బాబులకే బాబు.. స్పైడర్ బాబు.. బాక్సాఫీస్ వద్ద ఊచకోత

సూపర్ హీరో సినిమాలంటే అందరికీ 'స్పైడర్ మ్యాన్' ఫస్ట్ గుర్తుకొస్తారు. సూపర్ హీరో పాత్రకు అంతటి క్రేజ్ తీసుకొచ్చిన క్యారెక్టర్ 'స్పైడర్ మ్యాన్' సాధారణంగా స్పైడర్ మ్యాన్ అనగానే హాలీవుడ్ లో విపరీతమైన క్రేజ్ ఉంటుంది. విదేశాల్లో ఈ మూవీకి క్యూ కడతారు. ఇది తెలిసిన సంగతే కానీ భారత్ లోనూ ఈ మూవీ ప్రేక్షకుల్ని విశేషంగా ఆకట్టుకుంటోంది. భారత్ లోని సినీ అభిమానులు ఈ మూవీకి బ్రహ్మరథం పడుతున్నారు. ఏ,బీ,సీ సెంటర్లు అని తేడా లేకుండా స్పైడర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీని ఆకాశానికి ఎత్తేస్తున్నారు.

Karmakhya Movie Review: ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని మెప్పించిందా..?
Karmakhya Movie Review: ఈ మిస్టరీ థ్రిల్లర్ ప్రేక్షకుల్ని మెప్పించిందా..?

ప్రపంచవ్యాప్తంగా జూలై 30 న విడుదలైన ఈ మూవీ కేవలం భారత్ లో ఒక్క రోజే రూ. 61 కోట్లు వసూలు చేసి సంచలనం సృష్టించింది. ఇండియన్ బాక్సాఫీస్ వ‌ద్ద‌ ఈ రేంజ్ విధ్వంసం మరే హాలీవుడ్ సినిమాకూ జరగలేదు. భారత్ లో ఇప్పటివరకూ అవెంజర్స్: ఎండ్‌ గేమ్ (రూ.53.10 కోట్లు) పేరిట ఉన్న ఫస్ట్ డే కలెక్షన్స్ రికార్డ్‌ ను ఈ సినిమా బద్దలు కొట్టింది. అలా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఆల్ టైమ్ నెంబర్ వన్ స్థానాన్ని సొంతం చేసుకుంది.

స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీ ఇండియాలో మొత్తం అన్ని వెర్షన్స్ ను కలిపి 5,000 పైగా స్క్రీన్స్ లో విడుదలైంది. తొలిరోజే ఇంతటి భారీ వసూళ్లు రాబట్టిన ఈ చిత్రం.. లాంగ్ వీకెండ్ ముగిసేసరికి సుమారు రూ.200 కోట్ల వరకు కలెక్షన్లను సాధించే అవకాశం ఉందని ట్రేడ్ పండితులు అంచనా వేస్తున్నారు. ఇక తెలుగు రాష్ట్రాల్లోనూ స్పైడర్ మ్యాన్ మూవీ హవా కొనసాగిస్తోంది. నైజాం, ఆంధ్రా వ్యాప్తంగా తొలిరోజే ఈ సినిమా రూ. 9 కోట్ల గ్రాస్ రాబట్టి ట్రేడ్ వర్గాలను ఆశ్చర్యపరిచింది.

థియేటర్ లో ఈ లవ్ స్టోరీ మిస్ అయ్యారా..? OTT లో మాత్రం మిస్ అవ్వొద్దు..
థియేటర్ లో ఈ లవ్ స్టోరీ మిస్ అయ్యారా..? OTT లో మాత్రం మిస్ అవ్వొద్దు..

ప్రపంచవ్యాప్తంగా స్పైడర్-మ్యాన్: బ్రాండ్ న్యూ డే మూవీకి ప్రేక్షకులు బ్రహ్మరథం పడుతున్నారు. నార్త్ అమెరికా అయితే కలెక్షన్ల సునామీ సృష్టిస్తోంది. కేవలం ప్రీవ్యూ షోల ద్వారానే 70 నుంచి 75 మిలియన్ డాలర్లు రాబట్టే దిశగా దూసుకెళ్తోంది.

SpiderMan Brand New Day rakes in massive collections in India whopping 61 crore on very first day

ఈ మూవీలో హాలీవుడ్ స్టార్స్ టామ్ హాలాండ్, జెండాయా జాకబ్ బాటాలాన్, సాదీ సింక్, జాన్ బెర్నథాల్ పలువురు కీలక పాత్రల్లో నటించారు. ఈ మూవీకి డెస్టిన్ డేనియల్ క్రెటన్ దర్శకత్వం వహించారు. ఈ సినిమాను మార్వెల్ స్టూడియోస్, సోనీ పిక్చర్స్, పాస్కల్ పిక్చర్స్ బ్యానర్స్ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించాయి. 2021లో వచ్చిన స్పైడర్ మ్యాన్ నో వే హోమ్ సినిమాకు కొనసాగింపుగా స్పైడ‌ర్ మ్యాన్ బ్రాండ్ న్యూ డే మూవీ తెరకెక్కింది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+