలన ఆరోపణలు
తమ ప్రాంతంలో విచ్చలవిడిగా సాగుతున్న భూకబ్జాలు, భూమాఫియా అక్రమాలపై ఆమె లైవ్‌లో విరుచుకుపడ్డారు. రక్షణ కల్పించాలంటూ పోలీసులను, స్థానిక యంత్రాంగాన్ని పలుమార్లు కోరినప్పటికీ ఎవరూ పట్టించుకోలేదని ఆరోపించారు. ఫేస్‌బుక్ లైవ్‌ సాగుతుండగానే ఆమె పిఠోరియా పోలీస్ స్టేషన్ ఇంఛార్జ్‌కు ఫోన్ చేసి మాట్లాడారు. తమ ఇంట్లో దొంగతన జరిగిన కేసులో ఇప్పటివరకు దొంగలను పట్టుకోలేదని, తనను బద్నాం చేస్తున్న వారిపై చర్యలు తీసుకోలేదని ఆరోపిస్తూ పోలీసుల తీరుపై నిరసన వ్యక్తం చేశారు.

Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!
Scene Movie Review: సరికొత్త అవతారంలో సూర్య.. 'సీన్’ మూవీ రివ్యూ!

తల్లిదండ్రుల ఆవేదనను తలచుకుని కన్నీళ్లు
తన జీవితాన్నంతా ఆదివాసీల సంక్షేమం కోసం కేటాయించానని, కానీ ఏ రాజకీయ పార్టీ కూడా తనకు సరైన మద్దతు ఇవ్వలేదని నిషా భగత్ ఆవేదన వ్యక్తం చేశారు. తన పోరాటాల వల్ల కుటుంబం తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటోందని, కంటికి రెప్పలా పెంచిన తల్లిదండ్రులు సమాజంలో మాటలు పడాల్సి వస్తోందని కన్నీరుమున్నీరయ్యారు. లైవ్ ముగిసిన అనంతరం ఆమె దారుణ నిర్ణయం తీసుకోగా.. కుటుంబ సభ్యులు హుటాహుటిన ఆస్పత్రికి తరలించినప్పటికీ చికిత్స పొందుతూ ప్రాణాలు కోల్పోయారు. ఆదివాసీ నేత ఫేస్‌బుక్ లైవ్‌లో చేసిన కామెంట్స్ జార్ఖండ్ రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతున్నాయి.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+