న్యూజిలాండ్ ఫస్ట్ సిరీస్- టీ20 వరల్డ్ కప్ ఫైనల్ తర్వాత జట్టులో భారీ మార్పలు
టీ20 వరల్డ్ కప్ ఫైనల్ లో భారత్ చేతిలో భారీ ఓటమి తర్వాత న్యూజిలాండ్ క్రమంగా కోలుకుంటోంది. తదుపరి సిరీస్ కు సన్నద్ధమౌతోంది. టీ20 వరల్డ్ కప్ సెమీ ఫైనలిస్ట్ దక్షిణాఫ్రికాతో తలపడనుంది. దీనికోసం జట్టును కూడా ప్రకటించింది న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్. మొత్తం అయిదు టీ20 ఇంటర్నేషనల్స్ మ్యాచ్ లో కూడిన సిరీస్ ఇది. దీనికి న్యూజిలాండ్ ఆతిథ్యాన్ని ఇవ్వబోతోంది. ఈ సిరీస్ కోసం జట్టులో భారీ మార్పులు జరిగాయి.
ఈ నెల 15వ తేదీన ఈ సిరీస్ ప్రారంభమౌతుంది. 25వ తేదీ వరకు కొనసాగుతుంది. తొలి మ్యాచ్ కు మౌంట్ మౌంగనుయ్ ఆతిథ్యాన్ని ఇస్తుంది. భారత కాలమానం ప్రకారం ఉదయం 11:45 నిమిషాలకు మ్యాచ్ మొదలవుతుంది. 17, 20, 22, 25 తేదీల్లో మిగిలిన నాలుగు మ్యాచ్ లు జరుగుతాయి. హామిల్టన్, అక్లాండ్, వెల్లింగ్టన్, క్రైస్ట్ చర్చ్ స్టేడియాలు వీటికి వేదిక కానున్నాయి. ఈ సిరీస్ కోసం చిన్న ప్రయోగానికి తెర తీసింది న్యూజిలాండ్.

మొదటి మూడు మ్యాచ్‌లకు మిచెల్ సాంట్నర్ కెప్టెన్‌గా వ్యవహరిస్తాడు. చివరి రెండు మ్యాచ్‌లకు టెస్ట్ కెప్టెన్ టామ్ లాథమ్ నాయకత్వ బాధ్యతలను తీసుకోనున్నాడు. టీ20 వరల్డ్ కప్ ఆడిన సాంట్నర్ సహా ఇతర ప్లేయర్లు భవిష్యత్ పర్యటనల కోసం సంసిద్ధంగా ఉండటానికి దీనికి తెరతీసింది. సాంట్నర్ కు ప్రత్యామ్నాయాన్ని సిద్దంగా ఉంచుకోవడానికి లాథమ్ కు టీ20 కేప్టెన్సీ పగ్గాలను అప్పగించనున్నట్లు న్యూజిలాండ్ క్రికెట్ బోర్డ్ తెలిపింది.
టీ20 ఫార్మట్ లో జరిగే సూపర్ స్మాష్, 50 ఓవర్ల ఫోర్డ్ ట్రోఫీలో కాంటర్‌బరీ తరపున అదరగొట్టాడు టామ్ లాథమ్. నిదానంగా ఆడతాననే ముద్రను తొలగించుకున్నాడు. మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. దీంతో దాదాపు మూడు సంవత్సరాల విరామం తర్వాత అతను తొలి టీ20 ఇంటర్నేషనల్ ఆడబోతున్నాడు.
ఈ సిరీస్ తర్వాత ఐపీఎల్ ఆరంభం కానుండటంతో దాదాపుగా మూడు నెలల పాటు ఎటువంటి ద్వైపాక్షిక పర్యటలను కూడా నిర్వహించట్లేదు న్యూజిలాండ్. ఐపీఎల్ ముగిసిన తర్వాత ఇంగ్లాండ్, వెస్టిండీస్ పర్యటనలకు బయలుదేరివెళ్తుంది. ఆయా సిరీస్ లన్నీ కూడా బ్లాక్ క్యాప్స్ కు ప్రతిష్ఠాత్మకమైనవే.
ఈ పర్యటనకు ఎంపికైన జట్టులో- మిచెల్ సాంట్నర్ (కెప్టెన్ తొలి మూడు మ్యాచ్ లకు), కేటీన్ క్లార్క్ (చివరి 4,5 మ్యాచ్ లు), జోష్ క్లార్క్సన్, డేన్ క్లీవర్ (వికెట్ కీపర్, చివరి 4,5 మ్యాచ్ లు), డెవాన్ కాన్వే (వికెట్ కీపర్, తొలి మూడు మ్యాచ్ లు), లోకీ ఫెర్గూసన్ (2, 3 మ్యాచ్ లు), జాక్ ఫౌల్క్స్, బెవాన్ జాకబ్స్, కైల్ జామిసన్, నిక్ కెల్లీ, టామ్ లాథమ్ (కెప్టెన్, చివరి 4, 5 మ్యాచ్ లు), జేడెన్ లెన్నాక్స్ (చివరి 4, 5 మ్యాచ్ లు), కోల్ మెక్‌కాంచీ, జిమ్మీ నీషమ్, టిమ్ రాబిన్సన్, బెన్ సియర్స్, నాథన్ స్మిత్, ఈష్ సోధి.
-
ఎన్టీఆర్ పాటకు స్టెప్పులేసిన సితార.. వైరల్ వీడియో -
నక్కతోక తొక్కిన "అస్సాం బ్యూటీ".. నందమూరి హీరోతో స్టెప్పులేసే ఛాన్స్ !! -
ఏపీలో స్థానిక సంస్థల పునర్విభజన- మారిపోతున్న ముఖచిత్రాలు -
PNGకి మారకపోతే LPG సిలెండర్ కట్..! కేంద్రం డెడ్ లైన్..! -
చమురు, గ్యాస్ పరిస్ధితి ఇదీ- అఖిలపక్ష భేటీలో తేల్చేసిన కేంద్రం..! -
నన్ను ఆ డైరెక్టర్ ఎక్కడెక్కడో పట్టుకున్నాడు.. కానీ అమ్మానాన్న సర్దుకుపోమన్నారు !! -
Iran: ట్రంప్ కు ఇరాన్ దిమ్మతిరిగే షాక్..! సీజ్ ఫైర్ కు కఠిన షరతులివే..! -
ఇంధన కొరత వేళ.. తెలంగాణ ఆర్టీసీ సంచలన నిర్ణయం -
‘దీదీ’ రాజీనామా.. ఎన్నికల వేళ మమత సంచలన నిర్ణయం! -
ఏపీలో తెలంగాణ సీఎం.. లోకేష్ బంపర్ ఆఫర్ -
అంతా అయిపోయింది- డొనాల్డ్ ట్రంప్ -
Red Alert: వడగళ్ల వాన, రాబోయే రెండు గంటల్లో భారీ వర్షం












Click it and Unblock the Notifications