Karmakhya Movie Review: ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని మెప్పించిందా..?
సాధారణంగా మలయాళం సినిమాల్లో క్రైమ్, థ్రిల్లింగ్ అంశాలు ఎక్కువగా ఉంటాయి. మలయాళంలో హార్రర్ సినిమాలను చూసేందుకు తెలుగు ప్రేక్షకులు కూడా ఆసక్తి చూపిస్తుంటారు. ఇప్పుడు తెలుగులోనూ ఇలాంటి సినిమాలే అధికంగా వస్తున్నాయి. ఇటీవల వచ్చిన శంభాల మూవీ బాక్సాఫీస్ వద్ద సూపర్ హిట్ గా నిలిచింది. క్రైమ్ థ్రిల్లర్, హార్రర్ సినిమాలను చూసేందుకు ప్రేక్షకులు ఎగబడుతున్నారు. అయితే తాజాగా తెలుగులో రిలీజ్ అయిన మరో థ్రిల్లర్ మూవీ 'కర్మాఖ్య' .. ఈ మూవీ జూలై 31 న గ్రాండ్ గా రిలీజ్ అయింది.
కామాఖ్య దేవి నేపథ్యం, మూఢనమ్మకాలు, సస్పెన్స్, క్రైమ్, ఎమోషన్స్‌ను మిళితం చేస్తూ ఈ మూవీ తెరకెక్కింది. ఈ సినిమాకు జబర్దస్త్ షో తో పాపులర్ అయిన అదిరే అభి దర్శకత్వం వహించారు. ఆయన తొలి సినిమా చిరంజీవ కాగా రెండో సినిమా ఇదే కావడం విశేషం. కర్మాఖ్య మూవీలో సముద్రఖని, అభిరామి, శరణ్య ప్రదీప్, సమైరా, మధునందన్, ధన్ రాజ్, రాకెట్ రాఘవ, గడ్డం నవీన్ తదితరులు కీలక పాత్రలు పోషించారు. ఈ చిత్రానికి నిర్మాతగా వడ్డెపల్లి శ్రీవాణి నాథ్ వ్యవహరించారు. అలాగే సంగీతం గ్యానీ, సినిమాటోగ్రఫీ బాధ్యతలు కుషేందర్ రమేష్ రెడ్డి అలాగే ఎడిటింగ్ బాధ్యతల్ని శ్రీ వరప్రసాద్ నిర్వర్తించారు.
కర్మాఖ్య మూవీ స్టోరీ విషయానికి వస్తే కామాఖ్య (సమైరా), ప్రవల్లిక (శరణ్య ప్రదీప్) ఇద్దరూ ఫ్రెండ్స్. ఒకరి కష్టసుఖాల్ని మరొకరు పంచుకుంటూ ఉంటారు. అయితే ప్రవల్లిక ఒక ఇన్సూరెన్స్ కంపెనీలో పనిచేస్తుంటుంది. ఒక కీలక పాలసీ హోల్డర్ ఇంటికి ఆమె వెళ్లాల్సిన సమయంలో అనుకోని కారణాలతో కామాఖ్య వెళ్లాల్సి వస్తుంది. అలా విశాఖపట్నం సమీపంలోని నవోదయ కాలనీలో ఉన్న ఓ పాలసీదారుడి ఇంటికి వెళుతుంది. నిర్మానుష్యమైన ప్రదేశంలో ఉన్న ఆ ఇంట్లోకి అడుగు పెట్టినప్పటి నుంచి అనూహ్యమైన పరిణామాలు చోటు చేసుకుంటాయి.
అలా అనుకోకుండా ఇంట్లోకి ప్రవేశించిన కర్మాఖ్య.. బయటకు రావడానికి ప్రయత్నించినా ప్రతిసారీ ఆమెకు కొత్త అడ్డంకులు ఎదురవుతుంటాయి. తిరిగి రాలేని పరిస్థితులు ఏర్పడతాయి. ఇంతలో ఆ ఇంట్లో చాలాకాలంగా దాచిపెట్టిన ఒక శవం ఉన్న విషయం బయటపడుతుంది. దాంతో కథ పూర్తిగా మలుపు తిరుగుతుంది. ఇక అసలు ప్రవల్లిక స్థానంలో కామాఖ్య ఎందుకు వెళ్లాల్సి వచ్చింది..? ఆ ఇంట్లో ఉన్న ఫ్యామిలీ ఎందుకు విచిత్రంగా ప్రవర్తిస్తుంది..? కామాఖ్య ఆ ఇంటి నుంచి బయటికొచ్చిందా..? ఆమెకు ఆ పేరు ఎలా వచ్చింది..? ఇలాంటి ఆసక్తికర కథనంతో సినిమా సాగుతుంది.

ఇక ఫైనల్ గా కర్మాఖ్య మూవీ ఒక మంచి కాన్సెప్ట్ తో వచ్చిన మిస్టరీ థ్రిల్లర్ అని చెప్పొచ్చు. మూఢనమ్మకాలపై దర్శకుడు చెప్పాలనుకున్న సందేశం ప్రశంసనీయమే.. కానీ కథనం మరింత ఆసక్తికరంగా, భావోద్వేగాలు మరింత బలంగా ఉండి ఉంటే సినిమా మరో స్థాయికి వెళ్లేదని టాక్ వినిపిస్తోంది.












Click it and Unblock the Notifications