రాహుల్ క్షమాపణ చెప్పాలి: ప్రధానిపై వ్యాఖ్యలపై బాబు

ప్రధానిని ప్రతి ఒక్కరూ గౌరవించాలని, అలాగే ప్రధాని హుందాగా వ్యవహించి దేశ గౌరవాన్ని కాపాడాలని ఆయన అన్నారు. రాహుల్ పరిపక్వత లేకుండా మాట్లాడుతున్నారని విమర్శించారు. స్వాతంత్య్రం వచ్చి ఇన్ని సంవత్సరాలు అయినా ప్రజలు ఇబ్బందులు పడుతున్నారని, ప్రజలకు సుపరిపాలన అందించినప్పుడే గాంధీజీకి నిజమైన నివాళి అని అన్నారు.
సిటిజన్స్ ఆఫ్ అకౌంటెబుల్ గవర్నెన్స్ సదస్సులో పాల్గొనేందుకు చంద్రబాబు ఢిల్లీ వచ్చారు. ప్రధాని పదవి కోసం పాకులాడకుండా రాహుల్ గాంధీ హుందాగా వ్యవహరించాలని ఆయన అన్నారు. నేర చరితుల అర్డినెన్స్‌ను చించేయాలని రాహుల్ గాంధీ వ్యాఖ్యానించిన విషయం తెలిసిందే.
రాహుల్ వ్యాఖ్యపై ప్రధాని మన్మోహన్ సింగ్ వ్యంగ్యాస్త్రాలు విసిరారు. ఈ నేపథ్యంలో రాహుల్ గాంధీ బుధవారం ప్రధాని డాక్టర్ మన్మోహన్ సింగ్‌తో సమావేశమయ్యారు.












Click it and Unblock the Notifications