Bitcoin దూసుకుపోయింది.. 24 గంటల్లో భారీ లాభాలు

గత కొన్ని రోజులుగా ఒడిదుడుకులను ఎదుర్కొన్న అంతర్జాతీయ క్రిప్టోకరెన్సీ మార్కెట్ ఒక్కసారిగా ఊపందుకుంది. ప్రపంచంలోనే అత్యంత ప్రజాదరణ పొందిన 'బిట్‌కాయిన్' (Bitcoin) ఏకంగా $85,000 (భారత కరెన్సీలో రూ. 70 లక్షలకు పైగా) మార్కును దాటి దూసుకెళ్లింది. కేవలం 24 గంటల వ్యవధిలోనే 5.71 శాతం లాభాన్ని నమోదు చేసి ట్రేడర్లలో నూతనోత్సాహాన్ని నింపింది.

బిట్‌కాయిన్ మాత్రమే కాకుండా ఇతర ఆల్ట్‌కాయిన్లు, మీమ్ కాయిన్లు కూడా భారీ లాభాలను నమోదు చేశాయి. ఎథిరియం (5.61%), సోలానా (7.73%), కార్డానో (9.32%) పెరగగా.. ఎలాన్ మస్క్ మద్దతున్న 'డాజ్‌కాయిన్' ఏకంగా 10.15 శాతానికి పైగా ఎగబాకింది.

అమెరికా విధానాలపై స్పష్టత.. మార్కెట్లో మారిన గాలి!

బిట్‌కాయిన్ ఈ స్థాయిలో పుంజుకోవడానికి ప్రధానంగా మూడు కారణాలు కనిపిస్తున్నాయి. గత కొన్ని వారాలుగా 'క్లారిటీ యాక్ట్' (CLARITY Act) పై నెలకొన్న అనిశ్చితి, అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్ల పెంపుదల అంశాలపై మార్కెట్‌లో తీవ్ర ఆందోళన ఉండేది. అయితే ఫెడ్ రిజర్వ్ తీసుకున్న నిర్ణయాన్ని మార్కెట్ ముందుగానే అంచనా వేయడం, నియంత్రణల పై ఉన్న ఆందోళనలు కాస్త తగ్గడంతో ఇన్వెస్టర్లు తిరిగి కొనుగోళ్లకు మొగ్గు చూపారు. వడ్డీ రేట్ల సవరణ ముగియడంతో మళ్లీ క్రిప్టో మార్కెట్‌లోకి పెట్టుబడుల వెల్లువ ప్రారంభమైంది.

Global Crypto Market Rally Bitcoin Surges Past 85000 USD as Dogecoin and Altcoins Register Huge Gains
Bitcoin సృష్టికర్త ఇతడే! చిన్న 'హైఫన్'తో దొరికిపోయాడే..
Bitcoin సృష్టికర్త ఇతడే! చిన్న 'హైఫన్'తో దొరికిపోయాడే..

ఈటీఎఫ్ ఫండ్స్ జోరు.. షార్ట్ పొజిషన్ల క్లోజింగ్!

రెండో కారణం.. యూఎస్ స్పాట్ బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌ల (ETFs) లోకి మళ్లీ భారీగా వస్తున్న పెట్టుబడులు. గురు, శుక్రవారాల్లోనే దాదాపు 593 మిలియన్ డాలర్ల అదనపు నిధులు బిట్‌కాయిన్ ఈటీఎఫ్‌లలోకి వచ్చినట్లు మార్కెట్ నిపుణులు వెల్లడించారు. ఇదే సమయంలో మార్కెట్ పడిపోతుందని అంచనా వేసి 'షార్ట్ పొజిషన్లు' పెట్టిన ట్రేడర్లు ఏకంగా 445 మిలియన్ డాలర్ల ట్రేడింగ్‌ను క్లోజ్ చేయాల్సి వచ్చింది. దీనివల్ల మార్కెట్‌లో కొనుగోళ్ల ఒత్తిడి ఒక్కసారిగా పెరిగి ధరలు రాకెట్‌లా పైకి లేచాయి.

100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్‌.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!
100 ఏళ్ల రికార్డును తుడిచేస్తున్న గోల్డ్ క్రాష్‌.. బిట్‌కాయిన్ జేత్రయాత్ర!

ఇన్వెస్టర్లు జాగ్రత్త వహించాల్సిందేనా?

ప్రస్తుతం బిట్‌కాయిన్ $85,000 మార్కును దాటడం మార్కెట్ రికవరీకి మంచి సంకేతమే అయినప్పటికీ, సామాన్య ఇన్వెస్టర్లు ఎంతో అప్రమత్తంగా ఉండాలని నిపుణులు సూచిస్తున్నారు. కేవలం ధరలు వేగంగా పెరుగుతున్నాయని చూసి తొందరపడి పెట్టుబడులు పెట్టకూడదని, సరైన స్టాప్ లాస్ (Stop-loss) పరిమితులు విధించుకుని క్రమశిక్షణతో కూడిన వ్యూహాలను పాటించాలని హెచ్చరిస్తున్నారు. మళ్లీ ఏవైనా ప్రతికూల అంతర్జాతీయ పరిణామాలు ఎదురైతే మార్కెట్ హెచ్చుతగ్గులకు లోనయ్యే అవకాశం ఉన్నందున జాగ్రత్త అవసరం.

(Disclaimer: ఈ వెబ్‌సైట్‌లోని అభిప్రాయాలు, సూచనలు పూర్తిగా వ్యక్తిగత విశ్లేషకులు లేదా ఇతర సంస్థలవి మాత్రమే. ఇవి Oneindia అధికారిక అభిప్రాయాలు కాదని గమనించగలరు. మేము ఈ విషయం యొక్క ఖచ్చితత్వం, సమగ్రత లేదా విశ్వసనీయతపై ఎటువంటి హామీ ఇవ్వడం కాని, అనుమతించడం కాని బాధ్యత వహించడం జరగదు. మేము ఎలాంటి పెట్టుబడి సలహా ఇవ్వము. అలాగే ఎటువంటి సెక్యూరిటీ కొనుగోలు లేదా అమ్మకాలు ప్రోత్సహించము. ఈ వెబ్‌సైట్‌లోని కథనం పూర్తిగా సమాచారం కోసమే అందించబడుతుంది. మీరు ఏదైనా పెట్టుబడి నిర్ణయం తీసుకునే ముందు, లైసెన్స్ పొందిన ఆర్థిక సలహాదారుల సహాయం తీసుకోండి. ఈ కథనాన్ని కేవలం సమాచారంగా మాత్రమే పరిగణించండి.)

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+