గ్రామాల్లో వీధికుక్కల నుండి బిగ్ రిలీఫ్.. కీలకనిర్ణయం తీసుకున్న తెలంగాణా సర్కార్!

తెలంగాణా రాష్ట్రంలో ఏ గ్రామంలో చూసినా వీధి కుక్కల బెడద ఎక్కువగా కనిపిస్తోంది. పెద్దలు, పిల్లలు కుక్కల బెడదకు బయటకు వెళ్ళాలంటే భయపడుతున్నారు. వీధి కుక్కల దాడుల్లో ఆస్పత్రుల పాలవుతున్నారు. కొందరు చిన్నారులు కుక్కల దాడులలో ప్రాణాలు కోల్పోయిన సందర్భాలు కూడా ఉన్నాయి. ఇక తెలంగాణలో వీధి కుక్కల సమస్య పెరుగుతున్న నేపథ్యంలో ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

గ్రామాల్లోనూ కుక్కల సంతాన నియంత్రణ కేంద్రాలు ఏర్పాటు చేయాలని రాష్ట్ర పంచాయతీరాజ్, గ్రామీణాభివృద్ధి శాఖ నిర్ణయించింది. వీబీ జీరాంజీ పథకం కింద ఒక్కో కేంద్రానికి రూ.30 లక్షలు కేటాయించి నిర్మించేందుకు ప్రతిపాదనలు సిద్ధం చేసింది. ఇటీవల జరిగిన రాష్ట్ర జంతు సంక్షేమ మండలి సమావేశంలో ఈ ప్రణాళికను సమర్పించారు. ఈ ప్రణాళిక ప్రకారం వీధి కుక్కలతో తీవ్ర ఇబ్బంది ఉన్న చోట ముందుగా కేంద్రాలు నిర్మిస్తారు.

Telangana stray dogs straydog birth control centres in villages under VB G ramji scheme with rs 30 lakhs each

ఈ ప్లాన్ లో భాగంగా మండలానికి ఒక కేంద్రం చొప్పున ఏర్పాటు చేసి, తర్వాత గ్రామాలకు విస్తరిస్తారు. ప్రస్తుతం హైదరాబాద్, ఇతర నగరాల్లోనే ఇలాంటి కేంద్రాలు ఉన్నాయి. సుప్రీంకోర్టు వీధి కుక్కలను నియంత్రించాలని ఆదేశించిన నేపథ్యంలో, గ్రామాల్లో కూడా దాడులు పెరుగుతున్నందున ఈ నిర్ణయం తీసుకున్నారు. సమస్య ఎక్కువగా ఉన్న గ్రామాలను గుర్తించి పంచాయతీరాజ్ ఇంజినీరింగ్ విభాగం ద్వారా నిర్మాణాలు చేపడతారు.

తర్వాత ఆ కేంద్రాలను పశుసంవర్ధక శాఖకు అప్పగిస్తారు. గ్రామ పంచాయతీ సిబ్బంది కుక్కలను పట్టుకొని తీసుకువస్తే, వైద్యులు స్టెరిలైజేషన్ శస్త్రచికిత్సలు చేసి, రేబీస్ నివారణ టీకాలు వేసి వదిలేస్తారు.స్వచ్ఛంద సంస్థలు ముందుకొస్తే నగరాల్లో శస్త్రచికిత్సకు రూ.1,500, గ్రామాల్లో రూ.1,650 చొప్పున చెల్లించేందుకు శాఖ అనుమతించింది.

యూట్యూబర్ వైష్ణవి నుండి హరిబాబు హత్యదాకా.. రీల్స్ క్రైం కథాచిత్రం... సొసైటీకి పెను ప్రమాదం!
యూట్యూబర్ వైష్ణవి నుండి హరిబాబు హత్యదాకా.. రీల్స్ క్రైం కథాచిత్రం... సొసైటీకి పెను ప్రమాదం!

ఈ చర్యల ద్వారా వీధి కుక్కల సంఖ్యను నియంత్రించి, ప్రజలకు భయం లేకుండా చేయాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇది అమలైతే, గ్రామాలలో కుక్కల కుటుంబ నియంత్రణా కేంద్రాలు ఏర్పాటు చేస్తే పెద్దలు, పిల్లలు నిరభ్యంతరంగా బయటకు వెళ్ళొచ్చు, ఏ ఒక్కరి ప్రాణం కుక్కల కారణంగా పోకుండా ఉంటుంది. ప్రస్తుతం ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయంతో గ్రామాల ప్రజలలో సంతోషం వ్యక్తం అవుతుంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+