బాలయ్య- కొరటాల శివ మూవీపై క్రేజీ అప్‌డేట్.. ఫ్యాన్ కు డబుల్ ధమాకా

ప్రస్తుతం టాలీవుడ్ లో ఉన్న క్రేజీ ప్రాజెక్ట్స్ లో బాలయ్య- కొరటాల శివ మూవీ ఒకటి. ఎన్టీఆర్ తో 'దేవర' లాంటి బ్లాక్ బస్టర్ సినిమా తర్వాత కొరటాల శివ.. అలాగే 'అఖండ 2' లాంటి భారీ చిత్రం తర్వాత బాలయ్య కలిసి చేస్తున్న మూవీ కావడంతో అంచనాలు భారీగా ఉన్నాయి. ప్రస్తుతం ఈ మూవీ షూటింగ్ శరవేగంగా సాగుతోంది. కొరటాల శివ మార్క్ రాజకీయ అంశాలు, బలమైన కుటుంబ భావోద్వేగాల మేళవింపుతో ఈ కథ రూపొందుతోంది. అయితే ఈ ప్రాజెక్ట్ కు సంబంధించి ఓ క్రేజీ న్యూస్ ప్రస్తుతం సామాజిక మాధ్యమాల్లో వైరల్ అవుతోంది. ఈ సినిమాలో బాలయ్య తండ్రి, కొడుకులుగా రెండు వేర్వేరు పాత్రల్లో కనిపించబోతున్నారని సమాచారం. అయితే దీనిపై చిత్ర యూనిట్ నుంచి ఎలాంటి అధికారిక ప్రకటన రాలేదు. కానీ ఈ క్రేజీ రూమర్ నందమూరి అభిమానుల్లో భారీ అంచనాలను పెంచేస్తోంది. ఇక ఈ క్రేజీ ప్రాజెక్ట్ ఫస్ట్ షెడ్యూల్ డిసెంబర్ మొదటి వారం నుండి ప్రారంభం కానుంది. ప్రస్తుతం చిత్ర యూనిట్ మిగతా సన్నివేశాలను పూర్తి చేస్తున్నట్లు సమాచారం.

ఇక ప్రస్తుతం బాలయ్య గాయం నుంచి కోలుకుంటున్నారు. జూలైలో దాదా షూటింగ్ లో కాకినాడలో ఆయన కాలికి గాయం అయింది. ఓ భారీ యాక్షన్ సీక్వెన్స్ ను తీస్తున్న క్రమంలో ఈ ప్రమాదం జరిగింది. ఆ తర్వాత ఆయనకు విజయవంతంగా సర్జరీ అయింది. ప్రస్తుతం పూర్తిగా కోలుకున్న ఆయన అక్టోబర్ నుంచి గోపీచంద్ మలినేనితో తీస్తున్న దాదా చిత్రం షూటింగ్ లో పాల్గొననున్నారు. ఆ తర్వాత డిసెంబర్ నుంచి కొరటాల శివ సినిమాలో రెగ్యులర్ షెడ్యూల్ చేయనున్నారు. ఇక కొరటాల శివ- బాలయ్య కాంబోలో సినిమా కేవలం కమర్షియల్ ఎలిమెంట్స్ మాత్రమే కాకుండా.. బలమైన ఫ్యామిలీ ఎమోషన్స్, పవర్‌ఫుల్ రాజకీయ అంశాలను ప్రధానంగా ప్రస్తావిస్తూ కొరటాల శివ విలక్షణమైన స్టోరీని సిద్ధం చేసినట్లు సమాచారం అందుతోంది. ఇక టాలెంటెడ్ ప్రొడ్యూసర్ సుధాకర్ చెరుకూరి అత్యంత భారీ బడ్జెట్‌తో నిర్మిస్తున్న ఈ చిత్రం బాక్సాఫీస్ వద్ద ఎలాంటి ప్రకంపనలు సృష్టిస్తుందో చూడాలి.

Balayya Koratala Siva movie viral Balayya will appear in two distinct roles as both father and son

మరోవైపు గోపీచంద్ మలినేని- బాలయ్య కాంబోలో వస్తున్న దాదా మూవీ ఈ ఏడాది డిసెంబర్ చివరి వారంలో ప్రేక్షకుల ముందుకు రానుంది. గతంలో వీరిద్దరి కాంబోలో వచ్చిన వీరసింహారెడ్డి మూవీ బాక్సాఫీస్ వద్ద బ్లాక్ బస్టర్ విజయాన్ని నమోదు చేసుకున్న సంగతి తెలిసిందే. అయితే దాదా మూవీ పూర్తిగా మాఫియా బ్యాక్ డ్రాప్ లో తెరకెక్కుతున్నట్లు స్పష్టం అవుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+