బాధపడ్డా, అందుకే ఇలా చేస్తా: నోట్లరద్దుపై బాబు, జగన్‌తో జాగ్రత్త.. అని హెచ్చరిక

సమాజంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి డబ్బు ఉన్న కులం అని, మరొకటి డబ్బులేని పేదల కులం అని, తనది పేదల కులమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు గురువారం నాడు అన్నారు.

విజయవాడ: సమాజంలో రెండే కులాలు ఉన్నాయని, ఒకటి డబ్బు ఉన్న కులం అని, మరొకటి డబ్బులేని పేదల కులం అని, తనది పేదల కులమని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గురువారం నాడు అన్నారు.

 Chandrababu unhappy with post demonetisation situation

అందుకే తాను నిత్యం పేదల సంక్షేమం కోసమే ఆలోచిస్తున్నానని చెప్పారు. సమాజమే దేవాలయం.. ప్రజలే దేవుళ్లని చెప్పిన ఏకైక వ్యక్తి స్వర్గీయ నందమూరి తారక రామారావు అన్నారు. అందుకే పేదరికంలేని సమాజమే తన జీవితాశయంగా పెట్టుకున్నట్టు చెప్పారు.

నోట్ల రద్దు పరిణామాలతో బాధపడ్డా అందుకే..

నోట్ల రద్దు తదనంతర పరిణామాల పైన కూడా స్పందించారు. ఈ నిర్ణయంతో చాలా ఇబ్బంది పడటంతో తానెంతో బాధపడ్డానని చెప్పారు. అందుకే జనవరి నుంచి పెన్షన్లన్నీ పాత విధానంలోనే కొనసాగించనున్నట్టు ఆదేశాలు జారీ చేసినట్లు తెలిపారు.

కాపుల విషయంలో ప్రత్యేక శ్రద్ద పెట్టినట్టు తెలిపారు. రైతులకు రూ.24వేల కోట్ల రుణాలను మాఫీ చేశామన్నారు. జన్మభూమి కార్యక్రమం కింద కొత్త రేషన్‌కార్డులు పంపిణీ చేస్తామన్నారు. బుడగ జంగాలను ఎస్సీల్లో కలిపేందుకు కమిటీని వేశామని, త్వరలోనే నివేదిక వస్తుందని తెలిపారు.

రూ.332 కోట్లతో తొమ్మిది నెలల్లో విద్యుత్ స్తంభాల ద్వారా ఫైబర్ గ్రిడ్ ఏర్పాటు చేస్తామన్నారు. మోరి గ్రామాన్ని ఓడీఎఫ్ గ్రామంగా ప్రకటించామ్నారు. ప్రజలంతా వినూత్నంగా ఆలోచించాలని సూచించారు. కులాలు, వర్గాలు, ప్రాంతాల పేరుతో చిచ్చు పెట్టే వారి పట్ల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని వైసిపి అధినేత జగన్‌ను ఉద్దేశించి అన్నారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+