వైసీపీ ఎంపీ అభ్యర్దుల ఖరారు - ఎవరెక్కడ, జాబితాలో..!!
సీఎం జగన్ అభ్యర్దుల జాబితా ఖరారు కసరత్తు వేగవంతం చేసారు. ఇప్పటికే ఇంఛార్జ్ ల మార్పులో భాగంగా రెండు జాబితాలను ప్రకటించారు. ఈ రోజు మూడో లిస్టు ప్రకటనకు సిద్దమవుతున్నారు. ఎమ్మెల్యేలతో పాటుగానే ఎంపీ అభ్యర్దులను ప్రకటించనున్నారు. కొందరు ఎంపీలను ఎమ్మెల్యేలుగా బరిలోకి దింపుతున్నారు. సీనియర్లు, కొందరు మంత్రులను ఎంపీలుగా నిలబడుతున్నారు. 25 స్థానాలకు వైసీపీ ఎంపీల అభ్యర్దుల జాబితా దాదాపు ఖరారైంది.
జాబితాపై కసరత్తు:ఏపీలో సీఎం జగన్ ఈ సారి ఎన్నికలను ప్రతిష్ఠాత్మకంగా తీసుకున్నారు. ప్రతీ స్థానంలో అభ్యర్ది ఎంపికలో ఆచూతూచి వ్యవహరిస్తున్నారు. గెలుపే ప్రామాణికంగా ఖరారు చేస్తున్నారు. అందులో భాగంగా ఒకటి రెండు రోజుల్లోనే మొత్తం 175 అసెంబ్లీ అభ్యర్దులతో పాటుగా 25 లోక్ సభ అభ్యర్దులను ప్రకటించాలని నిర్ణయించారు.

సంక్రాంతి నుంచి ప్రతీ అభ్యర్ది ప్రజల్లోనే ఉండేలా కార్యాచరణ సిద్దం చేస్తున్నారు. అందులో భాగంగా సీట్లు దక్కని వారికి ఎమ్మెల్సీ, రాజ్యసభ, భవిష్యత్ హోదాలపైన హామీ ఇస్తున్నారు. ఇక...ఎంపీల అభ్యర్దుల విషయంలో దాదాపు ఒక నిర్ణయానికి వచ్చినట్లు తెలుస్తోంది. చివరి నిమిషంలో మార్పులు, చేర్పులు మినహా అభ్యర్దులు ఖరారైనట్లేనని పార్టీ నేతలు చెబుతున్నారు.
మార్పులు - చేర్పులు:వైసీపీ నుంచి పోటీ చేసే అభ్యర్దుల జాబితాలో శ్రీకాకుళం - దానేటి శ్రీధర్, కిల్లి కృపారాణి, పిరియా విజయలో ఒకరికి అవకాశం దక్కనుందని తెలుస్తోంది. విజయనగరం - బెల్లాన చంద్రశేఖర్ స్థానంలో మజ్జి శ్రీనివాసరావుకి ఖరారైంది. విశాఖపట్నం - పరిశీలనలో బొత్స ఝాన్సీలక్ష్మి పేరు ఉంది. అరకు - ఎమ్మెల్యే భాగ్యలక్ష్మి, అనకాపల్లి - కరణం ధర్మశ్రీ.
కాకినాడ -చలమలశెట్టి సునీల్ లేదా ముద్రగడ అంగీకరిస్తే సీటు కేటాయిస్తారని తెలుస్తోంది. అమలాపురం - ఎలీజా వైపు మొగ్గు చూపుతున్నారు. రాజమండ్రి - పరిశీలనలో డాక్టర్ అనుసూరి పద్మలత(శెట్టిబలిజ సామాజికవర్గం)కు ఇస్తారని పార్టీలో ప్రచారం జరుగుతోంది. నరసాపురం - గోకరాజు గంగరాజు, శ్రీరంగనాథరాజు లో ఒకరిని ఎంపిక చేయనున్నారు. ఏలూరు - అరసవిల్లి అరవింద్, మరో మాజీ మంత్రి పేరు ప్రముఖంగా వినిపిస్తోంది.
గెలుపే ప్రామాణికంగా:మచిలీపట్నం - వల్లభనేని స్థానంలో డైరెక్టర్ వీవీ వినాయక్ పేరు తెర మీదకు వచ్చింది. విజయవాడ నుంచి టీడీపీలో మారుతున్న లెక్కలతో ప్రస్తుతానికి పెండింగ్ పెట్టారు. గుంటూరు, నర్సరావు పేట స్థానాల్లో ఎంపీ లావు శ్రీకృష్ణదేవరాయుల నిర్ణయానికి అనుగుణంగా ఈ రెండు స్థానాలు ఖరారు కానున్నాయి. బాపట్ల ఎస్‌సీ - నందిగం సురేశ్, ఒంగోలు - మాగుంట శ్రీనివాసులు లేదా ఆయన కుమారుడు, నెల్లూరు- వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి, నంద్యాల - పోచా బ్రహ్మానందరెడ్డితో పాటుగా నటుడు ఆలీ పేరు వినిపిస్తోంది.
కర్నూలు - సంజీవ్‌కుమార్, గుమ్మనూరి జయరాం పేర్లు పరిశీలనలో ఉన్నాయి. అనంతపురం - శంకరనారాయణ, హిందూపురం - జె.శాంతమ్మ, కడప - వైఎస్ అవినాశ్‌రెడ్డి. తిరుపతి - డాక్టర్ గురుమూర్తి, రాజంపేట - మిథున్‌రెడ్డి, చిత్తూరు - ఎస్.రెడ్డప్ప పేర్లు ఖాయమని తెలుస్తోంది. ఒకటి రెండు రోజుల్లోనే జాబితాను అధికారికంగా ప్రకటించే అవకాశం ఉంది.












Click it and Unblock the Notifications