తేల్చేశారు: ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా లేనట్లే..
న్యూఢిల్లీ: ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా అనే విషయాన్ని మరిచిపోవాల్సిందే. పార్లమెంటు సాక్షిగా ఆ విషయం స్పష్టమైంది. ఎన్డీఎ ప్రభుత్వం ఈ విషయాన్ని స్పష్టంగా తేల్చేసింది. శుక్రవారం లోక్‌సభలో తెలంగాణ, ఆంధ్రప్రదేశ్ రాష్ర్టాలకు సంబంధించిన ఎంపీలు కొత్తప్రభాకర్‌రెడ్డి, మాగంటిబాబు అడిగిన ప్రశ్నలకు లిఖితపూర్వకంగా కేంద్రం సమాధానం ఇచ్చింది.
ప్రత్యేక హోదాపై ఆశలు వదులుకోవచ్చని ప్రణాళిక శాఖ మంత్రి రావు ఇంద్రజిత్‌సింగ్ స్పష్టం చేశారు. ఇప్పటికే 11 రాష్ర్టాలకు అప్పటి ఎన్డీసి ప్రత్యేక హోదా ఇచ్చిందని గుర్తు చేశారు. అరుణాచల్‌ప్రదేశ్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, జమ్మూకశ్మీర్, మణిపూర్, మేఘాలయా, మిజోరాం, నాగాలాండ్, సిక్కిం, త్రిపుర, ఉత్తారాఖండ్‌లకు ఆ హోదా ఇచ్చిన విషయాన్ని ఆయన గుర్తు చేశారు.

దానికి తోడు, ప్రత్యేక హోదాకు ఇచ్చేందుకు అవసరమైన ఐదు అర్హతలను ఈ సందర్భంగా ఇంద్రజిత్ ప్రస్తావించారు. 14 ఆర్థిక సంఘం సిఫార్సుల తర్వాత ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా ఇచ్చే అవకాశం లేదు. 14వ ఆర్థిక సంఘం సిఫార్సులను పరిగణలోకి తీసుకున్న కేంద్రం గత బడ్జెట్‌లో పలు కేంద్ర పథకాలను ఉపసంహరించుకుందని, కేంద్రం ఇచ్చే నిధులను తగ్గించిందన్న విషయాన్ని ఇంద్రజిత్ స్పష్టం చేశారు.
ప్రస్తుతం ప్రత్యేక హోదా పొందిన 11 రాష్ర్టాలు కూడా బయటనుంచి ఆర్థిక సాయం పొందే పథకాలకు కేంద్రం 90 శాతం నిధులను అందజేస్తుందని ఆయన తెలిపారు. ప్రత్యేక హోదా కోరుతూ ఏపీ, తెలంగాణ నుంచి అభ్యర్థనలు అందాయనే విషయాన్ని ఇంద్రజిత్ చెప్పారు. ఈ క్రమంలో 14వ ఆర్థిక సంఘం సిఫార్సుల మేరకు ఇక ఏ రాష్ర్టానికి ప్రత్యేక హోదా దక్కదని కేంద్రం తేల్చేసింది.












Click it and Unblock the Notifications