బాక్సైట్ దోచుకోవాలని జగన్: చిరు, కబ్జానే: ఉమ
విశాఖపట్నం/ విజయవాడ: బాక్సైట్‌ను దోచుకోవడానికి వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ప్రయత్నించారని కాంగ్రెసు నాయకుడు, కేంద్ర మంత్రి చిరంజీవి ఆరోపించారు. విశాఖ ఏజెన్సీలో బాక్సైట్ అనుమతులు ఇచ్చింది వైయస్ రాజశేఖర రెడ్డేనని ఆయన అన్నారు.
ఎన్నికల ప్రచారంలో భాగంగా ఆయన గురువారంనాడు విశాఖ జిల్లా పాడేరులో రోడ్‌షో నిర్వహించారు. కాంగ్రెసు అధికారంలోకి వస్తే విశాఖ ఏజెన్సీలో గిరిజన విశ్వవిద్యలయాన్ని ఏర్పాటు చేస్తామని ఆయన హామీ ఇచ్చారు.

వైయస్సార్ కాంగ్రెసు అధినేత వైయస్ జగన్‌కు అధికారమిస్తే సీమాంధ్రను కబ్జా చేస్తారని తెలుగుదేశం పార్టీ నేత దేవినేని ఉమా మహేశ్వర రావు ఆరోపించారు. వైయస్సార్ కాంగ్రెసుకు ఓటేస్తే ఇడుపులపాయ సీమాంధ్ర రాజధాని అవుతుందని ఆయన గురువారం మీడియా ప్రతినిధులతో అన్నారు.
ఇడుపులపాయకు కృష్ణా జలాల నీరు తరలించిన తర్వాతే ప్రకాశం బ్యారేజి నీరు వస్తాయని వెల్లడించారు. వైయస్సార్ కాంగ్రెసు తరపున పోటీ చేసే వారిలో సగం మంది వివిధ కేసుల్లో నిందితులని ఆయన ధ్వజమెత్తారు. సీమాంధ్ర అభివృద్ధి తెలుగుదేశం పార్టీ ద్వారానే సాధ్యమని ఆయన స్పష్టం చేశారు. ఈ ఎన్నికల్లో అవినీతిపరులను తరిమికొట్టాలని ప్రజలకు దేవినేని ఉమా పిలుపునిచ్చారు.












Click it and Unblock the Notifications