చెన్నై- విజయవాడ వందేభారత్ : టైమింగ్స్, ధరలు, స్టాపులు ఖరారు..!!
తెలుగు రాష్ట్రాల్లో మరో వందేభారత్ పట్టాలెక్కనుంది. విజయవాడ - చెన్నై-విజయవాడ వందేభారత్ ప్రారంభానికి ముహూర్తం ఖరారైంది. ఈ రైలు ప్రయాణించే మార్గం..సమయవేళలు..స్టాపులు ..టికెట్ ధరలు ఖరారయ్యాయి. ఈ నెల 28న ప్రధాని ఈ రైలును వర్చ్యువల్ గా ప్రారంభించేందుకు దాదాపు ముహూర్తం ఫైనల్ అయింది. అదే రోజున దేశ వ్యాప్తంగా మరో నాలుగు వందేభారత్ సర్వీసులను ప్రధాని ప్రారంభించనున్నారు.
తెలుగు రాష్ట్రాల్లో మూడో వందేభారత్
తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే విశాఖ - సికింద్రాబాద్, తిరుపతి -సికింద్రాబాద్ మధ్య వందేభారత్ సర్వీసులు కొనసాగుతున్నాయి. తెలుగు రాష్ట్రాల్లో ఈ రెండు రైళ్లకు ఆశించిన స్థాయిలో ఆక్యెపెన్సీ ఉండటంతో డిమాండ్ ఉన్న మరో మార్గంలో వందేభారత్ కు రైల్వే శాఖ నిర్ణయించింది. ఉత్తారాది, ఈశాన్య ప్రాంతాల నుంచి దక్షిణాదిన చెన్నైకు వెళ్లే మార్గంలో విజయవాడ ప్రధాన జంక్షన్ గా ఉంది.

దీంతో, నిత్యం రద్దీగా ఉండే విజయవాడ - చెన్నై మార్గంలో వందేభారత్ ప్రతిపాదనకు రైల్వే శాఖ నిర్ణయం తీసుకుంది. ఈ నెల తొలి వారంలోనే ఈ సర్వీసును ప్రారంభించాలని భావించినా..వాయిదా పడింది. దీంతో, ఈ నెల 28న దేశవ్యాప్తంగా అయిదు వందేభారత్ రైళ్లను ప్రధాని ప్రారంభించనున్నారు. అందులో ఈ రైలును చేర్చినట్లు తాజా సమాచారం.
5 గంటల్లో విజయవాడ టు చెన్నై
విజయవాడ -చెన్నై మధ్య 431 కిలో మీటర్ల దూరం ఉంది. ప్రస్తుతం తమిళనాడు ఎక్స్ ప్రెస్ 5 గంటల 45 నిమిషాల్లో గమ్యం చేరుకుంటోంది. వందేభారత్ 5 గంటల్లోనే విజయవాడ నుంచి చెన్నై చేరుకొనే విధంగా టైమింగ్స్ ఖరారు చేసారు. అధికారుల నుంచి అందుతున్న సమాచారం మేరకు ఉదయం 8 గంటలకు విజయవాడలో బయల్దేరి, మధ్నాహ్నం 1 గంటకు చెన్నై చేరుకోనుంది.
అదే విధంగా తిరుగు ప్రయాణంలో మధ్నాహ్నం 3 గంటలక చెన్నైలో బయల్దేరి రాత్రి 8 గంటలకు విజయవాడ చేరుకుంటుంది. మార్గంలో తెనాలి, ఒంగోలు, నెల్లూరు, గూడూరు స్టేషన్లలో హాల్టింగ్ సౌకర్యం కల్పించాలని నిర్ణయించారు. ఒక్కో స్టేషన్ లో రెండు నిమిషాలు వందేభారత్ ఆగనుంది.
28న ప్రారంభ ముహూర్తం
ఇక, విజయవాడ - చెన్నై వందేభారత్ ఏసీ ఛైర్ కార్ టికెట్ ధర రూ. 1185 గా నిర్దారించారు. ఎగ్జిక్యూటివ్ చైర్ కార్ ధర రూ 2,145 గా నిర్ణయించినట్లు అధికార వర్గాల సమాచారం. ఇప్పటికే సికింద్రాబాద్ నుంచి విజయవాడ మీదుగా విశాఖ వరకు వందేభారత్ కొనసాగుతోంది. అదే విధంగా సికింద్రాబాద్ నుంచి గుంటూరు, తెనాలి మీదుగా తిరుపతికి వందేభారత్ అందుబాటులో ఉంది.
ఇప్పుడు ఇదే మార్గంలో రేణిగుంట నుంచి కాట్పాడి మీదుగా చెన్నై వరకు వందేభారత్ కొనసాగించాలని..దీని కారణంగా తిరుపతి ప్రయాణీకులు మేలు జరుగుతుందదని అధికారులు నివేదిక ఇచ్చారు. అయితే, గూడూరు మీదుగా ఖరారు చేసినట్లు తెలుస్తోంది. దీనికి సంబంధించి రైల్వే శాఖ అధికారికంగా ప్రకటన చేయనుంది.
-
సికింద్రాబాద్ స్టేషన్ సిద్దం, ప్రధాని మోదీ ప్రారంభం - ముహూర్తం ఫిక్స్..!! -
మకరరాశి వార్షిక జాతకం ఇలా.. ఈ ఏడాది విశేష లాభాలు! -
రైతు భరోసా నిధులు జమ కాలేదా, ఇలా చేయండి- వెంటనే..!! -
విజయ్‌కు షాకిచ్చిన సర్వే!: ఆ పార్టీకి 180+ సీట్లు -
"నాకు అమ్మా నాన్న లేరు సార్ మీరే నాకు అమ్మా నాన్న.. పాస్ చేయండి సార్" -
తెలంగాణ ఉద్యోగులకు సర్కార్ గుడ్ న్యూస్-అసెంబ్లీలో ప్రకటన..! -
సికింద్రాబాద్- విశాఖ ఎక్స్ ప్రెస్ ఇక విజయవాడ వెళ్లదు- డైవర్షన్ రూట్ -
తెలంగాణ నుంచి తిరుపతి వెళ్లే వారికి గుడ్ న్యూస్.. అందుబాటులోకి కొత్త ఎన్ హెచ్ 565 -
చైనా బంగారు కవచం.. ప్రపంచ ఆర్థిక వ్యవస్థలో ప్రకంపనలు! -
ఆ భూములు ఇక వారికే, నిషేధం ఎత్తివేత - ప్రభుత్వం సంచలన ఉత్తర్వులు..!! -
అమెరికాలో విమాన ప్రమాదం: రన్ వే పై అడ్డంగా -
కొంపలు అంటుకున్నాయ్: 4 నెలల కనిష్టానికి బంగారం ధరలు












Click it and Unblock the Notifications