పొత్తుకే టిడిపి, బిజెపి మొగ్గు: సీట్ల పంపకంపై పేచీ!

తెలంగాణ, సీమాంధ్ర ఇరుప్రాంతాల్లోనూ టిడిపితో బిజెపి పొత్తు పెట్టుకునే అవకాశాలు ఎక్కువగా ఉన్నాయంటున్నారు. అయితే రెండు పార్టీల మధ్య సీట్ల పంపకం పైనే పేచీ ఉన్నట్లుగా తెలుస్తోంది. అయితే పార్లమెంటు, అసెంబ్లీ ఎన్నికల షెడ్యూలు వెలువడిన నేపథ్యంలో పొత్తులపై పార్టీలో చర్చ ప్రారంభమైంది.
తెలంగాణ కోసం ఉద్యమించిన పార్టీగా తెలంగాణ రాష్ట్ర సమితితో పొత్తు పెట్టుకుంటే బాగుంటుందన్న అభిప్రాయాలు తెలంగాణ బిజెపిలో వ్యక్తమయ్యాయి. కానీ తెరాస అందుకు సుముఖంగా లేదు. ప్రత్యామ్నాయంగా టిడిపి వైపు చూస్తున్నారంటున్నారు. ఇప్పటికే చంద్రబాబు, రాజ్‌నాథ్ సింగ్, నరేంద్ర మోడీల మధ్య ఒక అవగాహన కుదిరిందని అంటున్నారు.
జాతీయ నేతలే ఆసక్తిగా ఉన్నప్పుడు రాష్ట్ర కమిటీ పాత్ర పెద్దగా ఉండకపోవచ్చని, ఈ దృష్ట్యా పొత్తు ఖాయంగా కనిపిస్తోందని అంటున్నారు. త్వరలో దీనిపై సానుకూల ప్రకటన వెలువడే అవకాశముందట. అయితే సీట్ల పంపకంపై అవగాహనకు రాకపోవడం వల్ల అధికారక ప్రకటనలో జాప్యమవుతోందని చెబుతున్నారు.












Click it and Unblock the Notifications