హీరో అనిపించుకోవాలని బలి తీసుకున్నాడు: చంద్రబాబుపై జగన్ (పిక్చర్స్)
మచిలీపట్నం: ప్రజారోగ్యాన్ని గాలికి వదిలేసిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడికి ప్రాణం విలువ తెలియదని వైయస్సార్ కాంగ్రెస్ పార్టీ అధినేత వైఎస్ జగన్మోహనరెడ్డి వ్యాఖ్యానించారు. కృష్ణాజిల్లా చల్లపల్లి మండలం కొత్త మాజేరు గ్రామంలో విష జ్వరాల బారిన పడి మృతి చెందినవారి కుటుంబ సభ్యులను మంగళవారం పరామర్శించారు.
కలుషిత జలాల వల్లనే విష జ్వరాలు ప్రబలి 18 మంది మృతి చెందారని గ్రామస్థులు జగన్‌కు వివరించారు. దీనిపై తీవ్రంగా స్పందించిన జగన్ రెండున్నర నెలల కాలంలో 18 మంది మృతి చెందడం బాధాకరమని, దీనికి ప్రభుత్వమే పూర్తి బాధ్యత వహించాలన్నారు.
బాధిత కుటుంబాలకు రూ.5లక్షలు ఎక్స్‌గ్రేషియా ఇవ్వాలని డిమాండ్ చేశారు. వారం రోజుల్లో ఆ కుటుంబాలకు న్యాయం జరగని పక్షంలో స్వయంగా తానే మృతుల కుటుంబ సభ్యులతో కలిసి జిల్లా కలెక్టర్ ఎదుట ఆందోళనకు దిగుతానని హెచ్చరించారు.

28 మంది మరణానికి...
గోదావరి పుష్కరాల్లో తనను హీరోగా చిత్రీకరించుకునేందుకు 28 మంది యాత్రికుల మరణాలకు ముఖ్యమంత్రి చంద్రబాబు కారకుడయ్యారని ఆరోపించారు.

నిద్రపోను...
మృతుల కుటుంబాలకు న్యాయం జరిగే వరకు తాను నిద్రపోనని వైయస్ జగన్ అవనిగడ్డ నియోజకవర్గంలోని చల్లపల్లి గ్రామ ప్రజలతో అన్నారు.
జగన్ పరామర్శ కార్యక్రమంలో ఉమ్మారెడ్డి వెంకటేశ్వర్లు, మోపిదేవి వెంకట రమణ, సామినేని ఉదయభాను, పేర్ని నాని, ఎమ్మెల్యేలు కొడాలి నాని తదితరులు పాల్గొన్నారు.

మంత్రికి పట్టడం లేదు..
వైద్య ఆరోగ్య శాఖ మంత్రి కామినేని శ్రీనివాస్ సొంత జిల్లాలోనే విష జ్వరాలు అధికంగా ఉన్నా సంబంధిత శాఖ మంత్రికి పట్టడం లేదని జగన్ దుయ్యబట్టారు.

కప్పిపుచ్చుకునేందుకు...
మాజేరు ఘటనలో ప్రభుత్వం తన వైఫల్యాన్ని కప్పిపుచ్చుకునే ప్రయత్నం చేస్తోందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్ మండిపడ్డారు.

18 మంది మృతి
కొత్త మాజేరు గ్రామంలో విషజ్వరాలకు 18 మంది మరణించారు. వారి కుటుంబాలను వైయస్ జగన్ మంగళవారంనాడు పరామర్శించారు.

ఉసురు తగులుతుంది...
బాధిత కుటుంబాల ఉసురు చంద్రబాబు ప్రభుత్వానికి తగులుతుందని వైయస్ జగన్ వారి గోడు విన్న తర్వాత అన్నారు.

అడిగి తెలుసుకున్నారు..
కొత్తమాజేరులో 18 మంది మరణించడానికి గల కారణాలను, గ్రామంలో నెలకొన్న పరిస్థితులను తహశీల్దార్ స్వర్ణమేరి, ఆర్‌డబ్ల్యూఎస్ డీఈ రవికుమార్‌ను వైయస్ జగన్ అడిగి తెలుసుకున్నారు.

ఉన్న వాస్తవాలు చెప్పండి..
ఉన్న వాస్తవాలు చెప్పాలని, ఎవరికీ భయపడవడవద్దని కొత్తమాజేరు మరణాలపై జగన్ అధికారులకు చెప్పారు.

అధికారాన్ని దక్కించుకునేందుకే...
చంద్రబాబు అధికారాన్ని దక్కించుకునేందుకు ఎన్నికల సమయంలో అమలు సాధ్యం కాని హామీలు ఇచ్చారని జగన్ ఘంటసాల మండలం లంకపల్లి గ్రామంలో ఉఅన్నారు.

రాబోయే రోజులు మనవే..
రుణమాఫీ చేయకుండా చంద్రబాబు కాలయాపన చేస్తున్నారని, రాబోయే రోజులు మనవేనని జగన్ లంకపల్లి గ్రామ రైతులతో అన్నారు.












Click it and Unblock the Notifications