Get Updates
Get notified of breaking news, exclusive insights, and must-see stories!

చంద్రబాబు అర్దాంగి కుప్పంలో బైబై బాబు అంటున్నారు - సీఎం జగన్..!!

ముఖ్యమంత్రి జగన్ కీలక వ్యాఖ్యలు చేసారు. ఎన్నికలకు మనం సిద్దం అంటుంటే చంద్రబాబు సతీమణి తన భర్త సిద్దంగా లేరని చెబుతున్నారని పేర్కొన్నారు. కుప్పంలో చంద్రబాబు అర్దాంగి బైబై బాటు అంటున్నారని సీఎం వ్యాఖ్యానించారు. కుప్పంలోనూ చంద్రబాబును ఎవరూ సమర్ధించటం లేదన్నారు. ఏపీలో ఉండని వారంతా చంద్రబాబుకు మద్దతుగా ముందుకొస్తున్నారని విమర్శించారు. తనకు దళారుల తో పని లేదని..మంచి చేస్తేనే తనకు అండగా నిలవాలని జగన్ పిలుపునిచ్చారు.

ఇంటి స్థలాల పంపిణీ : ఒంగోలు మునిసిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలో 20,840 మంది అక్కచెల్లెమ్మలకు సర్వ హక్కులతో రిజిస్టర్‌ చేసిన కన్వేయన్స్‌ డీడ్లు, ఇళ్లు మంజూరు పత్రాలను పంపిణీ చేసారు. రాష్ట్రంలో 31 లక్షల మంది మహిళ లకు ఇంటి పట్టాలు ఇచ్చామని చెప్పుకొచ్చారు. చంద్రబాబు ఒక్క పేదవాడికి ఇంటి స్థలాలు ఇవ్వలేదని జగన్ పేర్కొన్నారు. పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే కేసులు వేయించారని వివరించారు. ఇంటి స్థలాలు అడ్డుకొనేందుకు 1191 కేసులు వేసారని జగన్ చెప్పారు. పేదలకు చంద్రబాబు కష్టాలు, కన్నీళ్లు మిగిల్చారని విమర్శించారు. చంద్రబాబు కేసులను, ఇబ్బందులను అధిగమించి పేదలకు ఇంటి పట్టాలు ఇస్తున్నామన్నారు. రాజధానిగా చెప్పుకుంటున్న అమరావతిలో పేదలకు ఇంటి స్థలాలు ఇస్తుంటే ఇవ్వటానికి వీళ్లేదని సామాజిక సమతుల్యత దెబ్బ తింటుందని కోర్టులో కేసులు వేసారని చెప్పుకొచ్చారు.

CM Jagan Reacts over Buvaneswari latetest comments on Contesting from Kuppam

సీఎం జగన్ వ్యాఖ్యలు : దుర్మార్గాలు చేస్తున్న చంద్రాబు బెరుకు, భయం లేకుండా రాజకీయాలు చేస్తున్నారని జగన్ వ్యాఖ్యానించారు. చంద్రబాబు పేరు చెబితే గుర్తుకు వచ్చే ఒక్క మంచి అయినా ఉందా అని ప్రశ్నించారు. తాను మాట్లాడుతుంటే సవాల్ చేస్తావా అంటున్న చంద్రబాబు తాను ఏం చేసిందీ చెప్పుకోలేరని ఎద్దేవా చేసారు. కుప్పంలో తాజాగా చంద్రబాబు సతీమణి భువనేశ్వరి చేసిన వ్యాఖ్యల పైన జగన్ స్పందించారు.ఎన్నికలకు మనం సిద్దం అంటుంటే..మా ఆయన సిద్దంగా లేరని చంద్రబాబు సతీమణి అంటున్నారని పేర్కొన్నారు. చంద్రబాబు లాగా తనకు దత్తపుత్రుడు, ఏపీతో సంబంధంలేని వారి మద్దతు లేదని జగన్ వివరించారు. తాను దళారులను నమ్ముకోలేదని... దేవుడిని, ప్రజలను నమ్ముకున్నానని చెప్పుకొచ్చారు. రాబోయే రోజుల్లో మోసాలు చేస్తారని.. అబద్దాలు నమ్మకండని జగన్ కోరారు.

CM Jagan Reacts over Buvaneswari latetest comments on Contesting from Kuppam

అండగా నిలబడండి : గతంలో పెత్తందారులకు మాత్రమే నామినేటెడ్‌ పదవులు దక్కాయని సీఎం జగన్ వివరించారు. తన ప్రభుత్వంలో బలహీన వర్గాలకు పదవులు ఇచ్చిన తీరును విశ్లేషించారు. గత ప్రభుత్వానికి తన ప్రభుత్వానికి తేడా గమనించాలని కోరారు. దల ఆత్మగౌరవం గురించి గతంలో ఏ ప్రభుత్వం ఆలోచన చేయలేదన్నారు. రిజిస్ట్రేషన్‌ పట్టాలు ఇవ్వడం వల్ల ఆస్తి మీద పూర్తి హక్కు లబ్దిదారులకు వస్తుందని చెప్పారు. గ్రామ సచివాలయాల నుంచి సర్టిఫైడ్ కాపీలు అందుతాయని వెల్లడించారు. రిజిస్ట్రేషన్ పట్టాలు ఉండటం వలన కబ్జాలకు అవకాశం ఉండదని జగన్ స్పష్టం చేసారు. మంచి జరిగితే మాత్రం తనకు తోడుగా, అండగా నిలబడాలని ముఖ్యమంత్రి జగన్ కోరారు.

More From
Prev
Next
Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+