డీలిమిటేషన్ పై కేంద్రం బిగ్ డెసిషన్ - ఊహించని సమీకరణం, కీలక మలుపు..!!
కేంద్రంలో కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. కేంద్ర మంత్రులతో ప్రధాని మోదీ వరుస సమావేశాలు ఆసక్తిగా మారుతున్నాయి. అటు వర్షాకాల సమావేశాలు పూర్తయినా పార్లమెంట్ ఇంకా ప్రోరోగ్ కాలేదు. త్వరలో జరిగే పలు రాష్ట్రాల అసెంబ్లీ ఎన్నికల పైన ప్రధాన మోదీ టీం ఫోకస్ చేసింది. ఇదే సమయంలో మహిళా రిజర్వేషన్లు - డీలిమిటేషన్ బిల్లు ఆమోదం కోసం కేంద్రం బిగ్ డెసిషన్ తీసుకుంది. కొత్త సమీకరణాలు తెర మీదకు వస్తున్నాయి. జాతీయ రాజకీయా ల్లో ఈ పరిణామాలు కీలక మలుపుగా మారుతున్నాయి.
కేంద్రం మరోసారి నియోజకవర్గాల పునర్విభజన (డీలిమిటేషన్), మహిళా రిజర్వేషన్ల అంశం పైన కీలక మంత్రాంగం సాగిస్తోంది. ఇటీవల ముగిసిన పార్లమెంట్ వర్షాకాల సమావేశాలను ప్రభుత్వం ఇంకా అధికారికంగా ముగించకపోవడం (ప్రోరోగ్ చేయకపోవడం) వెనుక భారీ వ్యూహం కనిపిస్తోంది. నవరాత్రుల సమయంలో ప్రత్యేక పార్లమెంట్ సమావేశాలు ఏర్పాటు చేసి మహిళా రిజర్వేషన్లు.. డీలిమిటేషన్ బిల్లును ఆమోదం పొందేలా కేంద్రం వ్యూహాలు సిద్దం చేస్తోంది. అక్టోబర్ 12వ తేదీ నుంచి 15వ తేదీలోగా ఈ ప్రక్రియ పూర్తి చేయాలని నిర్ణయించినట్లు సమాచారం. అదే సమయం లో సంఖ్యా పరంగానూ జాగ్రత్త పడుతోంది. తృణమూల్ కాంగ్రెస్, శివసేన (యూబీటీ), ఆమ్ ఆద్మీ పార్టీ చీలిక ఎంపీలతో పాటుగా డీఎంకే నుంచి మద్దతు లభిస్తుందని బీజేపీ లెక్కలు వేస్తోంది. అందులో భాగంగా కేంద్ర కేబినెట్ ప్రక్షాళన కు కసరత్తు కొనసాగుతోంది. కేంద్ర కేబినెట్ లో డీఎంకే చేరే అవకాశం ఉందని బీజేపీ వర్గాల్లో పెద్ద ఎత్తున ప్రచారం సాగుతోంది.

అక్టోబర్ రెండో వారంలో ప్రత్యేక సమావేశాలు..!!
అయితే, డీలిమిటేషన్‌పై ప్రభుత్వానికి ఉన్న ప్రణాళిలను ప్రతిపక్షాలతో పంచుకోవాలని, మరో 25 ఏళ్లపాటు లోక్‌సభ సీట్లను పెంచవద్దని కోరుతూ ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే గతంలోనే లేఖ రాశారు. గత ఏప్రిల్‌లో జరిగిన ప్రత్యేక సమావేశాల్లో మూడింట రెండు వంతుల మెజారిటీ రాక వీగిపోయిన డీలిమిటేషన్ బిల్లు, మహిళా రిజర్వేషన్ సవరణ బిల్లులను మళ్లీ ఇదే నెలలో పార్లమెంట్ ముందుకు తెస్తారనే ప్రచారం జరుగుతోంది. నవరాత్రుల వేళ ఈ బిల్లులను ఆమోదం పొందితే ప్రత్యేక గుర్తింపు ఉంటుందని అంచనా వేస్తున్నారు. అందు లో భాగంగా ఇప్పటికే సంకేతాలు ఇస్తున్నారు. మంత్రుల పని తీరుపైనా సమీక్షలు చేసిన ప్రధాని.. తన భవిష్యత్ ఆలోచనలను పంచుకుంటున్నారు. కొందరికి పార్టీ బాధ్యతలు.. ముగ్గురికి గవర్నర్ పదవులు ఇవ్వనున్నట్లు తెలుస్తోంది. దీంతో.. కేంద్రం తాజా వ్యూహాల వేళ.. ఎలాంటి పరిణామాలు చోటు చేసుకుంటాయి.. ఏం జరుగుతుందనే ఉత్కంఠ రాజకీయంగా కొనసాగుతోంది.













Click it and Unblock the Notifications
