Samudra Manthan: సముద్రంలో వేట మొదలు- 84 వేల కోట్ల ప్రాజెక్టు-కేబినెట్ నిర్ణయం..!

ఈ ఏడాది అమెరికా-ఇరాన్ వార్ నేపథ్యంలో దేశంలో చమురు, గ్యాస్ కు తీవ్ర కొరత ఏర్పడింది. ముఖ్యంగా హార్ముజ్ జలసంధి నుంచి భారత్ కు రావాల్సిన నౌకలు ఆగిపోవడం, దేశంలో చమురు నిల్వలు తగ్గిపోవడం వంటి కారణాల నేపథ్యంలో కేంద్రం ఇకపై చమురు, గ్యాస్ రంగాల్లో స్వయం సమృద్ది కోసం ప్రయత్నాలు వేగవంతం చేయాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా ఇవాళ కేంద్ర కేబినెట్ దాదాపు 84 వేల కోట్లతో సముద్ర మంథన్ (Samudra manthan) ప్రాజెక్టును ప్రకటించింది.

కేబినెట్ భేటీ అనంతరం కేంద్ర మంత్రి అశ్విని వైష్ణవ్ ఈ ప్రాజెక్టుకు సంబంధించిన వివరాలను వెల్లడించారు. 'సముద్ర మంథన్' అనే ఒక కీలక కార్యక్రమానికి ఈరోజు ఆమోదం లభించిందని, దేశంలో చమురు, గ్యాస్ ఉత్పత్తి కోసం అన్వేషణ చేపట్టడమే దీని లక్ష్యమని ఆయన తెలిపారు. దీనికోసం రూ. 84 వేల కోట్ల బడ్జెట్‌ను కేటాయించినట్లు వెల్లడించారు. ఇందులో రెండు ప్రధాన విభాగాలు ఉన్నాయిని, మొదటిది రూ.28 వేల కోట్లతో ఆఫ్‌షోర్ సీస్మిక్ డేటా సేకరణ.

Samudra Manthan Cleared Centre Unveils 84 000-Crore Plan To Accelerate Oil And Gas Exploration

అంటే చమురు, గ్యాస్ నిక్షేపాలకు అత్యధిక అవకాశం ఉన్న ప్రాంతాల నుండి సేకరించిన డేటా ఆధారంగా, కచ్చితమైన అన్వేషణ ప్రణాళికను రూపొందించడానికి సీస్మిక్ టెక్నాలజీని ఉపయోగించడం. అన్వేషణ ప్రణాళిక సిద్ధమైన తర్వాత, ఉత్పత్తి కార్యకలాపాలను మరింత శాస్త్రీయ పద్ధతిలో ప్రారంభించవచ్చని తెలిపారు. రెండవ ప్రధాన విభాగం రూ.43 వేల కోట్లతో వేగవంతమైన ఆఫ్‌షోర్ అన్వేషణ పథకం అని పేర్కొన్నారు. సముద్ర మంథన్ లో భాగంగా కేంద్రం ఈ రెండు కార్యక్రమాలను చేపట్టబోతోంది. దేశంలో పెరుగుతున్న చమురు, గ్యాస్ డిమాండ్‌కు ఇది ఒక పెద్ద గేమ్-ఛేంజర్‌ కానుందని, దీనివల్ల విదేశీ మారక ద్రవ్యం గణనీయంగా ఆదా అవుతుందని అశ్వినీ వైష్ణవ్ తెలిపారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+