నాది బాధ్యత, మోదీకి చంద్రబాబు హామీ- మిషన్ 2029..!!
అమరావతి కేంద్రంగా కీలక పరిణామాలు చోటు చేసుకుంటున్నాయి. ప్రధాని మోదీ అమరావతి కేంద్రంగా సీఎం చంద్రబాబుకు బిగ్ టాస్క్ అప్పగించారు. అమరావతి నిర్మాణానికి కేంద్రం నుంచి సహకారం ఉంటుందని హామీ ఇచ్చారు. ఏపీ భవిష్యత్ లో అమరావతి పాత్ర కీలకం కానుందని ప్రధాని పేర్కొన్నారు. సభ సక్సెసె కావటంతో కూటమి నేతలు ఖుషీ అవుతున్నారు. ఇదే సమయం లో ప్రధాని అమరావతి పర్యటన పైన ఆసక్తికర ట్వీట్ చేసారు. చంద్రబాబు సైతం అమరావతి కేంద్రంగా కీలక హామీ ఇచ్చారు.
ప్రధాని సందేశం
అమరావతిలో ప్రధాని మోదీ పనులను రీ లాంఛ్ చేసారు. అమరావతితో పాటుగా రాష్ట్రంలో పలు నిర్మాణాలకు శంకుస్థాపన చేసారు. అమరావతి సభలో పాల్గొన్న ప్రధాని మోదీ చేసిన ట్వీట్ వైరల్ అవుతోంది. అమరావతి అభివృద్ధిలో నూతన, చారిత్రాత్మక అధ్యాయాన్ని ప్రారంభించిన సంద ర్భంగా ఆంధ్రప్రదేశ్‌లోని నా సోదర, సోదరీమణుల మధ్య ఉండటం ఆనందంగా ఉందని ప్రధాని పేర్కొన్నారు. అమరావతి భవిష్యత్ పట్టణ కేంద్రంగా ఆవిర్భవిస్తుందని, ఇది ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథాన్ని మెరుగుపరుస్తుందని నేను విశ్వసిస్తున్నట్లు ప్రధాని వివరించారు. నాకు మంచి మిత్రుడు, ముఖ్యమంత్రి చంద్రబాబుకి అమరావతి పట్ల ఉన్న దార్శనికత, ఏపీ ప్రజల సంక్షేమం పట్ల ఆయనకున్న నిబద్ధతను నేను అభినందిస్తున్నట్లు ట్వీట్ లో వెల్లడించారు.

చంద్రబాబు హామీ
ప్రధాని మోదీ ట్వీట్ పై సీఎం చంద్రబాబు స్పందించారు. ప్రజల సహకారంతో, కేంద్ర ప్రభుత్వ మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తామని సీఎం చంద్రబాబు తెలిపారు. అన్ని ప్రాంతాల సమగ్ర అభివృద్ధి సాధించి తమకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతామని అన్నారు. ఈ సందర్భంగా ప్రతి ఒక్కరికి పేరుపేరునా సీఎం చంద్రబాబు ధన్యవాదాలు తెలిపారు.
ప్రజల సహకారంతో, కేంద్ర మద్దతుతో, పక్కా ప్రణాళికతో అందరికీ అవకాశాలు సృష్టించేలా, రాష్ట్రానికి చోదక శక్తిగా నిలిచేలా ఫ్యూచర్ సిటీగా రాజధాని అమరావతిని నిర్మిస్తాం. అన్ని ప్రాంతా ల సమగ్ర అభివృద్ధి సాధించి.... మాకు అండగా ఉన్న ప్రజల నమ్మకాన్ని నిలబెడతాం అని తెలుపుతూ...ప్రతి ఒక్కరికి పేరుపేరునా ధన్యవాదాలు తెలియజేస్తున్నట్లు ట్వీట్ లో పేర్కొన్నారు.












Click it and Unblock the Notifications