విజ‌య్‌ ఫిట్‌నెస్ మంత్ర- డైట్ ప్లాన్.. రోజు వారీ షెడ్యూల్ ఇలా..!!

తమిళనాడు సీఎం విజయ్ ఫిట్ గా చురుగ్గా కనిపిస్తారు. అటు సినిమాల్లో విరామం లేకుండా నటించి.. ఇప్పుడు సీఎం గా ప్రతీ నిమిషం బిజీగా ఉండే విజయ్ ఫిట్ నెస్ సీక్రేట్స్ పైన ఎంతో ఆసక్తి ఉంటుంది. 52ఏళ్ల వయసులోనూ విజయ్ చురుకుగా కనిపిస్తారు. విజయ్ తన ఆరోగ్యం కోసం ఆహార విషయాల్లో కఠినంగా ఉంటారు. క్రమమైన వ్యాయామం.. సింపుల్ జీవన విధానం తో విజయ్ ఫిట్‌నెస్ మంత్ర. సీఎం విజయ్ రోజు వారీ షెడ్యూల్ ఆసక్తి కరమే.

తమిళనాడు సీఎం విజయ్ ఫిట్‌గా ఉండ‌టానికి గల కారణాలను ఆయన ఫిట్‌నెస్ ట్రెయిన‌ర్ నరేశ్ కుమార్ వెల్లడించారు. విజయ్ సాధారణ ఇంటి భోజనం, క్రమమైన వ్యాయామంతోనే తన ఆరోగ్యాన్ని కాపాడుకుంటున్నారని ఆయన వివరించారు. ఈ సింపుల్ విధానమే విజ‌య్‌ ఫిట్‌నెస్ మంత్రమ‌ని స్పష్టంచేశారు. విజయ్ ఉదయం 5:30 నుంచి 6 గంటల మధ్య నిద్రలేస్తారని, ఉదయం 9 గంటల సమయంలో అల్పాహారంగా రెండు ఇడ్లీలతోపాటు గుడ్లు తీసుకుంటారని వెల్లడించారు.

సీఎం విజయ్ ప్రోగ్రామ్ లల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్: స్పృహతప్పిన మహిళలు, పిల్లలు
సీఎం విజయ్ ప్రోగ్రామ్ లల్లో క్రౌడ్ మేనేజ్‌మెంట్ ఫెయిల్యూర్: స్పృహతప్పిన మహిళలు, పిల్లలు
CM Vijay Fitness Secret Simple Home Food Regular Exercise Keep Him Fit here the details

మధ్యాహ్న భోజనంలో అన్నంతోపాటు కూరగాయలు, పండ్లు, ప్రొటీన్లు అధికంగా ఉండే ఆహారాన్ని ఇష్టపడతారని చెప్పారు. రాత్రి భోజనం చాలా తేలికగా ఉంటుందన్నారు. ఎక్కువగా సూప్ లేదా సలాడ్ వంటివి తీసుకుంటారని వివరించారు. కాగా.. ఫిట్‌నెస్ కోసం రుచిలేని ఆహారాన్ని బలవంతంగా తినే రకం కాదని స్పష్టం చేసారు.

విజయ్ సంప్రదాయ దక్షిణ భారత వంటకాలనే ఇష్టపడతారని చెప్పుకొచ్చారు. జంక్ ఫుడ్‌కు పూర్తిగా దూరంగా ఉంటారన్నారు. అప్పుడప్పుడు ఇష్టమైన మటన్ బిర్యానీని ఆస్వాదిస్తారని, అలాగే శక్కరై పొంగల్ వంటి సంప్రదాయ తీపి వంటకాలను కూడా అప్పుడప్పుడు రుచి చూస్తారని చెప్పారు. విజయ్ వ్యాయామానికి అంతే ప్రాధాన్యత ఇస్తారు. ఒకవేళ జిమ్‌కు వెళ్లడం సాధ్యం కాకపోతే రోజువారీ శారీరక శ్రమను పెంచుకుంటారని వివరించారు.

మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్
మేనమామలా మోకాళ్లపై కూర్చుని బంగారపు ఉంగరాలను తొడిగిన విజయ్

కష్టమైన కసరత్తుల కన్నా నిలకడగా వ్యాయామం చేయడానికే ఆయన మొగ్గు చూపుతారు. ఇలా.. ఆహారం.. వ్యాయామం తో పాటుగా క్రమబద్ధమైన జీవన శైలితో ముఖ్యమంత్రి విజయ్ తన విధులను ప్రశాంతంగా నిర్వహణ లో సక్సెస్ అవుతున్నారని వివరించారు. ఏ విషయానికి ఒత్తిడి లోను కాకుండా.. సమస్య మూలం గురించే ఆలోచించటం ద్వారా పరిష్కారం సాధిస్తారని చెబుతున్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+