ఇరాన్‌కు ఇక రోజులు దగ్గరపడ్డట్లే.. ట్రంప్ సంచలన పోస్ట్!

అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ తన సోషల్ మీడియా వేదిక 'ట్రూత్ సోషల్'లో హార్ముజ్ జలసంధిలో అమెరికా బలగాలు నిర్మించిన నావికా దిగ్బంధనాన్ని ఉక్కుగోడగా అభివర్ణించారు. దేవుడి దయవల్ల ఈ ఉక్కుగోడను నిర్మించగలిగామని.. ఇది ఇలాగే కొనసాగుతుందని డొనాల్డ్ ట్రంప్ అన్నారు. హార్ముజ్ జలసంధిపై అమెరికాకు పూర్తి నియంత్రణ ఉందనే విషయాన్ని ట్రంప్ స్పష్టం చేస్తూ.. ఈ నావికా దిగ్బంధనాన్ని అడ్డుకోవడంలో ఇరాన్ పూర్తిగా విఫలమైందని పేర్కొన్నారు.

హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్!
హార్ముజ్ జలసంధిపై ఇరాన్ కీలక ప్రకటన.. అమెరికా ముందు షాకింగ్ డిమాండ్స్!

ఒకప్పుడు మధ్యప్రాచ్య పితామహుడిగా పరిగణించబడిన ఇరాన్ ఇప్పుడు మునుపటిలా లేదని ట్రంప్ ఎద్దేవా చేశారు. ప్రస్తుతం ఇరాన్ వద్ద బలమైన నావికాదళం గానీ, వైమానిక దళం గానీ లేవని పేర్కొన్నారు. ఆ దేశ ఇస్లామిక్ రెవల్యూనరీ గార్డ్ కార్ప్స్(ఐఆర్జీసీ) బలగాలు చెల్లాచెదురై పారిపోతున్నాయని.. మిగిలి ఉన్న సైనికులకు జీతాలు కూడా అందడం లేదని ట్రంప్ పేర్కొన్నారు. అక్కడ ద్రవ్యోల్బణం 300 శాతానికి చేరుకుందని, వారి పరిస్థితి నిరంతరం క్షీణిస్తోందని ఆయన పేర్కొన్నారు. ఇరాన్ కేవలం మాటలతో కాలం వెళ్లదీస్తోందని ట్రంప్ ఆరోపించారు.

Donald Trump Claims Full Control Over Strait of Hormuz Slams Iran Military on Truth Social Details

ఆగష్టు 12న హోర్ముజ్ గుండా కేవలం 8 ఓడలు మాత్రమే..
హార్ముజ్ జలసంధి గుండా నౌకా రవాణా అత్యంత పరిమితంగానే ఉంది. సాధారణంగా ప్రతిరోజూ 130-140 నౌకలు ప్రయాణించే ఈ జలసంధి గుండా, ప్రపంచ ముడి చమురులో 20 శాతం రవాణా జరిగే చోట, ఆగస్టు 12వ తేదీన కేవలం 8 నౌకలు మాత్రమే ప్రయాణించాయి.

ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!
ప్రపంచంలోనే అత్యంత ప్రమాదకరమైన విమాన మార్గం: మనకు ఇంత దగ్గర్లోనే!

ఇరాన్, ఒమన్ మధ్య సురక్షితమైన నౌకాయానం కోసం ఓ కొత్త సముద్ర మార్గానికి అంగీకారం కుదిరింది. ఈ ప్రతిపాదన ప్రకారం, ఇరాన్‌లోకి వచ్చే నౌకలు ఇరాన్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాలువ గుండా.. ఒమన్ నుంచి వెళ్లే నౌకలు ఒమన్‌కు అత్యంత సమీపంలో ఉన్న కాలువ గుండా ప్రయాణించగలవు. అయితే జలసంధిని తిరిగి తెరవడానికి ఇది హామీ అని ఇరాన్ భావించడం లేదు. అమెరికా ముందుగా తమ షరతులను అంగీకరించి, జూన్ ఒప్పంద ఉల్లంఘనలపై చర్యలు తీసుకోవాలని ఇరాన్ తేల్చి చెబుతోంది.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+