ఒక్క రోజు కూడా స్కూల్ కు వెళ్లలేదు.. కానీ విద్యాశాఖ మంత్రిగా.. షాకింగ్ విషయాలు తెలుసా..?

లైఫ్ లో ఒక్క రోజు కూడా స్కూల్ కు, కాలేజీకు వెళ్లలేదు. కానీ దేశ విద్యా వ్యవస్థనే పూర్తిగా మార్చేశారు. ఇది ఆశ్చర్యకరంగా ఉన్నా నిజం. భారత తొలి విద్యాశాఖ మంత్రి మౌలానా అబుల్ కలాం ఆజాద్.. ఎప్పుడూ పాఠశాలకు వెళ్లలేదు. కానీ తన పదవీకాలంలో ఆధునిక విద్యా వ్యవస్థలో అనేక మార్పులు తీసుకొచ్చారు. ఐఐటీలు, యూజీసీ, టెక్నికల్ ఎడ్యూకేషన్ విభాగాల్లో అనేక సంస్థలకు శంకుస్థాపన చేశారు. భారత విద్యా వ్యవస్థ మార్పులో ఆయన పాత్ర కీలకమైనదిగా భావించవచ్చు.

థియేటర్ లో ఈ లవ్ స్టోరీ మిస్ అయ్యారా..? OTT లో మాత్రం మిస్ అవ్వొద్దు..
థియేటర్ లో ఈ లవ్ స్టోరీ మిస్ అయ్యారా..? OTT లో మాత్రం మిస్ అవ్వొద్దు..

మౌలానా అబుల్ కలాం ఆజాద్ 1888 లో సౌదీ అరేబియాలోని మక్కా లో జన్మించారు. అతని తండ్రి మౌలానా ఖైరుద్దీన్.. పాశ్చాత్య విద్యపై నమ్మకం లేకపోవడంతో మౌలానా అబుల్ కలాం ఆజాద్ ను ఎప్పుడూ స్కూల్ కు గానీ మదర్సాకు గానీ పంపించలేదు. కానీ ఆజాద్ కు తన తండ్రి, ఇతర స్కాలర్లు ఇంటి వద్ద నుంచే విద్యను అందించారు. 12 ఏళ్లు వచ్చేసరికి బేసిక్ ఎడ్యూకేషన్ పూర్తి చేశారు. ఆ తర్వాత పుస్తకాలు, న్యూస్ పేపర్లు చదివి ఇంగ్లీష్, సైన్స్, హిస్టరీ, ఫిలాసఫీ నేర్చుకున్నారు.

ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?
ప్రధాని మోదీ పాకిస్తాన్ వెళ్తారా: షెహబాజ్ షరీఫ్ నుంచి ఆహ్వానం- లైన్ క్లియర్?

ఆజాద్ కు చిన్న వయసు నుంచే అచంచలమైన మేధోసంపత్తి ఉంది. 15 ఏళ్లకే పోయట్రీ రాయడాన్ని మొదలు పెట్టారు. అలా 1912 లో ఐల్- హిలాల్ అనే పత్రికను ప్రారంభించారు. బ్రిటిష్ రూల్ పై ఆయన వ్యాసాలు రాశారు. ఆ తర్వాత స్వాతంత్య్రోద్యమంలో చేరారు. మహాత్మాగాంధీకి సన్నిహితులుగా మెలిగారు. అలా ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ కు అధ్యక్షుడుగా నియమితులయ్యారు. ఇక ఇండిపెండెన్స్ తర్వాత 1947 లో అప్పటి ప్రధాని నెహ్రూ.. మౌలానా ఆజాద్ ను విద్యాశాఖ మంత్రిగా నియమించారు.

Maulana Abul Kalam Azad first Education Minister found IITs UGC not attended school a single day

అలా ఐఐటీ ఖరగ్ పూర్, యూనివర్సిటీ గ్రాంట్స్ కమిషన్, తదితర సంస్థలను నెలకొల్పడంలో కీలక పాత్ర పోషించారు. ఉచిత, నిర్భంద విద్యకు హామీ ఇచ్చారు. అలాగే టెక్నికల్ ఎడ్యూకేషన్, టీచర్ ట్రైనింగ్, మహిళా విద్య, అడల్ట్ లిటరసీ, స్కాలర్ షిప్స్ తదితర విభాగాల్లో కృషి చేశారు. ఇటీవల కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేసి ఆయన స్థానంలో ప్రహ్లాద్ జోషీ నియామకం కావడంతో దేశంలోని విద్యా వ్యవస్థపై చర్చ జరుగుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+