ఇన్నాళ్లూ ఆచితూచి- ఇప్పుడు ప్రధాని మోదీపై సీఎం డైరెక్ట్ అటాక్?

కేంద్రం, రాష్ట్ర ప్రభుత్వం మధ్య మరోసారి ఘర్షణ వైఖరి తలెత్తింది. ఇది ఇక్కడితో ఆగేలా కనిపించట్లేదు. ఇన్నాళ్లూ ఆచితూచి వ్యవహరించిన రాష్ట్రం ఇప్పుడిక తగ్గేదే లేదంటోంది. రాష్ట్ర ప్రయోజనాల విషయంలో రాజీ పడదలచుకోలేదని స్పష్టం చేస్తోంది. ప్రధాని నరేంద్ర మోదీతో నేరుపై నేరుగా అటాక్ కు దిగుతోంది. తాజాగా మారిన రాజకీయ పరిస్థితుల మధ్య ఈ పరిణామం చోటు చేసుకోవడం ప్రాధాన్యతను సంతరించుకుంది.

వివిధ అభివృద్ధి ప్రాజెక్టులను ప్రారంభించడానికి నేడు ప్రధాని మోదీ కేరళకు బయలుదేరి వెళ్లనున్నారు. ఈ పర్యటనకు ముఖ్యమంత్రి పినరయి విజయన్ సహా మంత్రులెవ్వరూ హాజరు కావట్లేదు. ప్రొటోకాల్ నిబంధనలను పాటించడానికి నామ్ కే వాస్తే అన్నట్టుగా ఒక్క పీడబ్ల్యూడీ మంత్రి మహమ్మద్ రియాజ్ కు ఇందులో నుండి మినహాయింపు ఇచ్చింది. ఆయన తప్ప పినరయి విజయన్‌ గానీ, ఆయన మంత్రివర్గ సహచరులు గానీ మోదీ అధికారిక కార్యక్రమానికి దూరంగా ఉండాలని నిర్ణయించుకున్నారు.

CM and other Ministers Stay Away PM Modi inaugurate various development projects in the State today

కొచ్చిలో ఈ మధ్యాహ్నం 12:30 గంటలకు ప్రధాని మోదీ పలు అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేయనున్నారు. ఈ సందర్భంగా ఆరు లేన్ల జాతీయ రహదారి 66 విస్తరణలో భాగంగా మొదటి స్ట్రెచ్ ను ఆయన ప్రారంభించనున్నారు. ఇందులో థలపాడి-చెంగళ పరిధిలోని కోజికోడ్ బైపాస్‌ వేంగళం-రామనాట్టుకర విస్తరణ పనులు కూడా ఉన్నాయి. ఈ రెండు విభాగాలను ఆరు లేన్లుగా అప్‌గ్రేడ్ అయ్యాయి.

ఈ కార్యక్రమానికి పినరయి విజయన్, సహా పలువురు మంత్రులు హాజరవుతారని తొలుత ప్రకటించారు. దీనికి సంబంధించిన ఇన్విటేషన్ కార్డుల్లోనూ వారి పేర్లు ఉన్నాయి. ఈ కార్యక్రమానికి హాజరుకావట్లేదని తాజాగా తేలింది. దీనికి గల కారణాలు ఏమిటనేది స్పష్టంగా తెలియరావట్లేదు గానీ అసెంబ్లీ ఎన్నికలు సమీపిస్తోన్న ప్రస్తుత పరిస్థితుల్లో మాత్రమే వ్యూహాత్మకంగా ఓటుబ్యాంకును ప్రభావితం చేసేలా అభివృద్ధి కార్యక్రమాలకు శంకుస్థాపనలు, ప్రారంభోత్సవాలు చేస్తోండటమే కారణమని తెలుస్తోంది.

ప్రధాని కార్యక్రమంలో వ్యక్తిగత కారణాలను చూపుతూ దూరంగా ఉండబోతోన్నట్లు మంత్రులు ఎంబీ రాజేష్, కే కృష్ణన్‌కుట్టి ప్రకటించారు. ఈ పరిణామాలపై మంత్రి రియాజ్ స్పందించారు. తనకు ఈ కార్యక్రమానికి సంబంధించిన అధికారిక ఆహ్వానం అందలేదని వెల్లడించారు. జాతీయ రహదారుల అభివృద్ధిలో భూసేకరణ, నిధుల భాగస్వామ్యం ద్వారా రాష్ట్ర ప్రభుత్వం కీలక పాత్ర పోషించిందని, తమకు కేంద్రం ప్రాధాన్యత ఇవ్వట్లేదని గుర్తుచేశారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+