చంద్రబాబు రిమాండ్‌పై ఏసీబీ కోర్టు తాజా ఆదేశాలు
విజయవాడ: స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో అరెస్టయిన తెలుగుదేశం పార్టీ అధినేత, ప్రతిపక్ష నాయకుడు చంద్రబాబు నాయుడు.. ప్రస్తుతం రాజమండ్రి సెంట్రల్ జైలులో విచారణను ఎదుర్కొంటోన్నారు. ఈ కేసులో విజయవాడలోని ఏసీబీ ప్రత్యేక న్యాయస్థానం రిమాండ్ విధించింది. జ్యుడీషియల్ కస్టడీకి తరలించింది.
2014-2019 మధ్యకాలంలో ముఖ్యమంత్రిగా పని చేసినప్పుడు స్కిల్ డెవలప్‌మెంట్ కార్పొరేషన్‌లో వందల కోట్ల రూపాయల మేర ఆర్థిక అవకతవకలకు పాల్పడ్డారని, డొల్ల కంపెనీలను సృష్టించి, ముడుపులను పొందారనే ఆరోపణలు చంద్రబాబుపై ఉన్నాయి. దీనిపై ఏపీ సీఐడీ అధికారులు కేసు నమోదు చేశారు.

ఈ నెల 22వ తేదీన చంద్రబాబు రిమాండ్ ముగిసిన నేపథ్యంలో.. ఆయన తరఫు న్యాయవాదులు బెయిల్ కోసం దాఖలు చేసిన పిటీషన్‌పై విజయవాడలోని ఏసీబీ న్యాయస్థానం కీలక ఆదేశాలు జారీ చేసింది. 22వ తేదీ నాడే రెండు రోజుల పాటు రిమాండ్‌ను పొడిగించింది ఏసీబీ కోర్టు. ఇప్పుడు తాజాగా చంద్రబాబు రిమాండ్‌ను మరో 11 రోజుల పాటు పొడిగించింది.
ఈ మేరకు కొద్దిసేపటి కిందటే న్యాయమూర్తి ఉత్తర్వులు ఇచ్చారు. ఈ తాజా ఉత్తర్వుల ప్రకారం.. అక్టోబర్ 5వ తేదీ వరకు చంద్రబాబు రిమాండ్‌లో కొనసాగాల్సి ఉంటుంది. స్కిల్ డెవలప్మెంట్ కార్పొరేషన్ కుంభకోణంలో- రాజమండ్రి సెంట్రల్ జైలులో ఉంటూ చంద్రబాబు ఈ విచారణను ఎదుర్కొనాల్సి ఉంటుంది. ఆయన బెయిల్‌పై అక్టోబర్ 5వ తేదీ తరువాతే ఏసీబీ కోర్టు తదుపరి ఆదేశాలు జారీ చేస్తుంది.
రాజకీయంగా పలుకుబడి ఉన్న నాయకుడు కావడం వల్ల చంద్రబాబుకు బెయిల్ ఇస్తే- సాక్ష్యులను ప్రభావితం చేయగలరని, సాక్ష్యాధారాలు తారుమారు కాగలవనీ అదనపు సొలిసిటర్ జనరల్ పొన్నవోలు సుధాకర్ రెడ్డి ఇదివరకే వాదించిన విషయం తెలిసిందే. ఈ స్కాంపై విచారణ ప్రారంభదశలోనే ఉన్న నేపథ్యంలో బెయిల్ ఇవ్వడం సరికాదని పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications