ఏం రామ్మోహన్-ఇవన్నీ చూసుకోవాలిగా..! పవార్ ఘటన వేళ సాయిరెడ్డి..!
నిన్న మహారాష్ట్రలోని బారామతి ఎయిర్ పోర్టులో విమానం కుప్పకూలిన ఘటనలో డిప్యూటీ సీఎం అజిత్ పవార్ తో పాటు మరో నలుగురు దుర్మరణం పాలయ్యారు. ఈ నేపథ్యంలో దేశంలో విమానాల భద్రత మరోసారి చర్చనీయాంశమైంది. గతేడాది అహ్మదాబాద్ లో ఎయిర్ ఇండియా విమాన ప్రమాదం మర్చిపోకముందే బారామతి విమాన ప్రమాదం జరగడంతో ప్రయాణికులు విమానాలు ఎక్కాలంటే భయపడుతున్నారు. ఈ నేపథ్యంలో కేంద్రంలో విమానయానమంత్రిగా ఉన్న రామ్మోహన్ నాయుడు పాత్రపైనా విమర్శలు వస్తున్నాయి.
అజిత్ పవార్ విమాన ఘటన తర్వాత పౌర విమానయానశాఖ ఇప్పటివరకూ భవిష్యత్తులో విమానాల భద్రతపై ఎలాంటి చర్యలూ ప్రకటించలేదు. దీంతో దేశంలో 2047 నాటికి 400 ఎయిర్ పోర్టులు కడతామంటూ టార్గెట్లు పెడుతున్న విమానయానమంత్రి రామ్మోహన్ నాయుడిని లక్ష్యంగా చేసుకుని వైసీపీ మాజీ ఎంపీ విజయసాయిరెడ్డి (vijayasai reddy) ఇవాళ ఓ ట్వీట్ చేశారు. దేశంలో విమానాల రద్దీ పెరుగుతున్న నేపథ్యంలో భద్రతను కూడా చూసుకోవాలిగా అనే అర్దం వచ్చేలా సాయిరెడ్డి ఇవాళ ఈ ట్వీట్ చేశారు.

As India’s domestic air traffic grows 10–12% annually and we head towards 400 airports by 2047, Air-Traffic Safety must keep pace. Modernise DGCA, strengthen ATC staffing/tech, and cut risks such as maintenance lapses. Passenger trust is slipping after recent incidents.…
— Vijayasai Reddy V (@VSReddy_MP) January 29, 2026
భారతదేశ దేశీయ విమాన ట్రాఫిక్ ఏటా 10-12% పెరుగుతోందని, 2047 నాటికి మనం 400 విమానాశ్రయాల దిశగా వెళుతున్నందున, ఎయిర్-ట్రాఫిక్ భద్రత వేగాన్ని కొనసాగించాలని విజయసాయిరెడ్డి సూచించారు. డీజీసీఏని ఆధునీకరించాలని, ఏటీసీ సిబ్బంది/సాంకేతికతను బలోపేతం చేయాలని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడిని కోరారు. అలాగే నిర్వహణ లోపాలు వంటి ప్రమాదాలను తగ్గించాలని కూడా కోరారు. ఇటీవలి సంఘటనల తర్వాత ప్రయాణీకుల నమ్మకం సన్నగిల్లుతోందని ఆయన మంత్రి దృష్టికి తెచ్చారు. కాబట్టి ఈ వ్యవహారంలో వ్యక్తిగతంగా జోక్యం చేసుకోవాలని కోరారు.
-
వంట గ్యాస్ ఇక బుక్ చేయాలంటే, ఇలా తప్పనిసరి - తాజా మార్గదర్శకాలు..!! -
రామ్‌చరణ్ నా ప్రాణం కంటే ఎక్కువ: అల్లు అర్జున్ -
సప్తగిరి ఎక్స్‌ప్రెస్, చర్లపల్లి సూపర్ ఫాస్ట్ రైళ్లకు ఇకపై -
ఉత్తర తెలంగాణా అభివృద్ధిలో గేమ్ ఛేంజర్ ఆ ఎయిర్పోర్ట్.. కేంద్రం మరో కీలక అడుగు! -
20 ఏళ్ల తేడా ఉన్న ఆ చిన్నదే ఎందుకు? ఒక్క సీన్‌తో ఛాన్స్ కొట్టేసింది! -
తండ్రి, తనయుడి స్థానాలు ఇవే- డీఎంకే తొలి జాబితా -
జన్మ నక్షత్రం పునర్వసు, పుష్యమి, ఆశ్లేష ఉన్నవారి ఏప్రిల్ నెల జాతక ఫలం -
H-1B Visa: హెచ్1బీ లాటరీ నోటీసుల విడుదల-స్టేటస్ ఇలా చెక్ చేసుకోండి..! -
రాజమండ్రి- కాకినాడ పోర్ట్ రైలు ప్రయాణికులకు ముఖ్య గమనిక -
ఏప్రిల్ లో బ్యాంకులకు వరుస హాలిడేస్ - స్కూళ్లకు వేసవి సెలవులపై తాజా ఉత్తర్వులు..!! -
ఇరాన్‌కు రోజుకు రూ. 1,319 కోట్ల ఆదాయం.. అమెరికా అంతమే లక్ష్యంగా..!! -
బంగారం ధరలు తలకిందులు












Click it and Unblock the Notifications