కేంద్రంతో కుస్తీ పడుతున్నాం - తెలంగాణలో కలిపేయండి : అప్పుడే ప్రాజెక్టుకు నీళ్లు -సీఎం జగన్..!!

గోదావరి ముంపు ప్రాంతాల్లో పర్యటిస్తున్న సీఎం జగన్ పోలవరం ప్రాజెక్టు ప్రభావిత గ్రామాల ప్రజలకు కీలక హామీ ఇచ్చారు. పునరావాసం..పరిహారం కోసం కేంద్రంతో పోరాటం చేస్తున్నామని చెప్పారు. రాష్ట్రానికి ఇప్పటికే కేంద్రం నుంచి రెండు వేల కోట్లకు పైగా నిధులు రావాల్సి ఉందన్నారు. పునారావాసం కింద పరిహారం ఇచ్చేందుకు తక్కువ మొత్తం అయితే తానే భాధ్యత తీసుకొనేవాడినని.. దాదాపు 20 వేల కోట్లు అవుతుందని చెప్పుకొచ్చారు. పోలవరం ప్రాజెక్టు నిధుల కోసం కేంద్రంతో కుస్తీ పడుతున్నామన్నారు.

న్యాయం చేశాకే ముందుకు

న్యాయం చేశాకే ముందుకు

అల్లూరి సీతారామరాజు జిల్లాలోని చింతూరు మండలం కోయుగూరులో వరద బాధితులతో ముఖాముఖి నిర్వహించిన ముఖ్యమంత్రి తమ లాంటి మానవత్వం ఉన్న ప్రభుత్వం మరెక్కడా ఉండదని చెప్పుకొచ్చారు. పోలవరం నిర్వాసితులకు న్యాయం చేశాకే పోలవరంలో నీళ్లు నింపుతామంటూ ముఖ్యమంత్రి జగన్ ప్రకటించారు. పరిహారం అందకుండా..వాళ్లకు న్యాయం జరగకుండా పోలవరంలో నీరు నింపనంటూ నిర్వాసితులకు హామీ ఇచ్చారు. వారు ప్రాజెక్టు కోసం త్యాగాలు చేశారని..వారికి గుర్తింపు ఉంటుందని చెప్పుకొచ్చారు. కొందరు గ్రామస్తులు తమను తెలంగాణలో కలపాలంటూ ముఖ్యమంత్రిని కోరారు. ఆ సమయంలో కేంద్రం ఇప్పుడు పోలవరంలో వాళ్లే ప్రతీ అంశంలోనూ నివేదికలు ఇస్తున్నారని..అన్నింటా నిర్ణయాలు తీసుకుంటున్నారని సీఎం చెప్పుకొచ్చారు.

కేంద్రంతో పోరాటం చేస్తున్నాం

కేంద్రంతో పోరాటం చేస్తున్నాం

కేంద్రంతో తాము నిర్వాసితుల సమస్యల పైన పోరాటం చేస్తునే ఉన్నామని.. ఎప్పటికైనా నిధులు ఇవ్వాల్సిందేనని..అవి ముందుగా ఇవ్వాలని కోరుతూ వస్తున్నామని చెప్పారు. కేంద్రం ఇవ్వకుంటే రాష్ట్రమే బాధ్యత తీసుకుంటుందని హామీ ఇచ్చారు. ముంపు మండలాలను కలుపుతూ ఒక రెవిన్యూ డివిజన్ ఏర్పాటు చేసే అంశం పరిశీలిస్తున్నట్లుగా సమాచారం. సహాయం అందరికీ అందాలనే తాపత్రయం.. గతంలో కన్నా పరిస్థితిలో ఎంతో మారిందని సీఎం జగన్‌ వివరించారు. చింతూరులో దాదాపుగా 20 రోజుల నుంచి నీళ్లు ఉన్న పరిస్థితులు చూడలేదన్నారు. నాలుగు మండలాల్లో కలెక్టర్ దాదాపు 20 రోజులుగా మకాం వేసారని చెప్పుకొచ్చారు. సెప్టెంబర్‌ లోగా పోలవరం ముంపు బాధితులకు పరిహారం అందిస్తామని, నిర్వాసితులకు పరిహారం అందాకే.. పోలవరంలో నీళ్లు నింపుతామని సీఎం జగన్‌ తెలిపారు.

అప్పటి దాకా ప్రాజెక్టులో నీళ్లు వదలం

అప్పటి దాకా ప్రాజెక్టులో నీళ్లు వదలం


కేంద్రంపై ఒత్తిడి పెంచుతాం.. నిర్వాసితులను ఆదుకుంటాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. కేంద్రం దగ్గర కాకుంటే ఎవరి వద్ద డబ్బులు ఉంటాయని.. కేంద్రం సాయం చేయాల్సిన అవసరం ఉందని సీఎం వ్యాఖ్యానించారు. పారదర్శకంగా బాధితులకు పరిహారం అందించామన్నారు. అందరికీ రేషన్‌, ఇంటింటికీ రూ. 2 వేలు అందించాం. అధికారులను భాగస్వామ్యం చేసి.. కావాల్సిన వనరులు సమకూర్చాం అని సీఎం జగన్‌ స్పష్టం చేశారు. అర్హత ఉన్న అందరికీ రెండు నెలల్లోగా పరిహారం అందుతుందని, ఎలా ఎగ్గొట్టాలనే ఆలోచన ఈ ప్రభుత్వానికి ఉండబోదని పేర్కొన్నారు సీఎం జగన్‌. తాటాకు గుడిసెల నిర్వాసితులకు పరిహారం రూ. ఐదు వేల నుంచి పదివేలకు పెంచుతామని ముఖ్యమంత్రి హామీ ఇచ్చారు.

Notifications
Settings
Clear Notifications
Notifications
Use the toggle to switch on notifications
  • Block for 8 hours
  • Block for 12 hours
  • Block for 24 hours
  • Don't block
Gender
Select your Gender
  • Male
  • Female
  • Others
Age
Select your Age Range
  • Under 18
  • 18 to 25
  • 26 to 35
  • 36 to 45
  • 45 to 55
  • 55+